spot_img
Homeఅంతర్జాతీయంTrump agrees with Xi Jinping: పతనం అంచున అమెరికా.. జిన్‌పింగ్‌తో ఏకీభవించిన ట్రంప్‌!

Trump agrees with Xi Jinping: పతనం అంచున అమెరికా.. జిన్‌పింగ్‌తో ఏకీభవించిన ట్రంప్‌!

Trump agrees with Xi Jinping: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం బీజింగ్‌ వెళ్లారు. అక్కడ ట్రంప్‌కు ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటనలో ఇరు దేశాల అధ్యక్షులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు అమెరికాపై కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యం పతనం అంచున ఉందని కుండ బద్దలు కొట్టాడు. అయితే ట్రంప్‌ దీనిని కవర్‌ చేయడానికి తంటాలు పడ్డాడు. జిన్‌పింగ్‌ చెప్పింది వంద శాతం నిజమన్నాడు. అయితే అది బైడెన్‌ పాలన గురించి అని, తాను వచ్చాక అమెరికా గ్లోబల్‌ శక్తిగా ఆర్థిక, రాజకీయ పురోగతి సాధించిందని వెల్లడించారు.

రాజకీయ ఆధిపత్యం..
చైనా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు అమెరికాపై ఆధిపత్యం కనబర్చే అంశంగా ఉంది. ఇక ట్రంప్‌ సమాధానం కూడా ఇలాగే ఉంది. తన ఆధిపత్యం తగ్గకుండా జిన్‌పింగ్‌ వ్యాఖ్యలను సమర్థిస్తూనే అమెరికా పతనం తన పాలనలో కాదని, బైడెన్‌ పాలనలో అని పేర్కొన్నారు. షీ వ్యాఖ్యలు గ్లోబల్‌ ఆర్థిక వాతావరణం, సరఫరా గొలుసులు, నాణ్యమైన టెక్‌ కేపబులిటీని తెలియజేస్తున్నాయి. ట్రంప్‌ ఆరోపణలు బైడెన్‌ పాలనపై దాడిని సూచిస్తునానయి.

ఆర్థిక, సెక్యూరిటీ పరిణామాలు..
ప్రపంచ మార్కెట్లు: ‘‘పతనం అంచున’’ వంటి ప్రకటనలు ఆర్థిక అస్థిరత భయాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పెట్టుబడులు, డాలర్‌ ఇండెక్స్, షేర్‌ మార్కెట్లు ప్రత్యక్షంగా ప్రభావితం అవుతాయి. ఇదే సమయంలో రెండు పెద్ద దేశాల మధ్య సెక్యూరిటీ పరమైన సమస్యలు తలెత్తుతాయి. చిన్న దేశాలనూ ఒత్తిడికి గురిచేస్తాయి.

 

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version