China is stealing donkeys: భారత్ నుంచి గాడిదలను దొంగలిస్తున్న చైనా దేశం.. దీని వెనుక పెద్ద స్కెచ్

భారత్ నుంచి గాడిదలను చైనా దేశమే దొంగలిస్తుంది. అవాక్కయ్యారా? కానీ నిజమేనండోయ్. మరి గాడిద ప్రయోజనాలు ఆ రేంజ్ లో ఉన్నాయి అన్నమాట. ఏకంగా వీటి కోసం 6 రాష్ట్రాల గాడిదల అక్రమ రవాణా చేస్తుంది చైనా.

Written By: Srinivas, Updated On : October 22, 2024 1:05 pm

China is stealing donkeys from India

Follow us on

China is stealing donkeys: మనిషిని తిట్టాలంటే చాలా మంది గాడిద మాదిరి ఉన్నావు. కనీసం ఈ పని చేయరాదా అంటారు. నీకన్నా గాడిద నయం, గాడిద కష్టం చేస్తావారా? గాడిది మొఖపోడా ఇలా ఎన్నో మాటలను గాడిదలను ఉద్దేశించి ఉన్నాయి. అయితే అన్ని కేవలం గాడిదిని ఉద్దేశించి అయితే అందులో దాని పని గొప్పతనం కూడా ఉంది. గాడిదలను చిన్న చూపు చూడకండి. దీనితో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కేవలం గాడిద అని తీసేపారేస్తే మీకే నష్టం. ఎందుకంటరా? అవును మీ ఇంటి ముందుకు గాడిద పాలు అంటూ అమ్మడానికి చాలా మంది వచ్చే ఉంటారు కదా. వామ్మో పాలు తాగడమే నచ్చదు. అందులో గాడిద పాలా అంటూ నవ్వుకున్నారా? గాడిద ప్రయోజనాలు తెలిసి ఏకంగా మన దేశం నుంచి ఓ పెద్ద దేశమే దొంగతనం చేస్తుంది. గాడిదలను దొంగతనమా? అని షాక్ అయ్యారా? అయితే చదివేసేయండి.

భారత్ నుంచి గాడిదలను చైనా దేశమే దొంగలిస్తుంది. అవాక్కయ్యారా? కానీ నిజమేనండోయ్. మరి గాడిద ప్రయోజనాలు ఆ రేంజ్ లో ఉన్నాయి అన్నమాట. ఏకంగా వీటి కోసం 6 రాష్ట్రాల గాడిదల అక్రమ రవాణా చేస్తుంది చైనా.
రాజస్థాన్ సహా భారతదేశంలోని 6 రాష్ట్రాల నుంచి గాడిదలను చైనాకు అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారం. ఇంగ్లాండ్ సంస్థ బ్రూక్ ఇండియా అధ్యయనంలో ఈ విషయాలు తెలిసాయి. గాడిద వల్ల పురుషత్వం పెంచవచ్చట. అంటే గాడిద చర్మం పురుషత్వాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది అంటున్నారు నిపుణులు. అలాగే స్త్రీల అందాన్ని పెంచుతుందట ఈ గాడిద చర్మం. ఈ ప్రయోజనాలు దృష్ట్యా గాడిదలను చైనా అక్రమంగా తీసుకెళుతోంది.

గాడిద చర్మంతో మందుల తయారీ కూడా సాధ్యమే అంటున్నారు నిపుణులు. చైనాలోని బ్యూటీ ప్రోడక్ట్స్ తయారీ పరిశ్రమలో గాడిద చర్మం ఎక్కువ వినియోగంలో ఉందట. గాడిద చర్మంతోనే అనేక మందులను తయారు చేస్తున్నారు ఆ దేశం.
అయితే జైపూర్‌లో నాలుగు రోజుల పాటు జరిగిన ఖల్కానీ మాతా గాడిదల జాతరలో కేవలం 15 గాడిదలే రావడంతో అందరూ షాక్ అయ్యారు. ప్రతిసారీ 25,000 కంటే ఎక్కువ గాడిదలు వచ్చేవి. కానీ ఈ సారి మాత్రం 15 గాడిదలు మాత్రమే అమ్మకానికి వచ్చాయట.

అఫ్గానిస్తాన్, కాఠ్‌మాండు నుంచి కూడా గాడిదలను అక్రమంగా తరలిస్తున్నారు. ప్రతి సంవత్సరం జాతరకు లడఖ్, అఫ్గానిస్తాన్, కాఠ్‌మాండు, సింధ్, పంజాబ్, గుజరాత్ నుంచి కూడా చాలా గాడిదలు వస్తుంటాయి. కానీ ఈసారి 15 గాడిదలే రావడంతో అనుమానం వచ్చి ఆరా తీస్తే పూర్తి గుట్టు రట్టు అయింది. దీంతో అక్రమ రవాణా గురించిన షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

చైనా బ్యూటీ ప్రొడక్ట్స్ పరిశ్రమ ఎక్కువగా గాడిదల వల్లనే నడుస్తుందట. అంటే చైనా సౌందర్య సాధనాల పరిశ్రమలో గాడిద చర్మం విస్తృతంగా ఉపయోగిస్తున్నారని ఓ నివేదిక పేర్కొంది. దీని కోసం భారత్ సహా ఇతర దేశాల నుంచి గాడిదలను అక్రమంగా చైనాకు తరలిస్తున్నారు.