Bananaphobia: స్వీడన్ లో లింగ సమానత్వ మంత్రిగా పౌలినా బ్రాండ్ బర్గ్ పనిచేస్తున్నారు. ఆమె స్వీడన్ దేశంలో లింగ సమానత్వం కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. అయితే ఆమె ఏదైనా సమావేశానికి వెళ్ళినప్పుడు.. అధికారిక పర్యటనలలో పాలుపంచుకున్నప్పుడు.. అక్కడ అరటిపండు లేకుండా చూసుకుంటారు. ఒకవేళ అరటిపండు ఏర్పాటు చేస్తే దానిని అక్కడి నుంచి తీసివేయాలని చెబుతుంటారు. అధికారిక పర్యటనలకు వెళ్లేటప్పుడు ముందుగానే ఆమె ఈమెయిల్ పెడతారు. అందులో అరటిపండు ఏర్పాటు చేయకూడదని ముందుగానే ప్రస్తావిస్తారు. ” నేను మీ సమావేశానికి వస్తున్నాను. ఇందులో ప్రస్తావించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా అరటిపండు నా సమావేశంలో ఉండకూడదు. నా టేబుల్ ముందు కూడా కనిపించకూడదు. దయచేసి దానిని తొలగించండి.. ఒకవేళ ఏర్పాటు చేస్తే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుందని” పౌలినా బ్రాండ్ బర్గ్ ముందుగానే చెబుతుంటారు. ఆమె చెప్పినట్టుగానే ఆతిథ్య దేశాలు ఏర్పాట్లు చేస్తుంటాయి. పౌలినా బ్రాండ్ బర్గ్ ఈ సమస్య చిన్నప్పటి నుంచి ఉందట.. అందువల్లే ఆమె అరటి పండ్లు చూస్తే తట్టుకోదు. ఆమె శరీరంలో వింత వింత మార్పులు చోటు చేసుకుంటాయట.
అరటి పండ్లు చూస్తే ఆమెకు ఏమనిపిస్తుందంటే..
పౌలినా బ్రాండ్ బర్గ్ కు అరటి పండ్లను చూస్తే విపరీతమైన కోపం వస్తుందట. వాటిని చూస్తూ తన ఏకాగ్రతను కోల్పోతారట. అందువల్లే సమావేశాల నుంచి మొదలుపెడితే తన పడకగది వరకు ఎక్కడ కూడా అరటి పండ్లను లేకుండా చూసుకుంటారట. ” అరటి పండ్లను చూస్తే ఆమెకు చిరాకు కలుగుతుంది. ఏమాత్రం సహించలేరు. వాటిని చూస్తే తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. ఆ పండ్లపై ఉన్న పసుపు రంగు ఆమె ఏకాగ్రతను భగ్నం చేస్తాయి. ఇది ఎప్పటినుంచి మొదలైందో తెలియదు కానీ.. అరటి పండ్లను ఆమె శత్రువులుగా భావిస్తుంటారు. అందువల్లే తన సమావేశాలలో లేకుండా చూసుకుంటారు. ఒకసారి పొరపాటున అరటిపండ్లను తింటే ఆమెకు విరోచనాలు అయ్యాయి. వాంతులు కూడా అయ్యాయి. పొట్ట భాగంలో విపరీతమైన నొప్పి వచ్చింది. దీంతో వైద్యులు ఆమెకు బనానా ఫోబియా ఉందని గుర్తించారు. అప్పటినుంచి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ఫలితంగా ఆమె కూడా దానిని పాటిస్తున్నది.. ఈ ప్రపంచంలో వ్యక్తులకు ఒక్కో రకమైన ఫోబియా ఉంటుంది. ఈమెకు ఈ తరహా ఫోబియా ఉంది. అరటి పండ్లను ఆమె ఇక జీవితంలో చూడదు. చూసే అవకాశం కూడా లేదు.. గతంలో ఆమె నివసించిన ప్రాంతంలో అరటి తోటలు ఉండేవి.. అయితే ఇప్పుడు ఆ ప్రాంతాన్ని ఆమె వదిలి దూరంగా వచ్చారని” పౌలినా బ్రాండ్ బర్గ్ వ్యక్తిగత కార్యదర్శి చెబుతున్నారు.