Viral Video: ఒక అమ్మాయి మనసు తెలుసుకుంటే.. ఆమెను గుర్తెరిగి నడుచుకుంటే.. ఆమెను గెలవడం ఖాయం. అలా ఏర్పడిన ప్రేమ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. కలకాలం దృఢంగా నిలబడి ఉంటుంది. ఈ విషయాన్ని నిరూపించాడు బ్రెజిల్ దేశానికి చెందిన ఒక యువకుడు. అతడు తన భార్యపై చూపించిన ప్రేమకు మనదేశంలోని సుప్రసిద్ధ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఫిదా అయిపోయాడు. దానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశాడు.
బ్రెజిల్ లో జోస్ అనే వ్యక్తి ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. అతడు సింథియా అనే యువతిని ప్రేమించాడు. ఆమె థెరపిస్ట్ గా పని చేస్తోంది. ఇటీవల వారిద్దరూ ఒక చర్చిలో పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా సింథియాకు విలువైన బహుమతి అందించాడు. అరుదైన సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్న కొంతమంది చిన్నారులకు సింథియా స్పీచ్ థెరపీ చేస్తోంది. వారిని సొంత పిల్లల్లా చూసుకుంటున్నది. సింథియా మనసు తెలుసుకున్న జోస్ తమ వివాహ వేడుకకు వారిని కూడా పిలిచాడు. పెళ్లి వేడుక సమయంలో పాస్టర్ ద్వారా ఈ విషయాన్ని జోస్ సింథియా కు చెప్పించాడు. దీంతో సింథియా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్న పిల్లలు ప్రత్యేక వస్త్రధారణతో ఒక్కొక్కరుగా వివాహ వేదిక వద్దకు వస్తుండగా.. సింథియా మురిసిపోయింది. కన్నీరు పెట్టుకుంది. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశాడు.
“బ్రెజిల్ దేశంలోని ఇంజనీర్ అయిన జోస్ స్పీచ్ థెరపిస్ట్ సింథియా ను వివాహం చేసుకున్నాడు. సిండ్రోం వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు తన భార్య స్పీచ్ థెరపి అందిస్తోంది. వారందరినీ తన పెళ్లి వేడుకకు అతిథులుగా జోస్ ఆహ్వానించాడు. ఇది సింథియాకు అమితమైన ఆనందాన్నిచ్చింది. రింగ్ బేరర్లుగా తన విద్యార్థులు కనిపించడం సింథియాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రపంచంలో ఏదో ఒక మూల ఒక మంచి జరుగుతుంటుందని” ఆనంద్ మహీంద్రా రాసుకొచ్చారు.
ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన ఈ వీడియో పట్ల నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. “అద్భుతమైన వీడియో ఇది. తన భార్యను ఆ భర్త తెలుసుకున్నాడు. ఆమె మనసును గెలుచుకున్నాడు. వారి బంధం కలకాలం నిలిచి ఉంటుంది. ప్రేమలో నమ్మకం ఉండాలి. ఆ నమ్మకమే ఇలాంటి ఆశ్చర్యకరమైన కానుకలకు దారితీస్తుందని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
José, an engineer in Brazil, arranged this surprise for his bride, Cíntia, a speech therapist.
He invited her students to be the ring bearers.
Something good happens, every minute of the day, in every corner of the world…#WorldDownSyndromeDay pic.twitter.com/Js6GeFIpTn
— anand mahindra (@anandmahindra) March 21, 2024