Bangladesh riots: బంగ్లాదేశ్‌లో రోజువారీ అస్థిరతలు తీవ్రతరమవుతున్నాయి. ఇంకిలాబ్ ఉద్యమ నేత ఉస్మాన్ హాదీ హత్య తర్వాత అల్లర్లు తీవ్రమయ్యాయి. ముఖ్యంగా భారత వ్యతిరేకతను బంగ్లాదేశీయుల్లో పెంచాలని మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నించింది. అందుకే అల్లర్లను ప్రోత్సహించింది. మైనారిటీలు అయిన హిందువలపై దాడి చేయిస్తోంది. అయిత తాజాగా హాదీ హత్య వెనుక తాత్కాలిక ప్రభుత్వం ఉందన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. హాదీ సోదరుడు ఒమర్ ఈ ఘటనను యూనస్ పాలకులు రచించిన కుట్రగా చిత్రీకరించారు. దీని ద్వారా వచ్చే ఏడాది ఎన్నికలను ఆపేయాలనే ఉద్దేశమని ఆరోపించాడు. దర్యాప్తు వేగవంతం చేయాలని డిమాండ్ చేశాడు. హంతకులకు శిక్షించబడకపోతే పాలకులకు షేక్ హసీనా లాంటి పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు.
అవామీ లీగ్ నిషేధం..
అవామీ లీగ్‌పై ప్రభుత్వం విధించిన నిషేధం 2026 ఎన్నికల్లో ఆ పార్టీ పాల్గొనే అవకాశం లేకుండా చేసింది. అవామీలీగ్ షేక్ హసీనాకు సంబందించిన పార్టీ. అయితే దీనిపై అమెరికా చట్టసభ్యులు తీవ్ర అసంతృప్తి తెలిపారు. పౌరులకు అందరి పార్టీలతో పోటీ చేసే హక్కు ఉండాలని, పారదర్శక ఎన్నికలు జరగాలని ఒత్తిడి చేశారు. నిషేధాన్ని పునః పరిశీలించాలని సూచించారు, ఇది యూనస్ పాలనకు అంతర్జాతీయ ఒత్తిడిని పెంచుతోంది.
మీడియాపై దాడులు, బెదిరింపులు
అస్థిరతలు మరింత ఊపందుకుంటున్న నేపథ్యంలో మీడియా సంస్థలపై దాడులు, బెదిరింపులు పెరుగుతున్నాయి. ఇటీవల పలు వార్తా సంస్థలు లక్ష్యంగా మారాయి. తాజాగా గ్లోబల్ టీవీ చీఫ్ నాజ్నిన్ మున్నీన్‌కు తీవ్ర బెదిరింగ్ మెసేజ్‌లు వచ్చాయి. ఆమె తొలగిస్తారా లేదా అని ప్రశ్నిస్తూ, తీవ్ర పరిణామాలు జరుగుతాయని హుందాటం చేశారు.
హాదీ హత్యను ఎన్నికల రద్దుకు ఉపయోగించాలనే ఆరోపణలు యూనస్ ప్రభుత్వాన్ని కష్టాల్లోకి నెట్టాయి. షేక్ హసీనా పతనానికి కారణమైన విద్యార్థి ఉద్యమంలో హాదీ కీలక పాత్ర పోషించడం గుర్తుంచుకుంటే, ఈ ఆరోపణలు పాలకులకు మరింత ఒత్తిడి. అమెరికా సలహాలు, ఆంతరిక ఆందోళనలు కలిసి ప్రభుత్వ స్థిరత్వాన్ని సవాలు చేస్తున్నాయి.