Andhra Pradesh capital Amaravati : మిల్పిటాస్ (కాలిఫోర్నియా): ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లభించడం పట్ల అమెరికాలోని బే ఏరియా ప్రవాసాంధ్రులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. 03/04/2026 శుక్రవారం నాడు మిల్పిటాస్ పట్టణంలో భారీ ఎత్తున సమీకృతమైన ఎన్నారైలు, అమరావతి విజయకేతనం ఎగురవేయడంపై సంబరాలు జరుపుకున్నారు.

అమరావతి అజరామరం: మన్నవ సుబ్బారావు
ఈ వేడుకల్లో పాల్గొన్న మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ అమరావతి అజరామరమని కొనియాడారు.”అమరావతి అంటే కేవలం ఒక రాజధాని నగరం మాత్రమే కాదు, అది ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ రాజధానిని మార్చడం సాధ్యం కాదని పార్లమెంట్ చేసిన చట్టం ద్వారా స్పష్టమైంది. అమరావతి రైతులు తమ పోరాటంతో చరిత్ర సృష్టించారు,” అని ఆయన పేర్కొన్నారు.

ప్రజా విజయం – రైతుల త్యాగాలకు ప్రతిరూపం
ఉత్తర అమెరికా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం పిలుపు మేరకు అమెరికా వ్యాప్తంగా ఎన్నారైలు ఈ విజయాన్ని పండుగలా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వెంకట్ కోగంటి మాట్లాడుతూ.. అమరావతికి చట్టబద్ధత లభించడం ప్రజా విజయం… ఇది రైతుల ఐదేళ్ల పోరాటానికి, వారి త్యాగాలకు దక్కిన గౌరవం.. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాలు అమరావతికి మద్దతు తెలుపుతుంటే, వైసీపీ మాత్రం ఇంకా విద్వేషం కక్కుతుండటం దురదృష్టకరం.

సందడిగా సాగిన వేడుకలు
బే ఏరియా ఎన్నారైలు ప్లక్కార్డులతో ప్రదర్శన నిర్వహించి, అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయ్ గుమ్మడి సమన్వయ పరిచారు. అమరావతి ఉద్యమానికి తాము మొదటి నుంచీ అండగా ఉన్నామని, శాశ్వత రాజధానిగా అమరావతి రూపుదిద్దుకోవడం తెలుగువారి కలల సాకారమని నేతలు స్పష్టం చేశారు.

పాల్గొన్న ముఖ్యులు
ఈ కార్యక్రమంలో శ్రీని వల్లూరిపల్లి, బిర్యానీ జంక్షన్ వెంకట్, మోహన్ మల్లెంపాటి, జగదీష్ గింజుపల్లి, భాస్కర్ అన్నే, విజయ్ రెడ్డి జెట్టి, శ్రీనివాస్ వట్టికూటి, సతీష్ అంబటి, తిరుపతిరావు వలివేటి, రవి కిరణ్ యేలేటి, నరేందర్ రెడ్డి యెన్నంరెడ్డి, రాంబాబు మానుకొండ, కిశోరె తాడికొండ, హరి సన్నిధి, యశస్వి మాధవ, చెంద్రశేఖర్, అనంతరాం, వంశి కందుల, మహేంద్ర కూచిపూడి, మురళి సురం తదితరులు పాల్గొన్నారు.

