Balochistan vs Pakistan: బలూచిస్తాన్.. కొన్ని నెలలుగా నిత్యం వార్తలో వినిపిస్తున పేరు ఇది. పాకిస్తాన్‌లో 45 శాతం విస్తీర్ణంలో ఉన్న అతిపెద్ద రాష్ట్రం ఇది. అయితే అక్కడి ప్రజలు పాకిస్తాన్ నుంచి విముక్తి కోరుకుంటున్నారు. స్థానికంగా ఉన్న అపార వనరులను తరలించుకుపోతున్న పాకిస్తాన్.. బలూచిస్తాన్ అభివృద్ధిని మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించడం లేదు. దీంతో అక్కడి ప్రజలు ప్రత్యేక దేశం కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు.
Also Read: నాన్న పేరు కాదు నా టాలెంటే ముఖ్యం.. కోట్లు కాదనుకున్న ఆపిల్ కంపెనీ సీఈవో కూతురు
చైనా–పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులు ఈ తిరుగుబాటును మరింత రెచ్చగొట్టాయి. ఎందుకంటే ఈ ప్రాజెక్టులు బలూచిస్తాన్‌లోని స్థానికులకు ప్రయోజనం చేకూర్చడం లేదు. ఈ క్రమంలో ఆవిర్భవించిందే బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్‌ఏ). ఇది పాకిస్తాన్ ప్రభుత్వానికి, ఆర్మీకి కొన్ని నెలలుగా కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. తాజాగా రైళ్లను టార్గెట్ చేసింది. గతంలో భారత్‌లో రైలు ప్రమాదాలను ప్రోత్సహించిన పాకిస్తాన్‌కు ఇప్పుడు బీఎల్‌ఏ వడ్డీతో సహా చెల్లిస్తోంది. వరుస పేలుళ్లు, హైజాక్‌లతో పాకిస్తాన్‌కు షాక్ ఇస్తోంది. ఈ ఘటనలు పాకిస్తాన్‌లో భద్రతా లోపాలను, రాజకీయ, ఆర్థిక అసమానతలను బహిర్గతం చేస్తోంది.
రైళ్లనే ఎందుకు టార్గెట్ చేస్తుంది?
బలూచిస్తాన్‌లో రైలు మార్గాలు ప్రధాన రవాణా సాధనంగా ఉన్నాయి. క్వెట్టా నుంచి పెషావర్ వంటి నగరాలకు వెళ్లే జాఫర్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లు సైనికులు, అధికారులు, సామాన్య పౌరులను తీసుకెళతాయి. ఈ రైళ్లు బలూచ్ తిరుగుబాటుదారులకు సులభమైన లక్ష్యాలుగా మారాయి, ఎందుకంటే ఇవి పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యూహాత్మకంగా కీలకమైనవి. రైల్వే ట్రాక్‌లను పేల్చడం, రైళ్లను హైజాక్ చేయడం ద్వారా తిరుగుబాటుదారులు ప్రభుత్వ యంత్రాంగంపై ఒత్తిడి తెస్తున్నారు. 2025 మార్చిలో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై దాడిచేసి 450 మంది ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు. ఇందులో సైనికులు కూడా ఉన్నారు.
వరుస ఘటనలతో ఆందోళన..
జూన్ 2025లో బలూచిస్తాన్‌లో జరిగిన రైలు దాడులు పాకిస్తాన్‌లో భద్రతా వైఫల్యాలను బహిర్గతం చేశాయి. జూన్ 11న జరిగిన ఒక ఘటన తర్వాత, భయాందోళనల కారణంగా జూన్ 27 వరకు రైళ్లను నిలిపివేయాల్సి వచ్చింది. ఈ దాడులు సైనికులు, అధికారులను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, సామాన్య పౌరులు కూడా బాధితులయ్యారు. బలూచ్ తిరుగుబాటుదారులు రైల్వే ట్రాక్‌లను పేల్చడం, రైళ్లను హైజాక్ చేయడం ద్వారా పాకిస్తాన్ ఆర్మీని భయపెడుతున్నారు. ఈ ఘటనలు బలూచిస్తాన్‌లో ప్రయాణించడానికి సైనికులు, అధికారులు భయపడుతున్న స్థితిని సూచిస్తున్నాయి.
Also Read: భారత్‌కన్నా అమెరికాకే ఎక్కువ నష్టమా!
భారత్‌పై ఏడుపు..
పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఈ దాడుల వెనుక భారత్, అఫ్గానిస్తాన్‌లోని కొన్ని శక్తుల ప్రమేయం ఉందని ఆరోపించింది. జాఫర్ ఎక్స్‌ప్రెస్ దాడి తర్వాత, పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి షఫాకత్ అలీ ఖాన్ ఈ ఆరోపణలను వెల్లడించారు. అయితే, ఈ ఆరోపణలకు ఘనమైన ఆధారాలు లేనందున, ఇవి రాజకీయ ఒత్తిడిలో భాగంగా కనిపిస్తున్నాయి. గతంలో భారత్‌లోని రైలు ప్రమాదాల వెనుక పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి, కానీ బలూచిస్తాన్ దాడులు స్థానిక తిరుగుబాటు సమస్యలకు సంబంధించినవిగా ఎక్కువగా కనిపిస్తాయి.