Homeఅంతర్జాతీయంCanada : కెనడా కొత్త ప్రభుత్వంలో ఇద్దరు భారతీయులు.. మంత్రులగా ప్రమాణం..!

Canada : కెనడా కొత్త ప్రభుత్వంలో ఇద్దరు భారతీయులు.. మంత్రులగా ప్రమాణం..!

Canada : అందమైన, ధనిక దేశం కెనడా. ఈ దేశానికి భారతీయులు విద్య, ఉద్యోగాల కోసం వెళ్తున్నారు. ఇక కెనడా జనాభాలో 6 శాతం సిక్కులు ఉన్నారు. ఆ దేశ ఎన్నికల్లో వీరి పాత్ర చాలా కీలకం. అయితే రెండేళ్ల క్రితం(Two years back) వరకు భారత్‌–కెనడా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. పెట్టుబడులు, దౌత్యపరమైన సంబంధాలు బలంగా ఉండేవి. అయితే ఆ దేవంలో నిజ్జర్‌ అనే వేర్పాటువాది హత్యకు గురయ్యాడు. దీనికి భారతీ దౌత్య వేత్తలే కారణమని అప్పటి ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపించారు. విచారణ జరిపేందుకు సిద్ధమయ్యారు. దీంతో అప్రమత్తమైన భారత్‌.. దౌత్యాధికారులను వెనక్కి రప్పించింది. ఆ తర్వాత ట్రూడో కూడా విశ్వాసం కోల్పోయారు. దీంతో నూతన ప్రధానిని ఎన్నుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మార్క్‌ కార్నీ(Mark Kanry) నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కార్నీ కేబినెట్‌లో ఇద్దరు భారత సంతతి మహిళలు, అనితా ఆనంద్‌ మరియు కమల్‌ ఖేరా, మంత్రులుగా చోటు దక్కించుకున్నారు. ఈ క్యాబినెట్‌ మార్చి 14న ఒట్టావాలోని రిడో హాల్‌లో గవర్నర్‌ జనరల్‌ మేరీ సైమన్‌ అధ్యక్షతన జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అధికారికంగా ప్రారంభమైంది.

Also Read : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన మగ్గురు మృతి

వ్యక్తిగత వివరాలు..
అనితా ఆనంద్‌ (58): ఆమె నావీన్యత, విజ్ఞానం మరియు పరిశ్రమల మంత్రిగా నియమితులయ్యారు. ఆమె 2019లో ఓక్‌విల్లె నుండి మొదటిసారి ఎంపీగా ఎన్నికై, గతంలో ట్రెజరీ బోర్డు అధ్యక్షురాలు, జాతీయ రక్షణ మంత్రి, మరియు పబ్లిక్‌ సర్వీసెస్‌ అండ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ మంత్రిగా పనిచేశారు. నోవా స్కోటియాలో జన్మించిన ఆమె, టొరంటో విశ్వవిద్యాలయంలో చట్ట ఆచార్యురాలిగా పనిచేసిన న్యాయవాది మరియు పరిశోధకురాలు.

కమల్‌ ఖేరా(36): ఆమె ఆరోగ్య మంత్రిగా నియమితులయ్యారు. ఢిల్లీలో జన్మించిన కమల్, చిన్నతనంలో కెనడాకు వలస వచ్చి, 2015లో బ్రాంప్టన్‌ వెస్ట్‌ నుండి ఎంపీగా ఎన్నికైంది. ఆమె కెనడా పార్లమెంట్‌లో ఎన్నికైన అతి పిన్న వయస్కురాలైన మహిళల్లో ఒకరు. రిజిస్టర్డ్‌ నర్సుగా పనిచేసిన ఆమె, కోవిడ్‌–19 మొదటి వేవ్‌ సమయంలో బ్రాంప్టన్‌లోని ఆరోగ్య సంస్థల్లో స్వచ్ఛందంగా సేవలందించారు. గతంలో ఆమె సీనియర్స్‌ మంత్రిగా, అంతర్జాతీయ అభివృద్ధి, జాతీయ ఆదాయ శాఖలలో పార్లమెంటరీ సెక్రటరీగా పనిచేశారు.

కేబినెట్‌ కూర్పు ఇలా..
కార్నీ యొక్క క్యాబినెట్‌లో 13 మంది పురుషులు, 11 మంది మహిళలు ఉన్నారు, ఇది గత ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో యొక్క 37 మంది సభ్యుల బృందం కంటే చిన్నది. ‘మేము ఈ క్షణానికి సరిపడే చిన్న, దృష్టి కేంద్రీకరించిన, అనుభవజ్ఞులైన బృందాన్ని రూపొందించాము‘ అని కార్నీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఇద్దరు భారత సంతతి మంత్రులు గత ట్రూడో క్యాబినెట్‌ నుంచి తమ పదవులను కొనసాగిస్తున్నప్పటికీ, వేర్వేరు శాఖలకు మారారు.

Also Read : ట్రంప్‌ రివర్స్‌ గేర్‌.. కెనడాపై డబుల్‌ సుంకాల విషయంలో వెనక్కు తగ్గిన అగ్రరాజ్యాధినేత!

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version