Crypto Aliens: గ్రహాంతర జీవులు ఉన్నాయా లేదా అనే వాదన ఎప్పటి నుంచో ఉంది. ఉంటే అంతరిక్షంలో ఉంటాయని, మన మధ్య లేవని కొందరి వాదన. గ్రహాంతర జీవులు ఉన్నాయనడానికి కచ్చితనమైన ఆధారం మాత్రం ఇప్పటి వరకు లేదు. తాజాగా హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనం మరో వాదనను తెరమీదకు తెచ్చింది. గ్రహాంతర జీవులు మనతోనే ఉన్నాయని, అజ్ఞాతంగా జీవిస్తున్నాయని పేర్కొంది. 2016 నుంచి హ్యూమన్ ఫ్లరిషింగ్ ప్రోగ్రాం చేపట్టిన యూనివర్సిటీ… ఇటీవల గ్రహాంతర జీవులకు సంబంధించి కొత్త వాదనను ప్రతిపాదించింది. మనం యూఎఫ్‌వోలు, ఫ్లయింగ్ సాసర్లు అని పిలుచుకునే అన్‌ఐడెంటిఫైడ్ అనోమలస్ ఫెనోమినా అనేవి గ్రహాంతర జీవులకు సంబంధించినవే అని ఆశ్చర్యకరమైన విషయాన్ని పేర్కొంది. గ్రహాంతర జీవలు భూమిలోపల, చంద్రుడి మీద ఉండడంతోపాటు మనతోనే కలిసి నడుస్తుండొచ్చని వెల్లడించింది. భూమిపై ఉన్న తమ స్నేహితులను కలవడానికి గ్రహాంతర జీవుల ఫ్లయింగ్ సాసర్లను వాడుకుంటున్నాయని తెలిపింది. ఈ అధ్యయనం కొత్తగా క్రిప్టోటెరిస్టీరియల్ అనే ఊహా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. విశిష్టమైన, రహస్యమైన గ్రహాంతర జీవుల క్రిప్టోటెరిస్టీరియల్స్‌గా పేర్కొంటూ వీళ్లు భూమిక భవిష్యత్ కాలంలో లేదా తేలివైన డైనోసార్ల కన్నా ముందే పుట్టి ఉండొచ్చని చెబుతోంది. తమ సిద్ధాంతాన్ని తాత్కాలికంగా బలపరిచే లోతైన అవగాహనతోనే ఈ ఊహా సిద్ధాంతాన్ని ప్రతిపాదించామని పరిశోధకులు అంటున్నారు. ఇదే నిజమైతే గ్రహాంతర జీవులు మన ఇంటి పక్కనే తిరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.
నిజమెంత?
హార్వర్డ్ యూనివర్సిటీ ఊహా సిద్ధాంతం చాలా మంది శాస్త్రవేత్తలకు నమ్మకం కలిగించకపోవచ్చు. పరిశోధకులు కూడా ఇదే భావిస్తున్నారు. కానీ, తార్కిక, విశాల దృక్పథంతో తమ వాదనను మదించి పరిశీలించాలని కోరుతున్నారు. సమగ్రంగా పరిశోధించకుండా కొట్టిపారేయడం మూర్ఖత్వమే అవుతుందని చెబుతున్నారు. ఈ అధ్యయనాన్ని ఇంకా ఇతర పరిశోధనలతో సమీక్షించి పరిశీలించాల్సి ఉంది.
రక్షణ కోసమే నిర్మాణాలు..
గ్రహాంతర జీవులు ఉన్నాయో లేదోననే వాదోపవాదనలు కొనసాగుతుండగానే రాన్ హాలిడే అనే పరిశోధక రచయిత మరో కొత్త విషయాన్ని లేవనెత్తారు. రాక్షస గూళ్ల వంటి రహస్య కట్టడాలు గ్రహాంతర జీవుల నుంచి కాపాడుకోవడానికి ఉద్దేశించినవే కావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. స్కాట్లాండ్‌లోని స్కారా బ్రీ రాతి నిర్మాణం, మేషోవి గుమ్మటం, బ్రాక్స్ రాతిగోడ వంటి రహస్య కట్టడాలు గ్రహాంతర జీవుల నుంచి ఎదురయ్యే ప్రమాదల నుంచి కాపాడుకోవడానికి నిర్మించినవే కావొచ్చని పేర్కొన్నారు. వీటిని కట్టడానికి వాడిన కొన్ని రాళ్లపై దేన్నుంచో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా జానపద కథలను తలపించే చిత్రాలున్నాయని చెబుతున్నారు. పురాతత్వవేత్తలు పేర్కొనే వాటికన్నా ఇవి పూర్తిగా భిన్నంగా ఉన్నాయని తెలిపారు. ఈ కట్టడాల నిర్మాణం, ఉద్దేశాలు అర్థం కావడంలేదని, అవి అసలు ఉద్దేశాన్ని కప్పి పుచ్చేలా ఉన్నాయంటున్నారు. బ్రాక్స్ రాతి టవర్లు గ్రహాంతర జీవులతో అనుసంధామయ్యేందుకు నిర్మించి ఉండొచ్చని, ఇవి పిరమిడ్ల వంటి రహస్య కట్టడాలతో పోలి ఉన్నాయంటున్నారు. వీటిని గ్రహాంతర జీవులను ఆకర్షించడానికో లేదక వారి నుంచి కాపాడుకోవడానికో కట్టి ఉండొచు.