China: అత్యాధునిక టెక్నాలజీతో చైనా చేపడుతున్న ఓ రైల్వే ప్రాజెక్టుకు ప్రకృతియే విఘాతం కలిగిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా సరిహద్దుల్లో తమ లక్ష్యాలను నెరవేర్చుకోవాలనుకుంటున్నది చైనా. కానీ, ఆ లక్ష్యాలు నెరవేరే పరిస్థితులు కనబడటం లేదు. డ్రాగన్ కంట్రీ చేపడుతున్న ఈ రైల్వే నెట్‌వర్క్ ద్వారా భారత్‌పైన కూడా ఇంపాక్ట్ పడనుంది. అయితే, ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి శాస్త్రవేత్తలు ఏం చేయబోతున్నారనే విషయాలపై ఫోకస్..

డ్రాగన్ కంట్రీ ఇప్పటికే ఎన్నో విషయాల్లో సత్తా చాటింది. బ్రహ్మపుత్ర రివర్‌పై జల విద్యుత్ ప్రాజెక్టు, స్పేస్ రీసెర్చ్‌లో పట్టు సాధించిన చైనా చెంగ్డు-లాసా మధ్య రైల్వే లైన్ ఏర్పాటు చేయడంలో మాత్రం విఫలమవుతోంది. ఈ రైల్వేలైన్ ఏర్పాటు చేయాలని 13 వ పంచవర్ష ప్రణాళికలో నిర్ణయించారు. ఈ లైన్ ద్వారా చైనాలో ఉండే రాష్ట్రాల్లో ఒకటైన సిచువాన్‌కు మేలు జరుగుతుందని అనుకున్నారు. టిబెట్ ఏరియాలోని టిబెటన్ పీఠభూమిలో ఈ రైల్వే లైన్ వేయాలని డ్రాగన్ భావిస్తోంది. 2024 నాటికే ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని చైనా భావిస్తోంది. కానీ, ప్రకృతి విసురుతున్న సవాళ్ల వల్ల రైల్వే లైనుకు అడుగులు పడటం లేదు. ఈ క్రమంలోనే ప్రకృతి విసురుతున్న సవాళ్లను అధిగమించేందుకు చైనా శాస్త్రవేత్తలు తలలు పట్టుకుంటున్నారు.
చెంగ్డు నుంచి లాసా వరకు రీచ్ కావాలంటే ప్రస్తుతం 50 గంటల టైం పడుతుంది. చైనా చేపట్టిన ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయితే కనుక జర్నీ టైం 50 గంటల నుంచి 12 గంటలకు తగ్గుతుంది. అయితే, అందుకు ఎంత అత్యాధునికమైన టెక్నాలజీ వినియోగించాలనుకున్నప్పటికీ ప్రకృతి సహకరించడం లేదు. ఆయా ప్రాంతాల్లో ఉండే భౌగోళిక అస్థిరత, వాటర్ సిస్టమ్, ఎన్విరాన్‌మెంట్ ఇబ్బంది కరంగా మారుతోంది. ఎత్తయిన పర్వతాల మధ్య వంతెనలు, లోతైన సొరంగాలు నిర్మించడం చాలా కష్టం. భారీ ఉష్ణోగ్రతలలో సొరంగాలలో తవ్వకాలు చేపట్టడం అసాధ్యం. ఈ నేపథ్యంలోనే భూగర్భంలో రైల్వే లైను కోసం శాస్త్రవేత్తలు కొత్త టెక్నాలజీ వాడాలనుకున్నారు.
Also Read: Putin India Tour: భారత్ లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన కొత్త స్నేహానికి దారితీస్తుందా..?
ఎంత టెక్నాలజీ వినియోగం చేపట్టాలని అనుకుంటున్నప్పటికీ ప్రకృతి రూపంలో తలెత్తే సమస్యలు ప్రాజెక్టు భద్రతా ప్రమాణాలకే ముప్పుగా పరిణమించనున్నాయి. దీంతో చైనా ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నదనే విషయం ఆసక్తికరంగా మారింది. అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో ఉండే హిమాలయాలు, టిబెటన్ పీఠభూమి ప్రాంతంలో రైల్వే లైన్ ఏర్పాటు చేయడమనేది అతి క్లిష్టమైన ప్రక్రియగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన రైల్వే ప్రాజెక్టు ఇదేనని, సిచియాన్-టిబెట్ మధ్య ఈ రైల్వే లైను ఏర్పాటు అనేది సవాళ్లతో కూడుకున్న విషయమని పలు నివేదికలు చెప్తున్నాయి. దాంతో ఈ సవాళ్లను చైనా ఎలా అధిగమిస్తుందో అనే చర్చ జరుగుతున్నది.
Also Read: అంబేద్కర్ వర్ధంతి: ఆయన విగ్రహాలకే కాదు ఆశయాలకు నేతల దండలేనా?