Egypt Boats: ఈజిప్ట్.. పురాతన నాగరికతకు, చారిత్రక నిర్మాణాలకు, కళలకు, ఎన్నో చారిత్రక రహస్యాలకు నిలయం. మమ్మీలు, పిరమిడ్‌లు ఈజిప్షియన్ల కళా నైపుణ్యానికి అద్దం పడతాయి. వీటి పేర్ల చెప్పగానే ఇవి ఈజిప్షియన్ల నిర్మాణాలని చెప్పేస్తారు. అంతలా విశ్వవ్యాప్తంగా ఖ్యాతిని గడించాయి. అయితే ఈ నిర్మాణాలు సుమారు 4,500 ఏళ్ల క్రితం నాటివని పరిశోధకులు గుర్తించారు. అయితే తాజాగా పిరమిడ్‌ల నిర్మాణం కన్నా పురాతన నిర్మాణాలను ఆర్కియాలజిస్టులు గుర్తించారు. అవే బోట్ సమాధులు. నైలు నది ఒడ్డున ఓడారిలో 14 బోట్ సమాధులు ఈజిప్షియన్ల కళానైపుణ్యాన్ని చాటుతున్నాయి.
1988లో బయటపడిన బోట్లు..
ఈజిప్ట్ రాజధానిక కైరోకు సుమారు 550 కిలోమీటర్ల దూరంలో నైలు నది పరీవాహక ప్రాంతంలో విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. ఒకవైపు నది ప్రవహిస్తుంటే.. మరోవైపు ఇసుక దిబ్బలతో ఎడారిగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎలాంటి జనజీవనం కనిపించదు. కానీ.. అనేక తుపాన్లు, వరదల తర్వాత 1988లో ఈ ఎడారి ప్రాంతంలో బోట్లను పోలిన ఆకృతులు బయటపడ్డాయి. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి పేర్చినట్లుగా ఉన్నాయి.
పూర్తిగా చెక్కతో నిర్మాణం..
ఈ 14 బోట్లు పూర్తిగా చెక్కతో నిర్మించినట్లు ఆర్కియాలజిస్తుటు గుర్తించారు. అయితే వాటిని తీయడానికి వీలు లేకపోవడంతో ఆధునిక టెక్నాలజీతో త్రీడీ మోడల్ నిర్మించారు. అదే విధంగా నమూనాల నుంచి సేకరించిన షాంపిల్స్‌ను పరిశోధించారు. ఇవి పూర్తిగా చెక్కతో నిర్మించినట్లు నిర్ధారించారు. సుమార 5 వేల ఏళ్ల క్రితం వీటిని నిర్మించినట్లు తేల్చారు. వీటి నిర్మాణంలో నాటి కాలం నిర్మాణాలకంటే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడినట్లు గుర్తించారు. తాళ్లు, చెక్కలతో ఈ నిర్మాణాలు చేసినట్లు నిర్థారణ అయింది.
విందులు వినోదాల కోసమని..
ఈ నిర్మాణాలు ఈజిప్టు రాజులు విందులు వినోదాల కోసం నిర్మించుకుని ఉంటారని భావించారు. నిర్మాణ శైలి ప్రత్యేకంగా ఉండడం సమీపంలో పాత్రలు లభించడంతో ఇక్కడ రాజులు వినోద కార్యక్రమాలు చేసుకునేవారని భావించారు. అందుకోసమే ఈ బోట్లు ఎడారిలో నిర్మించి ఉంటారని అనుకున్నారు. వరదలకు కొట్టుకొచ్చి ఉంటే ఇలా వరుసక్రమంలో ఉండేవి కావని, ప్రత్యేక నిర్మాణాలు అయినందునే ఇలా ఉన్నాయని తేచ్చారు.
అడుగున మంటి, ఇటుకలు..
ఇదిలా ఉంటే.. బోట్ల నిర్మాణం అడుగున మంటి, ఇటుకలు ఉన్నాయి. ఇటుకలు, పాత్రల నమూనాలు పరిశీలించి ఇవి 5 వేల ఏళ్ల క్రితం నాటివే అని గుర్తించారు. అయితే ఇవి విందుల కోసం నిర్మించినవి కావని, చనిపోయిన వారిని పూడ్చేందుకు నిర్మించారని నిర్ధారించారు. అందుకే నిర్మాణంలో అడుగున మంట్టి, ఇటుకలు వాడినట్లు తెచ్చారు. అత్యంత ఆకర్షనీయంగా కనిపించేందుకు డంగు సున్నంతో నిర్మాణాలు చేశారని తేలింది.
ఈజిప్షియన్ల సంప్రదాయం..
ఈజిప్షియన్ల సంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోతే.. వారి సమాధిలో వారు జీవించి ఉన్నప్పుడు వాడిన వస్తువులు, ఆభర ణాలతోపాటు వారికి ఇష్టమైన వారిని కూడా అందులో పూడ్చేవారు. మరణానంతరం కూడా వారు విలాసవంతంగా జీవించాలని అవసరమైన వస్తువులు సమాధిలో ఉంచేవారు. ఈ క్రమంలోనే ఈ బోటు సమాధులు నిర్మించారని, ఇందులో రాజ వంశీయులను సమాధి చేసి ఉంటారని పరిశోధనల్లో నిర్ధారణ అయింది.
మొత్తంగా ఈజిప్షియన్ల పిరమిడ్‌లే పురాతనమైనవి అనుకుంటే.. అంతకన్నా 500 ఏళ్ల పురాతనమైన బోటు సమాధులు బయటపడడం అంరినీ ఆశ్చర్యపరుస్తోంది. అందుకే ఈజిప్షియన్లు కళా నైపుణ్యానికి, సృష్టి రహస్య నిర్మాణాలకు ప్రతీకలుగా నిలిచారు.