adani : ఈ విషయాన్ని మర్చిపోకముందే మరో షాక్ గౌతమ్ ఆదానికి తగిలింది. గౌతమ్ అదాని ప్రపంచంలోని పలుదేశాలలో వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. అందులో కెన్యా కూడా ఒకటి. కెన్యా దేశంలో గౌతం అదాని గ్రూప్ రెండు ప్రాజెక్టులను ఆదేశ ప్రభుత్వంతో కుదుర్చుకుంది. కెన్యా దేశంలో పవర్ ట్రాన్స్ మిషన్ లైన్లో నిర్మించడానికి కెన్యా దేశంతో గతంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 700 మిలియన్ డాలర్లను కెన్యా ప్రభుత్వం ఖర్చు చేయనుంది. అయితే గౌతమ్ అదాని గ్రీన్ ఎనర్జీ కంపెనీ పై ఆరోపణలు రావడంతో.. న్యూయార్క్ అధికారులు అభియోగాలు మోపి.. ఏకంగా అరెస్టులకు వారెంట్లు జారీ చేయడంతో కెన్యా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో గౌతమ్ అదానీ గ్రూప్ తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు కెన్యా అధ్యక్షుడు విలియం రుతో ప్రకటించారు. ఇది మాత్రమే కాకుండా జేకేఐ విమానాశ్రయ విస్తరణ ప్రణాళికలు కూడా రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. దీంతో గౌతమ్ అదాని గ్రూప్ కు కోలు కోలేని షాక్ తగిలింది. కొంతకాలంగా గౌతమ్ అదానీ గ్రూప్ కెన్యాలో కార్యకలాపాలు సాగిస్తోంది. మైనింగ్లో అడుగుపెట్టడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే కెన్యా ప్రభుత్వంతో వ్యూహాత్మక వ్యాపారాలు నిర్వహించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నది. ఈ క్రమంలోనే కెన్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గౌతం అదానీ గ్రూప్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది.
న్యూయార్క్ అధికారుల అభియోగాలతో..
సౌర విద్యుత్ తయారీ లో భాగంగా 20 సంవత్సరాల లో రెండు బిలియన్ డాలర్ల లాభం పొందడానికి గౌతం అదానీ కంపెనీ ఒప్పందాలకుదురుచుకుంది. కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే అంతస్థాయిలో లాభాలు కళ్ల చూడాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో అధికారులకు 265 మిలియన్ డాలర్లను గౌతమ్ అదానీ గ్రూప్ లంచాలుగా ఇచ్చిందని అభియోగాలు ఒక్కసారిగా గుప్పమన్నాయి. అంతేకాకుండా గౌతమ్ అదానీ ఏర్పాటు చేసిన గ్రీన్ ఎనర్జీ కంపెనీలోకి అక్రమంగా అప్పులు వచ్చాయని.. పెట్టుబడిదారులు కూడా తప్పుడు విధానాలలో ఇన్వెస్ట్మెంట్ చేశారని న్యూయార్క్ అధికారులు అభియోగాలు మోపారు. దీంతో గౌతమ్ ఆదాని గ్రూప్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ నేపథ్యంలో గురువారం నుంచి స్టాక్ మార్కెట్లో గౌతమ్ ఆదాని కంపెనీకి సంబంధించిన షేర్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. అయితే న్యూయార్క్ అధికారులు మోపిన అభియోగాలను తాము కోర్టులోనే తేల్చుకుంటామని గౌతమ్ ఆదాని ప్రకటించినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. న్యూయార్క్ అధికారులు మోపిన అభియోగాలు అలా ఉండగా.. కెన్యా ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.