https://oktelugu.com/

Alvarado Gil : ఆమె దగ్గర పని చేసిన ఖర్మానికి.. శృంగార బానిసను చేసింది..నీ కష్టం పగోడికి కూడా రావద్దు బ్రో..

చేసే పని మీద మనకు ఇష్టం ఉండాలి. అలాంటి పని కల్పించిన వ్యక్తి మీద గౌరవం ఉండాలి. కానీ ఈ వ్యక్తికి పని కల్పించిన మహిళ చుక్కలు చూపించింది. ఏకంగా చేయకూడని పనులు అతడితో చేసింది. చివరికి అతడి జీవితాన్ని సర్వనాశనం చేసింది.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 10, 2024 / 10:17 PM IST
    Follow us on

    Alvarado Gil : అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్ర సెనెటర్ గా అల్వరాడో గిల్ కొనసాగుతున్నారు. త్వరలో అమెరికా దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె వివాదంలో కూరుకుపోయారు. ఆమె వద్ద పనిచేసిన పురుష సిబ్బంది ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. ఆమె లైంగికంగా వేధించిందని.. శృంగార బానిసను చేసిందని విమర్శించారు. విధుల్లో ఉన్నప్పుడు తనను రకరకాలుగా వాడుకుందని ఆమెపై ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు చేసింది ఆ సెనెటర్ దగ్గర పనిచేసిన మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్. అంతేకాదు ఆమె వ్యవహార శైలి వల్ల తాను తీవ్రంగా ఇబ్బంది పడ్డానంటూ అతడు ఏకంగా కోర్టులో దావా వేశాడు. ఈ విషయం అమెరికాలో చర్చనీయాంశంగా మారింది. గ్లోబల్ మీడియా ఈ విషయంపై ప్రముఖంగా కథనాలను ప్రసారం చేస్తోంది.

    లైంగికంగా వేధించడం మొదలు పట్టింది

    అల్వరాడో గిల్ 2022లో కాలిఫోర్నియా సెనెటర్ గా ఎన్నికయింది. ఆ తర్వాత తన చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా నియమించుకుంది. అతనితో తన వ్యక్తిగత విషయాలను పంచుకునేది. చివరికి లైంగిక వ్యవహారాలను కూడా అతనితో మాట్లాడేది. ఆ తర్వాత అతడిని లైంగికంగా వేధించడం మొదలు పెట్టింది. తనతో అసహజ శృంగారం చేయాలని అతడిని ఆమె డిమాండ్ చేసేది. కాదంటే బెదిరింపులకు పాల్పడేది. బలవంతంగా ఆమె అతడి ద్వారా తన కోరికలు తీర్చుకునేది. ఈ వేధింపుల వల్ల అతడు తీవ్రమైన మానసిక, శారీరక ఇబ్బందులకు గురయ్యాడు. ప్రస్తుతం వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. వినికిడి సామర్థ్యాన్ని కోల్పోయాడు. గత ఏడాది ఆగస్టులో ఆమె అసహజ శృంగారం చేయాలని కోరగా.. అతడు తనకున్న అనారోగ్య కారణాలను చూపించి తప్పించుకున్నాడు. దీంతో ఆమె అతని ప్రవర్తన బాగోలేదని నోటీసులు జారీ చేసింది. ఉద్యోగ భద్రత కోసం అతడు ఇన్ని రోజులు ఈ విషయాన్ని బయట పెట్టలేదు. అయితే గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా శాంటా క్లాజ్ కాస్ట్యూమ్ వేసుకోకపోవడంతో అతడిని ఉద్యోగం నుంచి ఆ సెనెటర్ తొలగించింది. చివరికి అతనికి ఇవ్వాల్సిన వేతన బకాయిలను కూడా ఇప్పించలేదు. అతడికి నష్టం జరగడంతో పరిహారం ఇప్పించాలని శాక్రా మెంటో కౌంటీ సుపీరియర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

    సెనెటర్ ఏమంటున్నారంటే..

    ఆ వ్యక్తి ఆరోపణలను సెనెటర్ పూర్తిగా తప్పు పట్టారు. డబ్బు కోసం తనను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు..” నేను ఎవరినీ వేధించలేదని” ఆమె ఓ టీవీ చర్చా వేదికలో స్పష్టం చేశారు. మరోవైపు ఇదే సెనెటర్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా యూఎస్ కాంగ్రెస్ లో గత ఏడాది బిల్లు ప్రవేశపెట్టారు. కాగా, కాలిఫోర్నియా సెనెటర్ కు గతంలోనే ఓ వ్యక్తితో వివాహమైంది. ఆమెకు ఆరుగురు సంతానం ఉన్నారు. ప్రస్తుతం ఆ బాధితుడు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా కోర్టు త్వరలో విచారణ నిర్వహించనుంది.