https://oktelugu.com/

Justin Trudeau: ఆధారాలు లేకుండానే ఆరోపణలు.. నాలుక కర్చుకున్న ట్రూడో..

భారత్‌›– కెనడా మధ్య వివాదం సద్దుమణగడం లేదు. ఇప్పటికే రాయబారులను వెనక్కి పిలిచిన భారత్‌ కెనడా రాయబారులను బహిష్కరించింది. అయినా కెనడా ఆరోపణలు ఆగడం లేదు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 17, 2024 / 04:09 PM IST

    Justin Trudeau(1)

    Follow us on

    Justin Trudeau: సిక్కు వేర్పాటు వాది.. ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ సభ్యుడు నిజ్జర్‌ గేతడాది కెనడాలో హత్యకు గురయ్యాడు. అయితే ఈ హత్య వెనుక భారత హైకమిషన్‌ హస్తం ఉందని ఉందని కెనడా ఆరోపించింది. దీనిని నాడే భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఆధారాలు ఉంటే సమర్పించాలని సూచించింది. నిరాధారమైన ఆరోపణలు చేయొద్దని సూచించింది. దీంతో ఏడాదిగా ఎలాంటి ఆధారాలు సమర్పించని కెనడా.. తాజాగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారతీయ సిక్కుల ఓట్లు పొందేందుకు ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో నిజ్జర్‌ హత్యకేసును మరోమారు తెరపైకి తెచ్చారు. భారత కమిషనర్‌ ప్రమేయం లేకుండా నిజ్జర్‌ హత్య జరగలేదని ఆరోపించారు. దీంతో ఇరు దేశాల దౌత్య విభేదాలు భగ్గుమన్నాయి. ఈ తరుణంలో కెనడా ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి. ఖలిస్తానీ అనుకూలవాది నిజ్జర్‌ హత్యకు సంబంధించి తమ వద్ద నిఘా సమాచారం మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఎలాంటి పక్కా ఆధారాలు లేవని ప్రకటించారు. దీనిపై తాజాగా భారత విదేశాంగ శాఖ స్పందించింది. కెనడాకు గట్టి కౌంటర్‌ ఇచ్చింది. ట్రుడో తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

    మేం చెప్పిందే నిజమైంది..
    కెనడాకు కౌంటర్‌ ఇస్తూ భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. ‘నిజ్జర్‌ హత్య కేసుకు సంబందించి మేం ఎంతోకాలంగా చెబుతున్నది ఇదే. ఈరోజు మరోమారు రుజువైంది. మన దౌత్యవేత్తలపై చేస్తున్న తీవ్ర ఆరోపణలకు మద్దతిచ్చేలా కెనడా మనకు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య సంబంధాలు తీవ్రస్థాయిలో దిగజారాయి. దీనికి కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోనే కారణం’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాస్‌ వెల్లడించారు.

    అంగీకరించిన ట్రూడో..
    నిజ్జర్‌ గతేడాది హత్యకు గురయ్యాడు. అయితే ఈ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉందని ట్రూడో ఆరోపించారు. తాజాగా మళ్లీ అవే ఆరోపణలు చేశారు. అయితే భారత్‌ ఆధారాలు అడిగితే మాత్రం ఆలస్యం చేస్తూ వచ్చారు. ఇప్పడు తమ వద్ద ఆధారాలు లేవని తనే ప్రకటించారు. పరోక్షంగా భారత పాత్ర లేదని అంగీకరించాడు. కెనడా ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్య వ్యవస్థల్లో విదేశాల జోక్యంపై విచారణ చేస్తున్న కమిటీ ఎదుట ఈ విషయాన్ని స్పష్టం చేశారు ట్రూడో. అయితే ఈ సందర్భంగా భారత్‌పై మరోమారు అభ్యంతరకర ఆరోపణలు చేశాడు. భారత ప్రధాని మోదీ నేతృత్వంలోని సర్కార్‌తో విభేదించే కెనడావారి వివరాలను ఇక్కడి భారత దౌత్యవేత్తలు సేకరించి ఉన్నతస్థాయిలో వారికి, లారెన్స్‌ బిష్ణోయ్‌ వంటి నేరగాళ్ల ముఠాలకు చేరవేస్తున్నారని ఆరోపించారు.