USA: పాకిస్తాన్ పై నిషేధం.. భారత్ కు మద్దతు.. అమెరికా సంచలన నిర్ణయం వెనుక ఏం జరిగింది?

భారత్‌ను అమెరికా మిత్ర దేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా చూడాలని అమెరికా సూచించింది. ఈమేరకు ఆ దేశ కాంగ్రెస్‌లో కీలక సెనేటర్‌ బిల్లు ప్రవేశపెట్టారు.

Written By: Raj Shekar, Updated On : July 26, 2024 2:20 pm

Senator Marco Rubio

Follow us on

USA: భారత్‌–అమెరికా మైత్రి దశాబ్దాలుగా కొనసాగుతోంది. అమెరికా శాస్త్ర, సాంకేతిక, సైనిక సాయంపై భారత్‌ ఆధారపడితే.. భారత మానవ వనరులై అమెరికా ఆధారపడుతోంది. భారతీయులు లేకుంటే.. అమెరికా లేదని మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటర్‌ వ్యాఖ్యానించడమే ఇందుకు నిదర్శనం. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తున్న భారతీయులు అక్కడి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించి కంపెనీల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే సుందర్‌ పిచాయ్‌ లాంటివారు ప్రముఖ సంస్థలకు సీఈవోలుగా ఎదిగారు. అందుకే అమెరికా కూడా భారత్‌తో మైత్రి కోరుకుంటోంది. ఇక భారత్‌ కూడా వాణిజ్య, శాస్త్ర, సాంకేతిక, సైనిక పరంగా సహకారం కోరుకుంటోంది. దీంతో దశాబ్దాలుగా అధ్యక్షులు, ప్రధానులతో సంబంధం లేకుండా ఇదు దేశాల మధ్య మైత్రి కొనసాగుతోంది. రెండు దేశాలు కలిసి సైనిక విన్యాసాలు చేపట్టడం భారత్, అమెరికా మైత్రికి నిదర్శనం. ఈ క్రమంలో అమెరికా కాంగ్రెస్‌లో భారత్‌తో సైనిక సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని అమెరికా తాజాగా నొక్కి చెప్పింది. ఈమేరకు ఆ దేశ కాంగ్రెస్‌లో కీలక బిల్లు పెట్టారు. కాంగ్రెస్‌లో కీలక సభ్యుడు మార్కో రుబియా ఈ బిల్లు ప్రవేశపెట్టారు. అమెరికా మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా నాటో కూటమితో సమానంగా భారత్‌ను చూడాల్సిన అవసరం ఉందని బిల్లులో పేర్కొన్నారు. సాంకేతిక బదిలీ, ఆయుధాల సహకారంలో భారత్‌కు అండగా ఉండాల్సిన అవసరం ఉందని బిల్లులో ప్రతిపాదించారు. భారతదేశ ప్రాదేశిక సమగ్రతకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని గుర్తు చేసింది. దీనిని ఎగదోస్తున్నట్లు తేలితే పాకిస్తాన్‌కు భద్రతాసాయం నిషేధించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

చైనా అంశం కూడా ప్రస్తావన..
ఇదిలా ఉంటే కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన బిల్లులో పాకిస్తాన్‌తోపాటు చైనా గురించి కూడా ప్రస్తావించారు. ఇండో – పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దురాక్రమణ పూరిత వైఖరి అనుసరిస్తోందని బిల్లులో అమెరికా పేర్కొంది. ఆ ప్రాంతంలో అమెరికా మిత్రదేశాల సార్వభౌమాధికారానికి చైనా సవాల్‌ విసురుతోందని ఆ ందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో డ్రాగన్‌ దేశాన్ని అడ్డుకోవాలంటే భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

ఎన్నికల వేళ బిల్లు…
ఇదిలా ఉంటే.. అమెరికా అద్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్‌లో జరుగనున్నాయి. అధికార డెమొక్రటిక్, ప్రతిపక్ష రిపబ్లిక్‌ పార్టీలు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఈ తరుణంలో బిల్లు పెట్టడం చర్చనీయాంశమైంది. డెమెక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య సఖ్యత లేని ఈ సమయంలో బిల్లు ఆమోదం అంత ఈజీ కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్‌తో సంబంధాల విషయంలో ఇరు పార్టీలు సానుకూలంగా ఉన్నాయని తెలుస్తోంది. ఎన్నికల తర్వాత కొలువుదీరే కొత్త ప్రభుత్వంలో ఈ బిల్లు చట్ట రూపందాల్చే అవకాశం ఉంది.

కావడి యాత్రకు కూడా మద్దతు..
ఇదిలా ఉండగా యూపీలో కావడి యాత్రపై కూడా పాకిస్తాన్‌ చేస్తున్న ఆరోపణలను అమెరికా ఖండించింది. యూపీలో నెలకొన్న యాత్ర వివాదంపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ స పందించారు. భారత దేశంలోని పరిణామాలు తమకు తెలుసన్నారు. సుప్రీం కోర్టు జూలై 22న ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేసిన విషయాన్ని గుర్త చేశారు. అమెరికా మత స్వేచ్ఛను గౌరవిస్తుందన్నారు. అన్ని మతాలను గౌరవించే భారత్‌తో కలిసి పనిచేస్తుంని వెల్లడించారు. పాకిస్తాన్‌ జర్నలిస్టులు తమను తరచూ దీనిపై స్పందన కోరడం పరిపాటిగా మారిందన్నారు.