America And Iran: ఇరాన్‌లో 20 రోజులుగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో అగ్రరాజ్యం అమెరికా ఇరాన్‌పై దాడికి ప్రయత్నిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడికి సిద్ధమయ్యారు. ఇజ్రాయెల్, పాకిస్తాన్ సైన్యాన్ని ఇరాన్ సరిహద్దుకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులతో మొదటి విమానం ఢిల్లీ చేరుకుంది. ఇంటర్నెట్ లేకపోవడం, సహాయం లభించకపోవడం మొదలైన ఆవేదనలు వ్యక్తం చేశారు. ఇరాన్‌లో జరుగుతున్న పరిస్థితులు అస్పష్టంగా ఉండటంతో ప్రయాణికులు భయంతో ఉన్నారు.
పాకిస్తాన్ పక్షపాతిగా ట్రంప్..
ట్రంప్ పాకిస్తాన్‌కు ఎంత మద్దతు ఇచ్చినా చివరకు అమెరికా ప్రయోజనాలను మాత్రం వదులుకోడు. ఇక యూఎస్ కాంగ్రెస్ రిపబ్లికన్ నేత వ్రిచ్ మెకార్మిక్ తాజాగా కీలక వ్యాఖలు చేశారు. అమెరికా డబ్బులు భారత్, పాకిస్తాన్‌కు వెళ్తున్నా, భారత్ నుంచి ఎఫ్‌డీఐ ల ద్వారా 40 బిలియన్ డాలర్లు తిరిగి వస్తున్నాయని తెలిపాడు. ఇక అమెరికాలో భారతీయులు అమెరికన్లకు 4 లక్షల ఉద్యోగాలు సృష్టించారు. ట్రంప్ టారిఫ్‌లు ఆపితే మరో 6 లక్షల మందికి భారతీయ కంపెనీలు ఉపాధి కల్పిస్తాయి.
భారత్‌కు స్వప్రయోజనాలు ముఖ్యం..
భారత్‌ను అమరికా ‘స్వింగ్ కంట్రీ’గా చూస్తూ స్వంత ప్రయోజనాలు కాపాడుకుంటుందని మెకార్మిక్ అంగీకరించారు. రష్యా నుంచి చౌక ఆయిల్ దిగుమతులు భారత ఆర్థిక వ్యూహంలో భాగమే. పాకిస్తాన్ నుంచి అమెరికా పెట్టుబడులు తిరిగి రావడం లేదని విమర్శించారు.
ట్రంప్ భయం, ఖమేనీ హెచ్చరిక..
ఇదిలా ఉంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ‘బుల్లెట్ ఈసారి మిస్ కాదు‘ అంటూ ట్రంప్‌పై హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ట్రంప్‌పై దాడి తప్పింది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో వ్యతిరేకులను అణచివేయాలని ఆదేశాలు. ఇస్లామిక్ దేశాలు అమెరికాకు మద్దతు ఇవ్వకుండా ఉంటే ట్రంప్ ఆలోచనలు మారవచ్చు. రష్యా, చైనా ఇరాన్ ఆయుధాల మెరుగుదలకు మద్దతు ఇస్తున్నాయి.
ఇజ్రాయెల్ డెమోనాలో భూకంపం..
ఇదే సమయంలో ఇజ్రాయెల్ డెమోనా ప్రాంతంలో అసాధారణ భూకంపం సంభవించింది. సాధారణంగా భూకంపాలు రాకపోయే ప్రదేశంలో ఇది అణు పరీక్షతో ముడిపడి ఉండవచ్చని అనుమానాలు. ఇరాన్‌పై అమెరికా దాడి ప్రచారం చేస్తున్న ఇజ్రాయెల్‌కు ఇది సంబంధం ఉందా అని చర్చ.
75 దేశాల ఇమ్మిగ్రేషన్‌పై నిషేధం..
ట్రంప్ 75 దేశాల సిటిజన్‌షిప్‌లను రద్దు చేశారు. సంక్షేమ పథకాలపై ఆధారపడే వారిని బహిష్కరిస్తామని ప్రకటించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ జాబితాలో ఉన్నా, భారత్ లేదు. భారతీయులు స్వశక్తితో ఉద్యోగాలు సృష్టిస్తారని అమెరికా అంగీకరిస్తోంది.
