Qantas Airline : విమానంలో A సర్టిపికెట్‌ సినిమా.. ఇబ్బంది పడ్డ ప్రయాణికులు

ప్రయాణికుల సౌకర్యార్తం బస్సులు, రైళ్లు, విమానాల్లో అనేక సౌకర్యాలు కల్పిస్తుంటారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారికి వినోదం కోసం టీవీలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల ఫ్రీ వైఫై కూడాఅందిస్తున్నాయి ఆయా సంస్థలు

Written By: Raj Shekar, Updated On : October 7, 2024 2:28 pm

Qantas Airline

Follow us on

Qantas Airline : సుదూర ప్రయాణాలు చేసేవారికి బోర్‌ కొట్టకుండా.. ప్రయాణాన్ని ఎంజాయ్‌ చేయడానికి బస్సులు, రైళ్లు, విమానాల్లో ఆయా సంస్థలు సౌకర్యాలు కల్పిస్తున్నాయి. అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నాయి. చాలాకాలంగా బస్సులు, రైళ్లు, విమానాల్లో టీవీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రయాణికుల కోసం సినిమాలు ప్రదర్శిస్తుంటారు. పాటలు వేస్తుంటారు. ఇటీవల టెన్నాలజీ పెరగడంతో విమానాలు, చైళ్లలో ఫ్రీ వైఫైని కూడా అందుబాటులోకి తెచ్చారు. విమానాల్లో అయితే ప్రతీ సీటుకు ఒక ఎల్‌ఈడీ స్క్రీన్లు ఉంటాయి. మనకు అవసరం లేదనుకుంటే ఆఫ్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. బస్సులు, రైళ్లలో మాత్రం ఆపరేటింగ్‌ మొత్తం డ్రైవర్ల వవద్దనే ఉంటుంది. అయితే ఆస్ట్రేలియా నుంచి జపాన్‌కు వెళ్లున్న ఓ విమానంలో ప్రదర్శించిన సినిమాతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఆఫ్‌ చేసుకునే ప్రయత్నం చేసినా ఆఫ్‌కాకపోవడంతో తలలు పట్టుకున్నారు.

ఏం జరిగిందంటే..
కావంటాస్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం క్యూఎఫ్‌59 విమానం ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి జపాన్‌లోని హనెడాకు బయల్దేరింది. ప్రయాణికుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. విమానం టేకాపన్‌ అయిన కాసేపటికి ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది ఓ చిత్రాన్ని ప్రదర్శించడం ప్రారంభించారు. ఆ సినిమా అడల్ట్‌ కంటెంట్‌ సినిమా కావడంతో కొందరు ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. పిల్లలతో కలిసి వెళ్తున్న మహిళలు, తల్లిదండ్రుల కూడా ఇబ్బందిగా ఫీల్‌ అయ్యారు. స్క్రీన్‌ ఆఫ్‌ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆఫ్‌ కాలేదు.

సాంకేతిక సమస్య..
ఆస్ట్రేలియా నుంచి జపాన్‌కు వెళ్తున్న క్వాంటాస్‌ ఎయిర్‌లైన్‌ విమానంలోని ఎంటర్‌టైన్‌మెంట్‌ సిస్టంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రతీ సీటుకు ఉండే టీవీలు ఆఫ్‌ చేయడం కుదరలేదు. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న అందరూ అడల్ట్‌ కంటెంట్‌ సినిమాను బలవంతంగా చూడాల్సి వచ్చింది. సిబ్బంది ఆలస్యంగా సమస్యను గుర్తించారు.కాసేపటికి సినిమాను నిలిపివేశారు. విమానం సిబ్బందిపై కొందరు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత పిల్లలకు ఇష్టమైన సినిమాలను ప్రదర్శించారు. అసౌకర్యానికి మన్నించాలని క్వాంటాస్‌ ఎయిర్‌లైన్‌ ప్రయాణికులను కోరింది.

అందరి సినిమాకాదు..
‘విమానంలో ప్రదర్శించిన సినిమా అందరికీ కాదని అర్థమైంది. ఇలాంటి చేదు అనుభవం ఎదుర్కొన్న ప్రతీ ప్రయాణికుడికి క్షమాపణలు చెబుతున్నాం. వెంటనే సినిమారు మార్చేసి మరో సినిమా ప్రదర్శించాం. ఇకపై ఇలాంటి పరిస్థితి రాకుండా చూస్తాం. సాంకేతిక సమస్యతోనే చేదు అనుభవం ఎదురైంది. అని ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధి తెలిపారు. కానీ, అప్పటిక కొందరు ప్రయాణికులు విమానంలో అడల్ట్‌ కంటెట్‌ సినిమా ప్రదర్శన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేసి వైరల్‌ చేశారు. విమానంలో ఇలాంటి సినిమాలు ప్రదర్శించడం ఏంటని ప్రశ్నించారు. నెటిజర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.