Homeఅంతర్జాతీయంChina: చైనాలో మరో ప్రాణాంతక వైరస్‌.. అది కూడా ల్యాబ్‌లోనే సృష్టి?

China: చైనాలో మరో ప్రాణాంతక వైరస్‌.. అది కూడా ల్యాబ్‌లోనే సృష్టి?

China: వూహాన్‌ ల్యాబ్‌లో కోవిడ్‌–19 వైరస్‌ను సృష్టించి దానిని బయటకు వదిలిన డ్రాగన్‌ కంట్రీ చైనా మరో వైరస్‌ను పుట్టించింది. హెబీ మెడికల్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఎబోలా తరహాలోని మరో కొత్త వైరస్‌ను సృష్టించారు. ఎబోలా మాదిరిగానే ఈ వైరస్‌ చాలా ప్రమాదకరమైనది. మనిషిని కేవలం మూడు నెలలల్లోనే ఇది చంపేస్తుంది. వ్యాధికారక ప్రభావాలను అధ్యయనం చేసేందుకే శాస్త్రవేత్తలు ఈ వైరస్‌ను సృష్టించారు. అయితే ఇప్పుడు ఈ వైరస్‌ ప్రయోజనాలు, ప్రమాదాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కోవిడ్‌ తరహాలో బయటకు వస్తే ప్రపంచానికి మరో ముప్పు దప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ వైరస్‌ స్వభావం సింథటిక్‌ అని తెలుస్తోంది. ఈ అధ్యయన నివేదిక సైన్స్‌ డైరెక్ట్‌లో ప్రచురితమైంది.

వివాదాస్పద పరిశోధన..
ఎబోలా వైరస్‌ను ఉపయోగించి సృష్టించిన ఈ కొత్త వైరస్‌పై సాగిస్తున్న పరిశోధన వివాదాస్పదంగా మారింది. అయితే ఈ పరిశోధన ఉద్దేశం వివిధ వ్యాధులను నివారించడం. లక్షణాలను పరిశోధించడం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వైరస్‌ మనిషి శరీరంపై ఎబోలా లాంటి ప్రభావాన్నే చూపుతుంది. పరిశోధకుల బృందం ఎబోలా వైరస్‌ నుంచి గ్లైకోప్రొటీన్‌(పీజీ)ని స్వీకరించేందుకు వెసిక్యూలర్‌ స్టోమాటిటిస్‌ వైరస్‌(వీఎస్‌వీ)ని ఉపయోగించింది.

జతువులపై ప్రయోగం..
ఇక ఈ వైరస్‌ను శాస్త్రవేత్తలు సిరియన్‌ హామ్ట్సర్స్‌(జంతువుల)సమూహంపై పరీక్షించారు. వీటిలో ఐదు మగ, ఐదు ఆడ జాతులు ఉన్నాయి. ఈ జంతువులకు ఈ వైరస్‌ను ఇంజెక్టు చేయగా, వాటిలో ఎబోలా లాంటి లక్షణాలు కనిపించాఇ. మూడు రోజుల్లోనే అవి మృతిచెందాయి. ఈ వైరస్‌ ఇంజెక్‌ టచేయగానే కొన్ని జంవుతువుల కళ్లు దెబ్బతిన్నాయి. ఆప్టిక్‌ నరాలలో తీవ్రమైన ప్రభావం కనిపించింది. 2014–16 మధ్య కాలంలో ఆఫ్రికన్‌ దేశాలలో ఎబోలా వ్యాప్తి చెందింది. దీనివలన వేలాదిమంది మరణించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version