Bangladesh Hindus: దారుణాలు ఆగడం లేదు. ఘోరాలు తగ్గడం లేదు. ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. రాయడానికి వీల్లేని భాషలో తిడుతున్నారు. ఇలాంటి సమయంలో అంతర్జాతీయ సమాజం తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. బంగ్లాదేశ్ ప్రాంతంలో హిందువులకు రక్షణ అనేది లేకుండా పోతుంది. ఇటీవల ఒక హిందూ వ్యక్తిని దారుణంగా హతం చేసి, ఆ తర్వాత అతడిని మంటలలో తగలబెట్టారు. ఈ సంఘటన మర్చిపోకముందే మరో దారుణం చోటుచేసుకుంది.
బంగ్లాదేశ్ ప్రాంతంలో మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయి. శాంతిభద్రతలు క్షీణిస్తున్న నేపథ్యంలో.. అక్కడ హిందువులకు రక్షణ అనేది లేకుండా పోయింది. దీపూ చంద్ర దాస్ అనే యువకుడిని సజీవ దహనం చేసిన సంఘటన మర్చిపోకముందే.. మరో హిందు వ్యక్తిని బంగ్లాదేశ్లో అక్కడి గ్రామస్తులు కొట్టి చంపారు. బంగ్లాదేశ్ లోని రాజ్భరి జిల్లాలో బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగినట్టు మీడియాలో వస్తున్న వార్తల ద్వారా తెలుస్తోంది. అక్కడి డైలీ స్టార్ అనే మీడియా సంస్థ ప్రకారం చేసిన కథనం ప్రకారం సదరు వ్యక్తి డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న నేపథ్యంలో స్థానికులు దాడి చేశారని.. ఇదే సమయంలో అతడు చనిపోయినట్టు తెలుస్తోంది..
చనిపోయిన ఆ వ్యక్తి పేరు అమృత్ మండల్. ఇతడిని సామ్రాట్ అని కూడా పిలుస్తారు. సామ్రాట్ పై బుధవారం రాత్రి గ్రామస్తులు దాడి చేశారు. ఇదే సమయంలో పోలీసులకు సమాచారం కూడా అందింది. పోలీసు అక్కడికి చేరుకొని గాయపడిన అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతున్న అతడు గురువారం రెండు గంటల సమయంలో మృతి చెందాడు.. సామ్రాట్ అనుచరులలో ఒకడైన మహమ్మద్ సలీం అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి తుపాకి, షూటర్ గన్ ను స్వాధీనం చేసుకున్నారు.
చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు, ఇతర వ్యవహారాల కోసం సామ్రాట్ బహిన్ పేరుతో సామ్రాట్ ఒక ముఠాను ఏర్పాటు చేసినట్లు బంగ్లాదేశ్ పోలీసులు చెబుతున్నారు. హత్య నేరం, ఇంకా కొన్ని కేసులు అతని మీద ఉన్నట్టు బంగ్లాదేశ్ పోలీసులు చెబుతున్నారు. షేక్ హసీనా దేశం నుంచి వెళ్లిపోయిన తర్వాత.. సామ్రాట్ తన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలుపుదల చేశాడు. అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయాడు. ఇటీవల కాలంలో మళ్ళీ గ్రామానికి వచ్చాడు. బుధవారం రాత్రి ఇదే గ్రామానికి చెందిన షాహిదుల్ ఇస్లాం అనే వ్యక్తి ఇంటికి వెళ్ళాడు. అతడిని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆ తర్వాత తన అనుచరులతో బెదిరింపులకు దిగాడు. దీంతో గ్రామస్తులు మొత్తం అతనిని చుట్టుముట్టారు. దానికి పాల్పడ్డారు.. చంద్ర దాస్ తర్వాత బంగ్లాదేశ్లో హిందూ యువకుడు పై మూక దాడి జరగడం ఇది రెండవ సారి అని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.