Mona Lisa painting: గ్లాసు ఉంది కాబట్టి సరిపోయింది.. లేకుంటే మోనాలిసా కళావిహీనమయ్యేది..

ఫ్యాషన్ రాజధానిగా ప్యారిస్ ప్రాంతం వినతి కెక్కింది. ఈఫిల్ టవర్ మాత్రమే కాదు ప్రపంచంలోని మేటి ఫ్యాషన్ కంపెనీలకు పారిస్ ప్రాంతం ప్రసిద్ధి. అయితే పారిస్ అందాన్ని మరింత పరిపుష్టం చేసేది లియోనార్డో డావిన్సీ గీసిన మోనాలిసా చిత్రం.

Written By: Anabothula Bhaskar, Updated On : January 29, 2024 1:17 pm
Follow us on

Mona Lisa painting: ప్రజాస్వామ్య దేశాల్లో నిరసన అనేది ప్రజల హక్కు. సమస్య పైన.. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పైన వారు ప్రశ్నించవచ్చు. దానికి కారణమవుతున్న వారిని నిలదీయవచ్చు. అవసరమైతే పెద్ద పెట్టున వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టవచ్చు. ఈ నిరసనలే ప్రపంచంలో పెద్ద పెద్ద ఉద్యమాలకు దారితీసాయి. పరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాయి. ప్రజల సౌలభ్యం కోసం నూతన చట్టాలు అమలు చేసేలా దారులు పరిచాయి. అందుకే ఒక సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవడం ఒక పరిష్కారమైతే.. దానికోసం నిరసన బాట ఎంచుకోవడం ఉత్తమం అని అంటారు. కానీ ఇలాంటి నిరసన దారి తప్పింది. ప్రజల్లో ఉన్న ఆగ్రహం ఒక్కసారిగా పెల్లు బుకింది. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చదవండి..

ఫ్యాషన్ రాజధానిగా ప్యారిస్ ప్రాంతం వినతి కెక్కింది. ఈఫిల్ టవర్ మాత్రమే కాదు ప్రపంచంలోని మేటి ఫ్యాషన్ కంపెనీలకు పారిస్ ప్రాంతం ప్రసిద్ధి. అయితే పారిస్ అందాన్ని మరింత పరిపుష్టం చేసేది లియోనార్డో డావిన్సీ గీసిన మోనాలిసా చిత్రం. ఈ చిత్రం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన కళాఖండంగా పేరుగాంచింది. ఒక ఫ్రెంచ్ మహిళ కూర్చున్నట్టుగా డావెన్సీ చిత్రించిన ఈ కళాఖండం అత్యంత పురాతనమైనదిగా చాలామంది మన్ననలు పొందింది. కేవలం దీనిని చూడడానికే ఎక్కడి నుంచో సందర్శకులు వస్తూ ఉంటారు. అయితే ఇలాంటి మోనాలిసా చిత్రపటంపై ఆదివారం కొంతమంది సూప్ విసిరారు. దీంతో ఒక్కసారిగా పారిస్ ప్రాంతంలో కలకలం చెలరేగింది. వాళ్లు సూప్ విసిరిన అనంతరం ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలంటూ నినాదాలు చేశారు. అలా నినాదాలు చేసిన వారిలో ఇద్దరు మహిళలు ఉండడం విశేషం. మోనాలిసా చిత్రపటం పై ఆ ఇద్దరు మహిళలు ఎరుపు, నారింజ రంగులో ఉన్న సూప్ ఉపయోగించారు. అనంతరం ఆగ్రహంతో నినాదాలు చేశారు. ” ఈ రాష్ట్రంలో ఉండే పౌరులకు అత్యంత ముఖ్యమైనది ఏంటి? కళ నా? కడుపునిండా ఆరోగ్యకరమైన ఆహారమా? దానిని ఎవరు అందించాలి? ఆ బాధ్యత ప్రభుత్వానికి లేదా” అంటూ ప్రశ్నించారు.. అయితే ఇలా ప్రశ్నించిన ఆ మహిళ నిరసనకారులు ఫ్రెంచ్ రైతులని తెలుస్తోంది.

అయితే ఆ రైతులు ఇలా నిరసన తెలుపడానికి ప్రధాన కారణం లేకపోలేదు. కొంత కాలంగా ఫ్రెంచ్ ప్రాంతంలో రైతులు జీతాల పెంపుదల కోసం, పన్నుల తగ్గింపు కోసం పోరాటాలు చేస్తున్నారు. వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. చాలా రోజులపాటు ఇలా చేస్తున్నప్పటికీ అక్కడి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మోనాలిసా చిత్రపటంపై వారు సూప్ విసిరారు. ఫ్రెంచ్ రైతుల బాధలను ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదని… మోనాలిసా చిత్రపటం నిర్వహణ కోసం, చిత్ర పటాన్ని భద్రపరిచిన మ్యూజియం కోసం ఖర్చు చేస్తోందని.. ఆ మహిళలు ఫ్యాషన్ రాజధాని అని చెప్పుకోవడం కాదని.. రైతుల సంక్షేమాన్ని కూడా పట్టించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇలాంటి దాడి అక్కడ జరగడం ఇది తొలిసారి మాత్రమే కాదు. 2022లో మే నెలలో ఒక వ్యక్తి కూడా ఇలానే చేశాడు. మోనాలిసా చిత్రపటంపై ఫ్రూట్ కస్టర్డ్ విసిరాడు. అయితే మోనాలిసా చిత్రపటంపై దాడులు జరుగుతాయని భావించిన అక్కడి ప్రభుత్వం.. ఆ చిత్రపటం చుట్టూ బుల్లెట్ ప్రూఫ్ గాజు గ్లాసును అమర్చింది. ఆ చిత్రపటం చుట్టూ గాజుతో కూడిన రేయిలింగ్ ఏర్పాటు చేసింది.. దీనివల్ల నిరసనకారులు ఏమైనా విసిరినా ఆ చిత్రపటానికి ఏమీ కాదు. అయితే అప్పట్లో బుల్లెట్ ప్రూఫ్ గాజు గ్లాసును చిత్రపటం చుట్టూ ఏర్పాటు చేయడం పట్ల ఆరోపణలు వినిపించినప్పటికీ.. అలా చేయడం ఎంత మేలో ఆదివారం నాటి ఘటన నిరూపించిందని ఫ్రెంచ్ ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యానించారు. కాగా ఈ చర్యకు పాల్పడిన ఆ ఇద్దరు మహిళ రైతులను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో బంధించి విచారణ నిర్వహిస్తున్నారు. అయితే గతంలో ఫ్రూట్ క్లస్టర్డ్ విసిరిన వ్యక్తిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకొని కొంతకాలం పాటు జైల్లో బంధించారు. ఇక మోనాలిసా చిత్రపటంపై సూప్ విసిరిన నేపథ్యంలో.. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది.