Balakrishna : బాలకృష్ణకు నందమూరి అందగాడు అనే బిరుదు ఉంది. ఉంగరాల జుట్టుతో చాలా అందంగా ఉండేవాడు. ఆయనతో నటించిన పలువురు హీరోయిన్స్ బాలకృష్ణతో చనువుగా ఉండేవారు. ఒక హీరోయిన్ మరింత చనువుగా ఉండేదట. ఆమె ఎవరో కాదు రమ్యకృష్ణ. వీరిద్దరి కాంబినేషన్ లో పలు చిత్రాలు తెరకెక్కాయి. 1993లో విడుదలైన బంగారు బుల్లోడు బ్లాక్ బస్టర్. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అనంతరం దేవుడు, వంశోద్ధారకుడు, వంశానికొక్కడు వంటి చిత్రాల్లో జతకట్టారు. కాగా రమ్యకృష్ణతో బాలయ్య సెట్స్ లో జోవియల్ గా ఉండేవారట. ఇద్దరూ సరదా సరదా కబుర్లు చెప్పుకునేవారట. అయితే ఒకరోజు రమ్యకృష్ణ చేసిన పనికి బాలకృష్ణ ఫ్యూజులు ఎగిరిపోయాయట. విషయంలోకి వెళితే… షూటింగ్స్ సెట్స్ కి కుటుంబ సభ్యులు రావడం చాలా కామన్. హీరోల భార్య, పిల్లలు సరదాగా వస్తుంటారు. అవుట్ డోర్ షూటింగ్స్ కి తక్కువ. కానీ హైదరాబాద్ లో జరిగే షూటింగ్స్ కి హాజరు అవుతారు. సరదాగా షూటింగ్ చూసి ఎంజాయ్ చేస్తారు..
గతంలో బాలకృష్ణ నటిస్తున్న షూటింగ్ సెట్స్ కి భార్య వసుంధర వచ్చారట. బాలయ్యను ఆట పట్టించాలని రమ్యకృష్ణ ఆయన బుగ్గ మీద పుట్టిందట. ఎదురుగా భార్య వసుంధర ఉన్న నేపథ్యంలో బాలకృష్ణ ఒకింత షాక్ అయ్యాడట అయితే ఈ విషయాన్ని వసుంధర పెద్దగా సీరియస్ గా తీసుకోలేదట. ఇదంతా కామెడీలో భాగమే. తప్పుబట్టాల్సిన అవసరం లేదని ఆమె భావించారట.
కాగా హీరోయిన్ రాధకు కూడా బాలకృష్ణ అంటే చాలా ఇష్టం అట. ఇటీవల ఆమె ఆలీతో సరదాగా షోకి వచ్చారు. ఈ క్రమంలో బాలయ్య టాపిక్ వచ్చింది. రాధ, ఆయనంటే నాకు ఇష్టమని చెప్పింది. బాలయ్యకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. మరోవైపు బాలయ్య వరుస సినిమాలతో బిజీ ఉన్నారు. అఖండ ముందు వరకు బాలయ్య కెరీర్ ఒడిదుడుకులు ఎదుర్కొంది. అఖండతో ఆయన ఫుల్ ఫార్మ్ లోకి వచ్చాడు . వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి విజయాలతో హ్యాట్రిక్ పూర్తి చేశాడు.
ఇక 2025 సంక్రాంతికి డాకు మహారాజ్ గా వస్తున్నాడు. ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకుడు. ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ ఆకట్టుకుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బాలకృష్ణ తన విజయ పరంపర కొనసాగించడం ఖాయంగా కనిపిస్తుంది. అనంతరం బాలయ్య తనకు అచొచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో నాలుగో చిత్రం చేస్తున్నాడు.