Hafiz Saeed: పాకిస్తాన్‌లో జరిగిన ఒక భారీ ధమాకా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కానీ దానికి సంబంధించిన ముఖ్య వివరాలు రహస్యంగా ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి పాకిస్తాన్‌లో ఎవరూ మాట్లాడడం లేదు. అంతా మౌనం వహిస్తున్నారు. ఈ ఘటనలో లష్కర్ ఎ తోయిబా సంస్థకు చెందిన అబ్దుల్ గఫార్ అనే ప్రముఖ కమాండర్ రహస్య పరిస్థితుల్లో మరణించాడు. ఈ మరణం ఆ సంస్థకు తీవ్ర దెబ్బ తగిలింది. దాని వెనుక దాగిన కారణాలు షాక్‌కు గురిచేస్తున్నాయి. లష్కర్ ఎ తోయిబా చీఫ్ హఫీజ్ సయాద్ కుడి భుజం అబ్దుల్ గఫార్‌ను లేపేయడంతో నెక్ట్స్ టార్గెట్ హఫీజ్ అన్న చర్చ జరుగుతోంది.
లష్కర్ కీలక సభ్యుడు గఫార్..
అబ్దుల్ గఫార్ సాధారణ ఉగ్రవాది కాదు. అతను లష్కర్ ఎ తోయిబా ప్రధాని హఫీజ్ సయ్యిద్‌కు అతి సన్నిహిత సహచరుడు. ఈ సంస్థ ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించే వ్యక్తిగా, జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో అనేక దాడులకు నాయకత్వం వహించాడు. కొన్ని రోజుల ముందు హఫీజ్ సయ్యిద్ కుమారుడు తల్హా సయ్యిద్‌తో కలిసి ఒక పెళ్లి వేడుకల్లో చిరునవ్వుతో ఫొటో తీసుకున్నాడు. అయితే, త్వరలోనే అదే ప్రదేశంలో ఇద్దరు అగంతకుల కాల్పుల్లో మరణించాడు. ఈ దాడి గఫార్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగినట్టు సమాచారం.
అధికారిక మౌనం..
గఫార్ మరణంపై పాకిస్తాన్ అధికారులు లేదా లష్కర్ నేతలు ఎటువంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. ఉగ్రవాద సమూహాల ప్రతినిధులు అనధికారికంగా ఈ మరణాన్ని ధ్రువీకరిస్తున్నారు. 2018లో ఎఫ్‌ఏటీఎఫ్ ఒత్తిడికి లొంగి పాకిస్తాన్ 13 మంది ఉగ్రవాదులను అరెస్టు చేసినట్టు చెప్పుకుంది, వారిలో గఫార్ కూడా ఉన్నాడు. ఈ ఘటనలు పాకిస్తాన్‌లోని ఆంతరిక ఒత్తిడులను సూచిస్తున్నాయి. హఫీజ్ సయ్యిద్ ఈ మరణం వల్ల తీవ్ర మనస్తాపం చెందాడు. ఇక తర్వాత టార్గెట్ తానేనా అనే భయం హఫీజ్‌కు పట్టుకుంది.
వెనుకున్నదెవరు..?
గఫార్ మరణానికి వెనుక పనిచేసినవారు ఎవరు అనేది ఇంకా స్పష్టంగా లేదు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్‌ఐ దీన్ని రహస్యంగా నిర్వహించి ఉండవచ్చని అనుమానాలు ఉన్నాయి. లేదా అజ్ఞాత సాయుధ దళాలు ఈ దాడి చేపట్టి ఉండవచ్చు.
పాకిస్తాన్‌లోని ఆంతర్గత రాజకీయాలు, అంతర్జాతీయ ఒత్తిడులు లేదా సంస్థల మధ్య పోటీలను సూచిస్తుంది. గఫార్ వంటి నాయకుడి చంపడం సంస్థల బలహీనతకు దారితీస్తుంది. భవిష్యత్ ఆపరేషన్లపై ప్రభావం చూపవచ్చు.
