Afghanistan Pakistan Conflict: చీమలు పెట్టిన పుట్టలోకి పాములు దూరితే ఎలా ఉంటుంది.. చీమలన్నీ ఏకమై పాములను చంపేస్తాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఇప్పుడు వర్తమానంలో పాకిస్తాన్ దేశానికి ఆఫ్ఘనిస్తాన్ అనుభవంలోకి తీసుకొస్తోంది. తాలిబన్ల పాలనలో ఉంది. వారికి అనుభవం లేకుంది.. మాకు అమెరికా సపోర్ట్ ఉందని.. పాకిస్తాన్ ఎగరగిరి పడింది. కానీ ఆఫ్గనిస్తాన్ పాకిస్తాన్ కు సాలిడ్ కౌంటర్ ఇస్తోంది. కనివిని ఎరుగని రేంజ్ లో దూకుడు కొనసాగిస్తోంది. దీంతో పాకిస్తాన్ అన్ని మూసుకొని కూర్చుంటున్నది.
మన సరిహద్దుల్లో పాకిస్తాన్ చేయని పని అంటూ లేదు. ఉగ్రమూకలను ఎగదోయడం, అడ్డగోలు పనులు చేపట్టడం.. రక్తపుటేరులను ప్రవహించేలా చేయడం పాకిస్తాన్ కు వెన్నతో పెట్టిన విద్య. ఇదే విధానాన్ని ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో కూడా పాకిస్తాన్ చేస్తోంది.. అయితే ఆఫ్గనిస్తాన్ గతంలో మాదిరిగా ఇప్పుడు లేదు. పైగా ఆ దేశానికి సైనిక శక్తి అధికంగా ఉంది. ఆయుధాలు, యుద్ధ సామగ్రి కూడా అపారంగా ఉండి. అందువల్లే పాకిస్తాన్ దేశ సైనికులకు చుక్కలు చూపించింది. పాకిస్తాన్ చెక్ పోస్టులను సైతం నేల కూల్చింది. ముమ్మరంగా దాడులు చేసి పాకిస్తాన్ సైనికులను పారిపోయేలా చేసింది. ఓ నివేదిక ప్రకారం దాదాపు 50+ మంది పాకిస్తాన్ సైనికులను ఆఫ్ఘనిస్తాన్ దళాలు అంతం చేసినట్టు సమాచారం.
సైనిక పరంగానే కాకుండా.. దౌత్యపరంగా కూడా పాకిస్తాన్ కు ఆఫ్గనిస్తాన్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఆఫ్గనిస్తాన్ లో పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఆసిఫ్ కవాజా పర్యటిద్దాం అనుకుంటున్న వేళ ఆఫ్ఘనిస్తాన్ అడ్డు చెప్పింది. అంటే కాదు ఐఎస్ఐ చీఫ్ ఆసీం మాలిక్ వీసాలను కూడా తిరస్కరించింది. దీనికి తోడు పాకిస్తాన్ జట్టుతో జరిగే టి20 మ్యాచ్ సైతం రద్దు చేసుకోవాలని ఆఫ్ఘనిస్తా నిర్ణయించినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ త్వరలో టి20 ట్రై సిరీస్ ఆడాల్సి ఉంది.. ఈ సిరీస్ లో పాకిస్తాన్ జట్టుతో జరిగే మ్యాచ్ ను రద్దు చేసుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు మన దేశంతో సంబంధాలను తాలిబన్ ప్రభుత్వం పునరుద్ధరించుకుంటున్నది. ఆ దేశమంత్రి ముత్తాకీ ఇండియాలో పర్యటిస్తున్నారు.
ఇటీవల విలువైన ఖనిజాలను వెలికి తీయడానికి మన దేశంతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నది ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం. త్వరలోనే తవ్వకాల ప్రక్రియ మొదలవుతుందని తెలుస్తోంది. అత్యంత అరుదుగా లభించే ఖనిజాలు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాయని తెలుస్తోంది. వీటిని బయటకు తీస్తే విలువైన మారక ద్రవ్యం లభిస్తుందని భారత్ అంచనా వేస్తోంది. మరోవైపు పాకిస్తాన్ లభించే ఎర్త్ మినరల్స్ ను వెలికి తీయడానికి అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది. దానికి కౌంటర్ గా భారత్ ఆఫ్ఘనిస్తాన్తో ఒప్పందాలు కుదుర్చుకోవడం విశేషం.