https://oktelugu.com/

Everest : ప్రకృతి చెక్కిన శిల్పం ఎవరెస్ట్‌.. ఆకట్టుకుంటున్న డ్రోన్‌ దృశ్యాలు.. వైరల్‌ వీడియో!

ఇక ఎవరెస్టు శిఖరాన్ని డ్రోన్‌ కెమెరాలో బంధించేందుకు డీజేఐ గ్లోబల్‌ సంస్థ ఇందుకోసం చాలా కష్టపడింది. సముద్రమట్టానికి 3,500 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్‌ క్యాంపు వరకు చేరుకుని అక్కడి నుంచి డ్రోన్‌ను ప్రయోగించారు. అక్కడి నుంచి శిఖరం అగ్రభాగం మీదుగా వెళ్తూ.. అక్కడి దృశ్యాలను డ్రోన్‌ చిత్రీకరించింది. ఎవరెస్టు శిఖరం ఎక్కుతున్న వారిని, దిగుతున్నవారిని కూడా ఈ వీడియోలో చూడవచ్చు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 12, 2024 / 09:36 PM IST
    Follow us on

     

    Everest : ప్రపంచంలో ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్‌. ఈ శిఖరాన్ని అధిరోహించాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఇక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక కొందరు.. ఆర్థిక స్తోమత లేక ఇంకొందరు.. తమ కోరికను అణచివేసుకుంటారు. అలాంటి వారి కోసం చైనాకు చెందిన డ్రోన్‌ తయారీ సంస్థ డీజేఐ గ్లోబల్‌.. డ్రోన్‌ కెమెరా సహాయంతో అద్భుతమైన వీడియో చిత్రీకరించింది. శిఖరం పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించింది. ప్రకృతి చెక్కిన పాలరాతి బొమ్మలా కనిపిస్తున్న ఈ వీడియోను చూసి ఎవరైనా మైమరచిపోవాల్సిందే.

    ఇలా వీడియో చిత్రీకరణ..
    ఇక ఎవరెస్టు శిఖరాన్ని డ్రోన్‌ కెమెరాలో బంధించేందుకు డీజేఐ గ్లోబల్‌ సంస్థ ఇందుకోసం చాలా కష్టపడింది. సముద్రమట్టానికి 3,500 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్‌ క్యాంపు వరకు చేరుకుని అక్కడి నుంచి డ్రోన్‌ను ప్రనయోగించారు. అక్కడి నుంచి శిఖరం అగ్రభాగం మీదుగా వెళ్తూ.. అక్కడి దృశ్యాలను డ్రోన్‌ చిత్రీకరించింది. ఎవరెస్టు శిఖరం ఎక్కుతున్న వారిని, దిగుతున్నవారిని కూడా ఈ వీడియోలో చూడవచ్చు. అంతేకాకుండా శిఖరానికి సమీపంలో ఉన్న హిమనీ నదాలు, తెల్లటి మంచు దుప్పటి కప్పినట్లుగా ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలు వీక్షకులకు కనువిందు చేస్తున్నాయి. ప్రకృతి అందాలతో అబ్బుర పరుస్తున్న ఈ వీడియోను చైనాకు చెందిన వారే ఎక్స్‌ లో పోస్టు చేశారు.

    వేలాది వ్యూస్‌..
    ఇక ఈ వీడియోను ఎక్స్‌లో పోస్టు చేసిన గంటల్లోనే వేలాది వ్యూస్‌ వచ్చాయి. ఈ వీడియోను చూసినవారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అద్భుతంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో చేసిన తర్వాత ఎవరెస్ట్‌ ఎక్కాలన్న సకల్పం బలపడిందని మరికొందరు వ్యాఖ్యానించారు. చాలా అందమైన ఆహ్లాద కరమైన వీడియో ఇదని మరికొంరు కామెంట్‌ చేశారు. బెస్ట్‌ ఎవరెస్ట్‌ వీడియో అని ఇంకొందరు.. కామెంట్‌ పెట్టారు.. కూల్‌ థ్యాంక్స్‌ అని కొందరు పోస్టు చేసిన వారికి థ్యాంక్స్‌ చెప్పారు.

    ప్రపంచంలోనే ఎత్తన పర్వతం..
    ఇక ఎవరెస్టు పర్వతం గురించి తెలుసుకోవాలంటే.. ఇది ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతం. సముద్రమట్టానికి 8,848 మీటర్ల ఎత్తు లేదా 29,028 అడుగుల ఎత్తులో ఉంది. ఇది నేపాల్‌లో ఉంటుంది. ఈ పర్వతాన్ని నేపాలీలు గౌరీశంకర శిఖరం అని అంటారు. ఈ శిఖరాన్ని లక్పా షెర్పా అత్యంధికంగా ఏడుసార్లు అధిరోహించింది.

    ఎవరీ లక్పా షెర్పా..
    నేపాల్‌కు చెందిన పర్వతారోహకురాలు లక్పా షెర్పా. ప్రపంచంలోకెల్లా ఎత్తయిన ఎవరెస్ట్‌ను ఆమె ఏడుసార్లు అధిరోహించిన మొట్టమొదటి మహిళగా రికార్డుకెక్కారు. ఇక ఎవరెస్ట్‌ను అధిరోహించిన నేపాల్‌కు చెందిన మొదటి మహిళ కూడా ఈమే. నేపాల్‌లోని మకలులో పెరిగారు లక్పా. ఈమె తల్లిదండ్రులకు 11 మంది సంతానం. రోమన్‌ అమెరికన్‌ జాతికి చెందిన జార్జ్‌ డిజ్మారెస్కును లక్మా 2002లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నారు. లక్మా 2016లో ఏడోసారి ఎవరెస్ట్‌ను అధిరోహించారు.

    26 సార్లు అధిరోహించిన కమీ రీటా..
    ఇక నేపాల్‌లోని సోలుకుంబు జిల్లాలోని థేమ్‌లో జన్మించిన ఒక ప్రసిద్ధ పర్వతారోహకుడు కమీ రీటా. ఇతను ఇప్పటి వరకు ప్రపంచంలోని ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని 26 సార్లు అధిరోహించారు. అత్యంత నిష్ణాతుడైన నేపాలీ షెర్పా గైడ్‌. ఈ ఘటన అతనిని ప్రపంచంలో ఎవరెస్టు శిఖరాన్ని అధికసార్లు అధిరోహించిన మొదటి వ్యక్తిగా చేసింది. 2018 మే నుంచి ఎవరెస్టు శిఖరాన్ని అత్యధికంగా అధిరోహించి రికార్డు కూడా కమీ రీటా పేరిటే ఉంది.2022 మే 7వ తేదీన అతను 26వ సారి ఎవరెస్టును అధిరోహించారు. 2021, మే 7న నెలకొల్పిన తన రికార్డును బద్ధలు కొట్టాడు. 2023, మే 17న ఎవరెస్టును 27వ సారి ఎక్కాడు.