Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో రాజకీయం సంక్షోభం తీవ్ర విధ్వంసానికి దారితీసింది. రిజర్వేషన్ల అంశంతో మొదలైన అల్లర్లు.. చివరకు ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయే వరకు దారితీశాయి. ప్రధాని తప్పుకున్నా.. దేశం విడిచి వెళ్లినా.. హింసాకాండ మాత్రం ఆగడం లేదు. గడిచిన మూడు రోజుల్లో 400 మందికిపైగా మరణించారు. అల్లరి మూకలు దేశవ్యాప్తంగా విద్వంసం సృష్టిస్తున్నాయి. మైనారిటీలను లక్ష్యంగ ఆచేసుకుని దాడులు చేస్తున్నాయి. సైన్యం ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నా… అల్లర్లు మాత్రం ఆగడం లేదు. ప్రస్తుతం పరిస్థితతి దారుణంగా మారింది. దాడులు నిరంతరం కొనసాగుతున్నాయి. తాజా పరిణామాలు బంగ్లాదేశ్ సినిమా ఇండస్ట్రీని తాయాకి. సినిమా హీరోలంటే మన దగ్గరే కాదు.. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. వారిని ప్రత్యక్షంగా చూడటం, వారితో ఫొటో దిగడం కోసం అభిమానులు ఎగబడతారు. మన దేశంలో హీరోలకు ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. వారిని దేవుళ్లతో సమానంగా కొలుస్తారు అభిమానులు. తమ ఫేవరెట్ హీరోను ఎవరైనా చిన్న మాట అంటే చాలు.. యుద్ధానికి వస్తారు ఫ్యాన్స్. ఇక సోషల్ మీడియా వేదికగా హీరోల అభిమానుల మధ్య యుద్ధాలే జరుగుతుంటాయి. హీరోలంటే మనకు అంత పిచ్చి. వారికి చిన్న ఇబ్బంది వచ్చినా.. ఫ్యాన్సే బాధపడతారు. కానీ బంగ్లాదేశ్‌లో అల్లరి మూకలు, జనాలు ప్రజలే హీరోను, అతడి తండ్రిని కొట్టి చంపారు.
ఏంటీ దారుణం..
బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. దారుణాలు, దాడులు, హింస నిరంతరాయంగా కొనసాగుతోంది. ప్రస్తుతం అక్కడ ఎంతటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రిజర్వేషన్ల అంశంలో తలెత్తిన వివాదం కాస్త.. బంగ్లా ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి.. ఏకంగా దేశం విడిచి పోయే పరిస్థితులు వచ్చాయి. బంగ్లాలో అల్లరి మూకలు చెలరేగిపోతున్నాయి. ఏకంగా ప్రధాని అధికారిక నివాసంలోకి చేరి.. విధ్వంసం సృష్టించారు ఆందోళనకారులు. తిన్నారు, తాగారు.. అందినకాడికి దోచుకెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అంతేకాక స్టార్ క్రికెటర్ ఇంటికి నిప్పు పెట్టారు. తాజాగా ప్రముఖ నిర్మాత సలీమ్‌ఖాన్, అతని కొడుకు హీరో శాంటో ఖాన్‌ను ఆందోళనకారులు హత్యచేశారు.
మంచి గుర్తింపు ఉన్న నిర్మాత..
బంగ్లాదేశ్‌లో క్రేజీ ప్రాజెక్టుకు నిర్మాతగా వ్యవహరిస్తూ.. ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత సలీంఖాన్. అతడి కుమారుడు, హీరో షాంటో ఖాన్. షాంటోను కొన్నాళ్ల క్రితమే సలీంఖాన్ హీరోగా పరిచయం చేశాడు. ఇప్పుడిప్పుడే అతడు హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలోనే దారుణం జరిగింది. సోమవారం(ఆగస్టు 5న) సాయంత్రం చాంద్‌పూర్ అనే ప్రాంతం నుంచి పారిపోతుండగా.. బలియా యూనియన్‌లోని ఫరక్కాబాద్ మార్కెట్‌లో ప్రజలు వీళ్లపై ఆగ్రహానికి గురయ్యారు. వారి నుంచి తప్పించుకోవడానికి సలీం ఖాన్ పిస్టల్ పేల్చి.. అక్కడి నుంచి తండ్రి కొడుకులిద్దరూ తప్పించుకున్నారు. కానీ దగ్గర్లోని బగారా మార్కెట్ దగ్గరికి వచ్చేసరికి జనాలు భారీ ఎత్తున్న పోగయ్యారు. వారంతా ఈ తండ్రీకొడుకులపై దాడి చేసి దారుణంగా చంపేశారు.
నటీ నటలు సంతాపం..
సలీం, అతడి కుమారుడి మరణం గురించి నటుడు దేవ్ స్పందిస్తూ.. ‘‘నిన్న రాత్రి నాకు ఒక చేదు వార్త తెలిసింది. ప్రముఖ నిర్మాత సలీం మృతి చెందారని దాని సారాశం. అల్లరి మూకలు సలీం, ఆయన కుమారుడు షాంటోని దారుణంగా చంపేశారని తెలిసింది. ఈవిషయాన్ని ఇప్పటికి కూడా నమ్మలేకపోతున్నాను. బంగ్లాదేశ్‌లో తిరిగి శాంతియుత పరిస్థితులు రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చాడు. ఇక సలీమ్ విషయానికి వస్తే.. అతడు షాప్లా మీడియా అనే నిర్మాణ సంస్థను స్థాపించి.. అగ్ర నటీనటులతో సినిమాలు కూడా తీశారు.