Dolly Chaiwala demand: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు. ఇదే పనిని ప్రముఖ చాయ్ తయారీదారుడు డాలీ చేస్తున్నాడు. పూణేలో ఒక మామూలు చాయ్ తయారీదారుడిగా డాలీ మొన్నటిదాకా ఉండేవాడు. సోషల్ మీడియా వల్ల ఒక్కసారిగా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఏకంగా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఇతడి దగ్గరకు వచ్చాడు. అతడు తయారుచేసిన చాయ్ కూడా తాగాడు. అదిరిపోయిందని కితాబిచ్చాడు. ఆ తర్వాత డాలి రేంజ్ మారిపోయింది. ఏకంగా ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగిన పెళ్లికి అతిథిగా హాజరయ్యాడు. ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా క్రికెట్ ప్లేయర్లకు చాయ్ తయారుచేసి సర్వ్ చేశాడు.. దీంతో అంతర్జాతీయ మీడియా కూడా అతడిని ఆకాశానికి ఎత్తడం మొదలుపెట్టింది. ఒకసారిగా ఊహించని పాపులారిటీ రావడంతో డాలీ తన రేంజ్ పెంచుకోవడం మొదలుపెట్టాడు.
Also Read: పవర్ న్యాప్’.. మధ్యాహ్నం 15 నిమిషాలు ఇలా చేయండి.. జిమ్ ను మించిన శక్తి..
పూణేలో ఒక మాములు చాయ్ తయారీదారుడిగా ఉన్న డాలి.. ఆ వ్యాపారాన్ని మరింత పెంచుకోవడానికి ఇటీవల ఒక సంచలన ప్రకటన చేశాడు. తన పేరు మీద ఒక బ్రాండ్ ను సృష్టించాడు. భారతదేశ వ్యాప్తంగా డాలీ చాయ్ వాలా పేరుతో ఫ్రాంచైజీలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. ఫ్రాంచైజీలు ఏర్పాటు చేయడానికి దరఖాస్తులు కూడా ఆహ్వానించాడు. కాకపోతే ఫ్రాంచైజీ ధర ఎక్కువగా ఉంది. స్థలాన్ని చూపిస్తే వారే కస్టమైజ్ చేసి ఇస్తారు. అంతేకాదు టీ పౌడర్, ఇతర దినుసులు కూడా వారే పంపిస్తారు.. ధర ఎక్కువగా ఉండటం వల్ల దరఖాస్తులు తక్కువగా వస్తాయని అందరూ అనుకున్నారు.. కానీ అందుకు విరుద్ధంగా జరుగుతోంది.
డాలీ చాయ్ వాలా ఫ్రాంచైజీ కోసం దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1609 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తు దారులు నియమ నిబంధన ప్రకారం నగదు చెల్లిస్తే వారికి డాలీ చాయ్ వాలా ఫ్రాంచైజీ లభిస్తుంది. స్వయంగా డాలీ చాయ్ వాలా సంస్థ నుంచి వారికి టీ పౌడర్, ఇతర దినుసులు అందుతాయి. ఏదో ఒక సందర్భంలో డాలి వచ్చి ఆ ఛాయ్ దుకాణాన్ని పరిశీలిస్తారు. అవసరమైతే ప్రమోషన్ కూడా చేస్తారు. దానికంటే ముందు డాలి చాయ్ వాలా కంపెనీలో పనిచేసే ఉద్యోగులు షాప్ ను కస్టమైజ్ చేసి ఇస్తారు. ” మనదేశంలో చాయ్ కి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. చాయ్ తాగని వారంటూ ఉండరు. ఇది కోట్ల వ్యాపారం. అందువల్లే ఈ వ్యాపారాన్ని నా బ్రాండ్ పేరుతో పటిష్టం చేయాలని అనుకున్నాను. దరఖాస్తులు ఆహ్వానిస్తే భారీగానే వచ్చాయి.. మొదటి దశలో ఈ దరఖాస్తులను పూర్తి చేసిన తర్వాత.. మలి విడతలో ఆహ్వానిస్తామని” డాలీ వెల్లడించాడు. అన్ని బాగుంటే నీలోఫర్ కేఫ్ లాగా డాలీ చాయ్ వాలా పేరుతో కేఫ్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని డాలి చెబుతున్నాడు.
Also Read: అచ్చం అపాచీ లాంటిదే.. దానికంటే రూ.77 వేలు తక్కువకే అదిరిపోయే బైక్
ముంబై లేదా పూణేలో అతిపెద్ద కేఫ్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు డాలి వెల్లడించాడు.. ఇప్పటికే స్థల అన్వేషణ పూర్తయిందని.. నగదు సమీకరణ.. ఇతర వ్యవహారాలు పూర్తయిన తర్వాత కేఫ్ ఏర్పాటు ఒక కొలిక్కి వస్తుందని డాలి వివరిస్తున్నాడు.