Canada Vs India(2)
Canada Vs India: భారత్–కెనడా మధ్య దౌత్య సంబంధాలు రోజు రోజుకూ క్షిణిస్తున్నాయి. సిక్కు వేర్పాటు వాది, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత హౌకమిషనర్ పేరును కెనడా ప్రభుత్వం చేర్చింది. ఈ విషయాన్ని భారత్ తీవ్రంగా పరిగణించింది. కెనడాలో భారత దౌత్యవేత్తలకు రక్షణ లేదని భావించింది. వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని ఆరుగురు అధికారులకు విదేశాంగ శాఖ సమాచారం ఇచ్చింది. ఇదే సమయంలో భారత్‌లోని కెనడా రాయబారులను భారత్ బహిష్కరించింది. అక్టోబర్ 19వ తేదీ లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అయినా కెనడా భారత్‌పై ఆరోపణలు ఆపడం లేదు. వచ్చే ఎన్నికల్లో సిక్కుల ఓట్ల కోసం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత వ్యతిరేక శక్తులకు మద్దతు తెలుపుతున్నారు. స్వాతంత్య్రానికి పూర్వమే చాలా మంది సిక్కు వేర్పాటు వాదులు భారత్‌ను విడిచి కెనడా వెళ్లారు. అక్కడే స్థిరపడ్డారు. ఎన్నికల్లో వీరి ప్రభావం ఎక్కువ. ఈ నేపథ్యంలో భారత వ్యతిరేక విధానాలతో సిక్కువ వేర్పాటువాదులకు దగ్గర కావొచ్చని ట్రూడో భావిస్తున్నారు. ఇలా వివాదం కొనసాగుతుండగా, తాజాగా అమెరికా ఈ వివాదంలోకి ఎంటర్ అయింది. వివాదంలో కెనడాకే మద్దతు ప్రకటించి తన వక్రబుద్ధిని బయటపెట్టింది.
భారత్‌కు అమెరికా నీతులు..
దౌత్య వివాదంలో కెనడా చేసిన ఆరోపణలు అత్యంత సీరియస్ అని, వాటిని భారత్ కూడా సీరియస్‌గా తీసుకుని దర్యాప్తునకు సహకరించాలని అమెరికా భారత్‌కు సూచించింది. తాము ఒకటి అనుకుంటే భారత్ ప్రత్యామ్నాయ దారి ఎంచుకుందని అమెరికా డీఈపీటీ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. రెండు దేశాల పరస్పర ఆరోపణలపై తాము ఏమీ చెప్పలేమన్నారు.
వేర్పాటువాద వ్యతిరేక కార్యకలాపాలు..
సిక్క వేర్పాటు వాదుల వ్యతిరేక కార్యకలాపాలకు భారత్ మద్దతు ఇస్తుందని కెనడా ఆరోపించింది. ఈక్రమంలోనే నిజ్జర్ హత్య జరిగిందని పేర్కొంటోంది. భారత హైకమిషనర్ పాత్ర ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే భారత్, కెనడా దేశాలు రాయబారులను బహిష్కరించుకున్నాయి. కెనడాలోని నేర కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం ద్వారా భారత ప్రభుత్వం ప్రాథమిక తప్పు చేసిందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు.