https://oktelugu.com/

Nitrogen Gas Execution: నైట్రోజన్‌ గ్యాస్‌తో ఖైదీకి మరణ శిక్ష అమలు.. ప్రపంచంలోనే రెండోసారి.. ఎందుకిలా?

నేరస్థులకు మరణ శిక్ష అనేది మన దేశంలో లేదు. కానీ చాలా దేశాల్లో మరణ శిక్ష అమలవుతోంది. మరణ శిక్ష అమలు చేయడం కూడా భిన్నంగా ఉంటుంది. కొందరు ఉరితీస్తే.. కొందరు విషపూరిత ఇంజెక్షన్‌ ఇస్తారు. కొన్ని ఇస్లామిక్‌ దేశాలు బహిరంగా మరణ శిక్ష అమలు చేస్తున్నాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 27, 2024 / 02:30 PM IST

    Nitrogen Gas Execution

    Follow us on

    Nitrogen Gas Execution: నేరం చేసిన వారికి ఉరి శిక్ష అనేది భారత దేశంలో లేదు. కరుడుగట్టిన నేరస్థులకు కోర్టులు అప్పుడప్పుడు మరణ శిక్ష విధిస్తున్నా.. అమలు మాత్రం తక్కువే. పైకోర్టులు అమరణ శిక్షణు యావజ్జీవ శిక్షగా, లేదా రాష్ట్రపతి ద్వారా క్షమాభిక్షగా మారుతున్నాయి. దీంతో మన దేశంలో మరణ శిక్ష లేదనే చెప్పాలి. అయితే ప్రపంచంలోని చాలా దేశాల్లో మరణ శిక్ష అమలులో ఉంది. దీనిని ఆయా దేశాలు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా అమలు చేస్తున్నాయి. ముస్లిం దేశాల్లో అయితే కఠిన శిక్షలు ఉన్నాయి. ఇక అగ్రరాజ్యం అమెరికాలో మరణ శిక్షకు భిన్నంగా అమలు చేస్తోంది. మరణ శిక్ష అమలు చేసే పద్ధతి చర్చనీయాంశమైంది. ఆ శిక్ష ఏంటి.. ఎందుకలా అమలు చేస్తున్నారు అనే వివరాలు తెలుసుకుందాం.

    దక్షిణ అలబామాలో..
    దక్షిణ అలబామా జైలులో దోషి అలాన్‌ యుగెన్‌ మిల్లర్‌(59)కి కోర్టు మరణ శిక్ష విధించింది. దీనిని అమలు చేయడంలో భాగంగా అతని ముఖానికి మాస్క్‌ బిగించారు. తర్వాత నైట్రోజన్‌ గ్యాస్‌ను పంపించడం మొదలు పెట్టారు. రెండు నిమిషాల్లోనే కిందపడిపోయిన మిల్లర్‌.. మరో ఆరు నిమిషాల తర్వాత మరణించాడు. 8 నిమిషాల్లో మరణ శిక్ష అమలు పూర్తయింది. అమెరికాలోని అలబామాలో ఇలా మరణ శిక్ష అమలు చేయడం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలో హత్యకేసులో నిందితుడు కెన్నెత్‌ స్మిత్‌958)కి ఇలాగే మరణ శిక్ష అమలు చేశారు. మరణ శిక్ష అమలు చేస్తున్న పద్ధతిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగోతంది. స్మిత్‌కు శిక్ష అమలుకు ముందు ఈ పద్ధతికి వ్యతిరేకంగా అతడి తరఫు న్యాయవాదులు పోరాటం చేశారు. కానీ న్యాయస్థానంలో ఊరట లభించలేదు. శిక్ష అమలు సందర్భంగా స్మిత్‌ నరకం అనుభవించాడని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు.

    మిల్లర్‌ కేసు ఇదీ..
    ఇక తాజాగా మరణ శిక్ష అమలు చేసిన మిల్లర్‌ 1999 నాటి హత్య కేసులో దోషిగా తేలాడు. డెలివరీ ట్రక్కు డ్రైవర్‌గా పనిచేసే మిల్లర్‌ 1999, ఆగస్టు 5న తాను పనిచేసే ఫెర్గూసర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కంపెనీకి వెళ్లి తోటి ఉద్యోగులైన హోల్డ్‌ బ్రూక్స్, యాన్సీపై విచక్షణారహితంగా క ఆల్పలు జరిపాడు. దీంతో ఇద్దరూ మరణించారు. తర్వాత గతంలో పనిచేసి ఆఫీస్‌కు వెళ్లి అక్కడ జార్విస్‌ అనే ఉద్యోగిని కాల్చి చంపాడు. తోటి ఉద్యోగులు తనపై వదంతులు పుట్టిస్తున్నారన్న కోపంతో మిల్లర్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో నిర్ధారణ అయింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అతడికి మరణ శిక్ష విధించింది. 2022లో అతడికి విషపూరిత ఇంజెక్షన్‌ ఇచ్చి మరణ శిక్ష అమలు చేయాలని అధికారుల ప్రయత్నించారు. కానీ అధిక బరువు కారణంగా అతడి నరాలు దొరకలేదు. దీంతో ఆ ప్రయత్నం విఫలమైంది. చివరకు గురువారం(సెప్టెంబర్‌ 26న) నైట్రోజన్‌ గ్యాస్‌తో శిక్ష అమలు చేశారు.

    ఆక్సీజన్‌ అందక మరణం..
    ముఖానికి మాస్క్‌ బిగించి నైట్రోజన్‌ గ్యాస్‌ పంపడం వలన నేరస్థుడికి కావాల్సిన ఆక్సీజన్‌ అందదు. దీంతో బాధ అనుభవిస్తూ మరణిస్తాడు. ఆక్సీజన్‌తో ప్రాణం పోసినట్లే.. నైట్రోజన్‌తో ప్రాణం తీస్తారు. 1988లో చార్లెస్‌ సెన్నెట్‌ అనే మత ప్రబోధకుడు తన భార్య ఎలిజిబెత్‌ సెన్నెట్‌ను యూజిన్‌ స్మిత్, అతడి సహాయకుడు జాన్‌ పార్కర్‌కు సుపారీ ఇచ్చి హత్య చేయించాడు. నిందితులకు కోర్టు మరణ శిక్ష విధించింది. అయితే వారికి విషపూరిత ఇంజక్షన్‌ ఇచ్చి మరణ శిక్ష అమలు చేశారు.