spot_img
Homeఅంతర్జాతీయంTerrorist killed in Eencounter: మరో ఉగ్రవాదిని లేపేశారు.. పాక్ ను కూడా రేపో మాపో..

Terrorist killed in Eencounter: మరో ఉగ్రవాదిని లేపేశారు.. పాక్ ను కూడా రేపో మాపో..

Terrorist killed in Eencounter: ఎవరో వస్తున్నారు.. అమాంతం కాల్పులు జరుపుతున్నారు. టార్గెట్ ఫినిష్ చేస్తున్నారు. నిశ్శబ్దంగా వెళ్ళిపోతున్నారు. ఇదేదో సినిమా కాదు. ఫిక్షన్ స్టోరీ అంతకన్నా కాదు. రీల్ లైఫ్ లో హీరో చేసే సాహసం అంతకంటే కాదు. జస్ట్ రియల్ లైఫ్ లో జరుగుతోంది. అది కూడా మనకు శత్రుదేశం పాకిస్థాన్లో జరుగుతోంది.

మామూలుగా అయితే మన దేశం ఇంటెలిజెన్స్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఇందులో భాగమైన రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అజిత్ దోవల్ వచ్చిన తర్వాత రా అత్యంత శక్తివంతంగా మారింది. ముఖ్యంగా మనకు చెప్పులో రాయిలాగా.. పంటి కింద మేకు లాగా.. చెవిలో జోరీగ లాగా మారిపోయిన పాకిస్తాన్ కు దోవల్ చుక్కలు చూపిస్తున్నారు. అనేక సందర్భాలలో మన మీద దాడులకు పాల్పడిన పాకిస్తాన్ కు నరకం అంటే ఏమిటో లైవ్ లో చూపిస్తున్నారు. పాకిస్తాన్లో ఉగ్రవాదుల కదలికలు అధికంగా ఉంటాయి. ఉగ్రవాద గ్రూపులు కూడా అదే స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తూ ఉంటాయి. ఉగ్రవాదుల అండ చూసుకొని పాకిస్తాన్ రెచ్చిపోతూ ఉంటుంది. మనదేశంలో అశాంతిని కలిగించడానికి.. అభద్రతను రేకెత్తించడానికి దుర్మార్గమైన పనులు చేపడుతూ ఉంటుంది.

గతంలో పాకిస్తాన్ ఎత్తులు విజయవంతంగా మన దేశంలో సాగేవి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా మారిపోయిన తర్వాత.. పరిస్థితులు ఒక్కసారిగా మన దేశానికి అనుకూలంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ దేశంలో ఉగ్రవాదులు వరుస హత్యలకు గురవుతున్నారు. తాజాగా లస్కరే చీఫ్ హఫీజ్ సయ్యద్ సన్నిహితుడు షేక్ యూసఫ్ అఫ్రిది గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యాడు. పాకిస్తాన్లోని కైబర్ రాష్ట్రంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఉగ్రవాదుల కార్యకలాపాలలో అఫ్రిది చాలా యాక్టివ్ గా ఉంటాడు. సోషల్ మీడియా ద్వారా యువకులను ఉగ్రవాద సంస్థలకు రిక్రూట్ చేసుకుంటూ ఉంటాడు. ప్రస్తుతం అతడు లష్కరే లో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు.

అఫ్రిది చాందస వాదాన్ని ప్రేరేపించడంలో సిద్ధహస్తుడు. పైగా అమాయకులను యువకులను ఉగ్రవాద సంస్థలోకి అతడు లాగుతున్నాడు. పేదలను లక్ష్యంగా చేసుకొని అతడు ఈ దుర్మార్గానికి పాల్పడుతున్నాడు. అయితే ఆఫ్రిది కదలికలపై కొంతకాలంగా ఇంటెలిజెన్స్ వర్గాలు దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలోనే అతడిని అవకాశం చూసి మరి లేపేశాయి. ఈ ఉగ్రవాదుల హత్యలు ఇలానే కొనసాగుతుంటాయని.. భవిష్యత్ కాలంలో పాకిస్తాన్ దేశంలో ఉగ్రవాదుల అలికిడి లేకుండా గుర్తుతెలియని వ్యక్తులు చేస్తుంటారని జాతీయవాదులు పేర్కొంటున్నారు.

ముఖ్యంగా పాకిస్తాన్లో ఉంటూ మన దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగించే ఉగ్రవాదులను గుర్తు తెలియని వ్యక్తులు మట్టు పెడుతున్నారు. దీని వెనక ఎవరున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఉగ్రవాదులు నేలకూలిపోవడం.. మన దేశవాసుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే ఉగ్రవాదుల వల్ల మన దేశం చాలా కోల్పోయింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version