Baby-81 : నాటి ఘటన పెను విపత్తును సృష్టించింది. లక్షల కోట్ల నష్టాన్ని మిగిల్చింది. అయితే సునామి సంభవించినప్పుడు శ్రీలంక దేశంలో రెండో నెలల చిన్నారి జయరస అభిలాష్ అనే బాలుడు తప్పిపోయాడు. అయితే అదృష్టవశాత్తు అతడు చిరంజీవిగా మిగిలాడు. అతడిని బేబీ -81 గా పిలుస్తున్నారు. నాటి సునామీలో శ్రీలంక దేశంలో సుమారు 35,000 మంది కన్నుమూశారు. వేలాదిమంది జాడ తెలియ రాలేదు. సునామీ చోటు చేసుకున్నప్పుడు తీర ప్రాంతంలో రెండు నెలల బాబు కొట్టుకుపోయాడు. మూడు రోజులపాటు వెతికినప్పటికీ అతడి జాడ అధికారులకు తెలియ రాలేదు. అయితే ఆ చిన్నారి ఓ నివాసం సమీపంలో మట్టిలో కూరుకుపోయాడు. అతడి కదలికలు కొంతమంది గుర్తించి.. రక్షించారు. సమీపంలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు.. ఆ ఆస్పత్రిలో చికిత్స అందించిన వైద్యులు అతడికి 81 నెంబర్ కేటాయించారు. ఆ తర్వాత అతడు బేబీ 81 గా మారిపోయాడు.
తెర మీదకి తొమిది కుటుంబాలు..
బేబీ 81 కోసం ఏకంగా తొమ్మిది కుటుంబాలు తెరపైకి వచ్చాయి. అతడు మా పిల్లాడంటే మా పిల్లాడని తగువులు పెట్టుకొన్నాయి. డిఎన్ఏ పరీక్ష చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ చిన్నారికి అసలైన తల్లిదండ్రులు ఎవరనే విషయంపై కోర్టులో బాధలను జరిగాయి. చివరికి డిఎన్ఏ పరీక్ష అనంతరం చిన్నారి జయరస తన తల్లిదండ్రుల వద్దకు చేరాడు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో అనేక మలుపులు ఉన్నాయి. మరిన్ని సంక్లిష్టతలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. అన్నట్టు జయ రస వయసు ప్రస్తుతం 20 సంవత్సరాలు. అతడు హైస్కూల్ విద్యాభ్యాసాన్ని త్వరలో పూర్తి చేయనున్నాడు. వార్షిక పరీక్షలు త్వరలో జరగనున్న నేపథ్యంలో వాటికోసం మొదటి సిద్ధమవుతున్నాడు. హై స్కూల్ విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదవాలని ఉందని అతడు చెబుతున్నాడు. వాస్తవానికి కోర్టు ఆదేశాలతో మిగతా కుటుంబాలు డిఎన్ఏ పరీక్షకు వెనకడుగు వేశాయి. దీంతో అతడు తన కుమారుడేనని మురుగు పిల్లయి అనే వ్యక్తికి నమ్మకం కుదిరింది. మిగతా ఎనిమిది కుటుంబాలు డిఎన్ఏ పరీక్షలకు విముఖత చూపించడం.. తనకు చేసిన పరీక్షలు మొత్తం అనుకూలంగా రావడంతో జయ రసను మురుగు పిల్లయి కుమారుడిగా శ్రీలంక కోర్టు తేల్చింది.. అయితే తన కుటుంబ సభ్యులు ఎవరో తెలియడంతో జయ రస ఆనందానికి అవధులు లేవు. ఇన్నాళ్లపాటు స్కూల్లో తనను తోటి పిల్లలు గేలి చేసేవారని.. ఇప్పుడు ఆ బాధ లేదని అతడు చెబుతున్నాడు. తనకు ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరో తెలిసిందని.. తను అనాధను కాదని.. ఉన్నత చదువులు చదువుకొని.. మంచి ఉద్యోగం చేస్తానని జయరస వివరిస్తున్నాడు.