China And Russia: చైనా.. అంటేనే కన్నింగ్‌కు కేరాఫ్.. స్నేహానికన్నా.. తన ఎదుగుదల కోసం మిత్ర దేశమైనా.. శత్రుదేశమైనా తొక్కి పడేస్తుంది. ఈ క్రమంలోనే తైవాన్, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంకను తన స్వలాభం కోసం వాడుకుంటోంది. ఇక భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్ తమదే అంటూ తరచూ మ్యాప్‌లు విడుల చేస్తోంది. ఇటీవల చైనా వెళ్లిన అరుణాచల్‌ప్రదేశ్ యువతిని అక్కడి ఎయిర్‌పోర్టు సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. భారత ఎంబసీ చొరవతో వివాదం సద్దుమణిగింది. ఇదిలా ఉంటే.. తాజాగా చైనా.. తన మిత్రదేశమైన రష్యా భూభాగంపైనే కన్నేసింది.
రెండేళ్ల క్రితం మ్యాపు మార్చి..
రష్యా–చైనా సరిహద్దులో ఉస్సూరీ–అమూర్ నదుల మధ్య అతిపెద్ద ద్వీపం బోల్షయ్ ఉస్సూరిస్కీపై చైనా కొత్తగా కన్నేసింది. 1860 నుంచి రష్యా ఆధీనంలో ఉన్న ఈ భూభాగాన్ని 2023 మ్యాపుల్లో తమ ప్రాంతంగా చూపి పేరు మార్చిన చైనా, ఇప్పుడు ఆక్రమణ ప్రణాళికలు రచిస్తోందని రష్యా ఎఫ్‌ఎస్బీ నిఘా సంస్థ 8 పేజీల నివేదికలో హెచ్చరించింది.
చారిత్రక నేపథ్యం..
19వ శతాబ్దంలో క్వింగ్ వంశం బలహీనపడి బ్రిటన్, ఫ్రాన్స్ చేతిలో ఓడిపోయినప్పుడు భద్రతా కారణాలతో ఈ ద్వీపాన్ని రష్యాకు అప్పగించారు. 1860 పెకింగ్ ఒప్పందం, 1958 అమూర్ ఒప్పందాల ద్వారా రష్యా పసిఫిక్ మహాసముద్రంలో ఆధిపత్యం సాధించుకుంది. వ్లాడివోస్తోక్ నగరం ఇక్కడే నిర్మించారు.
ఆర్థిక బలోపేతం తర్వాత వివాదాలు..
చైనా ఆర్థిక సంస్కరణల తర్వాత 4,200 కి.మీ. సరిహద్దు వెంబడి వివాదాలు ముదిరాయి. 1960ల్లో సైనిక కాల్పులు జరిగి 1990ల్లో పలు ఒప్పందాలు కుదిరాయి. 2008లో రష్యా ద్వీపంలో కొంత భాగం వదులుకున్నప్పటికీ, చైనా మ్యాపుల్లో పూర్తి ఆక్రమణ చూపుతోంది.
రష్యా బలహీనతను అవకాశంగా తీసుకుని..
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పాశ్చాత్య ఆంక్షలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న రష్యాపై చైనా కుయుక్తులు పెంచింది. మిత్రదేశంగా పేర్కొంటూ వాణిజ్యం కొనసాగిస్తున్నా, ద్వీప ఆక్రమణ ప్రణాళికలు వేస్తోంది. న్యూస్‌వీక్, న్యూయార్క్ టైమ్స్ కథనాలు ఈ ఉద్రిక్తతను ప్రపంచ దృష్టికి తీసుకొచ్చాయి.