Balochistan: పాకిస్తాన్ నుంచి విముక్తి కోసం బలూచిస్తాన్.. దశాబ్దాలుగా పోరాటం చేస్తోంది. గెరిల్లా దాడులతో పాకిస్తాన్ సైన్యంపై విరుచుకుపడుతోంది. ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ నుంచి బలూచ్ ఆర్మీ స్ఫూర్తి పొందింది. ఇదే అదనుగా పాకిస్తాన్ సైన్యంపై విరుచుకుపడుతోంది. ఇటీవలే ఆపరేషన్ బాంబ్(తొలి వేకువ) పేరుతో ఐదు రోజులు జరిపిన దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అయింది. 81 చోట్ల బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేసింది. పాకిస్తాన్ సైనికులతోపాటు సివిల్ పోలీసులను మట్టుపెట్టింది. తాజాగా పాక్ సైన్యం లొంగుబాట పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బలోచిస్తాన్లో 500 మందికి పైగా పాకిస్థాన్ సైన్యం, పోలీసు సిబ్బంది బలోచ్ స్వాతంత్య్ర సమరయోధులతో పోరాడడానికి నిరాకరించి లొంగిపోయారని, వారిని బస్సుల్లో పంజాబ్‌కు తిరిగి పంపిస్తున్నారని సమాచారం.
దశాబ్దాలుగా తిరుగుబాటు..
బలోచిస్తాన్ దశాబ్దాలుగా స్వాతంత్య్ర ఉద్యమాలకు కేంద్రంగా ఉంది, బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) వంటి సమూహాలు పాకిస్తాన్ భద్రతా దళాలపై దాడులు చేస్తున్నాయి. 2025లో, బీఎల్ఏ జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేయడం, సైనిక స్థావరాలపై దాడులు చేయడం వంటి పలు ఘటనలతో తమ ఉనికిని మరింత బలపరిచింది. వనరుల దోపిడీ, రాజకీయ విస్మరణపై బలోచ్ల అసంతృప్తి ఈ తిరుగుబాటుకు మూలం. ఈ నేపథ్యంలో, సైనికుల లొంగుబాటు వంటి వాదనలు తీవ్రతను సూచిస్తున్నాయి.
త్వరలోనే స్వాతంత్య్రం..
అన్నీ అనుకున్నట్లు జరిగితే పాకిస్తాన్లో 46 శాతం భూభాగం కలిగి ఉన్న బలూచిస్తాన్ త్వరలోనే స్వాతంత్య్రం పొందే అవకాశం కనిపిస్తోంది. ఈమేరక ఇటీవలే ప్రపంచ దేశాలకు బలూచ్ నేతలు తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. భారత్ మద్దతు కూడా కోరారు. కీలక తరుణంలో భారత్ మద్దతు ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాదానికి కొమ్ముకాస్తోంది. పాకిస్తాన్‌ను చీల్చడానికి భారత్ వెనుకాడబోదు. తాజాగా సైనికుల లొంగుబాటు త్వరలో స్వాతంత్య్రం సిద్ధిస్తుంది అనడానికి సంకేతమే అని విశ్లేషకులు భావిస్తున్నారు