Homeఅంతర్జాతీయంCalifornia Mosquito Project: దెబ్బకు దెబ్బ.. దోమలవ్యాప్తికి వినూత్న ప్రయోగం.. ఇది సక్సెస్ అయితే దోమ...

California Mosquito Project: దెబ్బకు దెబ్బ.. దోమలవ్యాప్తికి వినూత్న ప్రయోగం.. ఇది సక్సెస్ అయితే దోమ జాతి అంతం..

California Mosquito Project: వర్షాకాలం సమీపిస్తోంది. ఇన్నాళ్లు ఎండ దెబ్దతో అల్లాడిన ప్రజల ప్రస్తుతం కాస్త చల్లబడినట్లు తెలుస్తోంది. అయితే వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉన్నా కూడా.. పరిశుభత్ర విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే అనేక వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. దోమల నివారణకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఇతర వాటి నుంచి తప్పించుకోవడం కష్టం. మనం ఇంట్లో జాగ్రత్తలు తీసుకున్నా.. బయటికి వెళ్లినప్పుడు వీటి దాడికి గురికావడమే. అయితే అమెరికాలోని కాలిఫోర్నియాలో బయట ప్రదేశాల్లో కూడా దోమలు లేకుండా ప్రయత్నాల చేస్తున్నారు. అందుకోసం ఏం చేస్తన్నారంటే?

ప్రజారోగ్య రక్షణలో భాగంగా, దోమల సంతతిని నియంత్రించేందుకు కాలిఫోర్నియా గూగుల్ ఒక కీలక ప్రయోగానికి సిద్ధమవుతోంది. డెంగీ, జికా, చికెన్‌గున్యా వంటి ప్రాణాంతక వ్యాధులను వ్యాపింపజేసే ఆడ దోమలను అరికట్టడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం. దీనికోసం రాబోయే రెండేళ్ల కాలంలో దాదాపు 3.2 కోట్ల మగ దోమలను ల్యాబ్‌లో ప్రత్యేకంగా అభివృద్ధి చేసి, వాటిని నగరంలో విడుదల చేసేందుకు గూగుల్ ప్రభుత్వ అనుమతులను కోరింది. ఈ దోమలను ఎందుకు పెంచతున్నారంటే?

ల్యాబ్‌లో పెంచిన ఈ మగ దోమలలో ‘వోల్బాకియా’ (Wolbachia) అనే సహజ సిద్ధమైన బ్యాక్టీరియాను ప్రవేశపెడతారు. ఇవి వాతావరణంలోకి వచ్చిన తరువాత మనుషులను కుట్టవు .కాబట్టి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఈ మగ దోమలను ప్రకృతిలోకి విడుదల చేసినప్పుడు, అవి అడ దోమలతో జతకడతాయి. ‘వోల్బాకియా’ కలిగిన మగ దోమలు, అడ దోమలతో జతకట్టినప్పుడు ఆ అడ దోమలు పెట్టే గుడ్లు పొదగవు . దీనివల్ల తర్వాతి తరం దోమల ఉత్పత్తి క్రమంగా తగ్గిపోతుంది. ఈ పద్ధతిని ‘ఇన్‌కంపాటబుల్ ఇన్‌సెక్ట్ టెక్నిక్’ అని పిలుస్తారు.

కాలక్రమేణా, దోమల జనాభా గణనీయంగా తగ్గిపోవడం వల్ల వ్యాధుల వ్యాప్తి ఆగిపోతుంది. రసాయన మందులు (కిటకనాశినులు) చల్లాల్సిన అవసరం లేకుండానే, ప్రకృతి సిద్ధంగానే దోమల బెడదను శాశ్వతంగా అరికట్టవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే, ప్రపంచవ్యాప్తంగా దోమల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలకు ఇది ఒక దిక్సూచిగా మారే అవకాశం ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version