https://oktelugu.com/

The journey of a man’s life : ‘‘కులమూ.. మతమూ.. నీతి.. జాతి..’’ అని వ్యర్థ వాదములెందుకు?

ఆధునిక మనిషి వయసు 20 లక్షల ఏండ్లు. కానీ.. పెళ్లి మొదలై 3 వేల సంవత్సరాలే. అంతకు ముందు గుహలలో గుడుగుడు ఎలా సాగి ఉంటదో మీ ఊహ. తల్లి మాత్రమే అందరికీ తెలిసేది. తానే పెంచి పెద్ద చేసేది. కాల క్రమంలో మనిషికి తన సొంత వ్యక్తులు అవసరమయ్యారు. పెళ్లి, వారసత్వం ఏర్పడ్డాయి. మరి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి? అనేది చాలా పెద్ద ప్రశ్న.

Written By:
  • NARESH
  • , Updated On : December 21, 2024 / 10:19 AM IST
    Follow us on

    The journey of a man’s life : 1987 లో ఒక రీసెర్చ్ చేశారు. ప్రపంచంలోని వంద దేశాల నుంచి 100 మంది ఆడవాళ్లను సెలక్ట్ చేసి, వాళ్ల DNA ను టెస్టు చేశారు. నేటి ఆధునిక మానవుడు (homo sapien) ఎక్కడ పుట్టాడు అని తెలుసుకోవడానికి ఈ టెస్టు. ఆశ్చర్యంగా వాళ్ల అందరి మూలం ఆఫ్రికా అని తేలింది.

    వ్యవసాయానికి ముందు అందరివీ ప్రపంచ దిమ్మరి బతుకులేగా. అలా.. అక్కడి నుంచి వలస జీవన విధానంతో ప్రపంచం నలుదిక్కులా విస్తరించారు. స్థిరపడిన ప్రాంత వాతావరణం బట్టి రంగు తేలారు. ఈ research పేరు “mitochondrial eve”. మరింత తెలుసుకోవాలంటే గూగుల్ చేసుకోవచ్చు.
    సంప్రదాయం మీద నేను పెట్టిన మొదటి పోస్టు కొందరికి
    నచ్చలేదు. అందుకే.. వారికి తెలియని వారి పుట్టుక చరిత్ర ఇక్కడ ముద్రిస్తున్న.

    ఆధునిక మనిషి వయసు 20 లక్షల ఏండ్లు. కానీ.. పెళ్లి మొదలై 3 వేల సంవత్సరాలే. అంతకు ముందు గుహలలో గుడుగుడు ఎలా సాగి ఉంటదో మీ ఊహ.
    తల్లి మాత్రమే అందరికీ తెలిసేది. తానే పెంచి పెద్ద చేసేది. కాల క్రమంలో మనిషికి తన సొంత వ్యక్తులు అవసరమయ్యారు. పెళ్లి, వారసత్వం ఏర్పడ్డాయి. మరి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి? అనేది చాలా పెద్ద ప్రశ్న.

    బయటి వాళ్లను పెళ్లి పేరుతో ఇంట్లో చేర్చుకుంటే ఎలా? మనల్ని మొత్తం దోచుకపోతే ఎట్లా? అనే భయం కలిగిన వాళ్లు ఇంట్లోని వాళ్లను, వాళ్ల సమూహంలోని వాళ్లను పెళ్లి చేసుకోవడం మంచిదని భావించారు. కొందరు అనివార్య కారణాలతో బయటి నుంచీ ఆహ్వానించారు. ఇలా 20 లక్షల ఏండ్లలో జనాలు గుంపులుగా స్థిర పడిన ప్రాంతాలే ఇప్పుడు ఆయా దేశాలు. వాళ్లకు నచ్చి పాటిస్తున్నవే ఆచారాలు.
    ఇప్పుడు చెప్పు.. నా సాంప్రదాయం ఒక్కటే గొప్పది, మిగిలినవన్నీ వేస్టు అని ఎలా అనగలవు? నీ పుట్టుక మూలం ఆఫ్రికాలో ఉంది. మూడు వేల ఏండ్ల కింద నీకు వావి వరసలే లేవు. నాడు తిండి తిప్పలు లేక నీ పూర్వీకులు తోటి వాడు తెచ్చిన మాంసం పీక్కు తింటే.. ఇవాళ నువ్వు పక్కనోడి తిండి మీద కామెంట్ చేస్తవు.

    మన 3 వేల ఏండ్ల చరిత్ర మూడు ముక్కల్లో చెప్పాను. ఎలా ఉంది? వింటేనే.. నీ కడుపులో దేవేసినట్టుగా ఉందా? నిజం కదా.. గట్లనే ఉంటది. ఇక, మొన్నటి రెండు, మూడు వందల ఏండ్ల చరిత్ర చెప్పానంటే.. కోలుకోవడానికి వారం పట్టుద్ది. అదే.. చెంఘీజ్ ఖాన్ వేసిన విత్తనాల గురించి చెప్పాననుకో.. నువ్వు ఎక్కడ మొలకెత్తావో ఆలోచించడానికే వణికిపోతావు. చరిత్ర చించుకుంటే.. మన పుట్టుక మీదనే పడతది. తట్టుకోలేవ్.
    సో.. నువ్వు, నేను, మన పక్కనోడు అందరి పుట్టుక Mitochondrial Eve నుంచి వచ్చిందని గుర్తు పెట్టుకో. ఆమే మన అమ్మ. మనం అందరం సోదరులమే. విశ్వనరులమే. వారు వారు పుట్టిన ప్రాంతాలు, ఆలోచనల రీతిన ఆచారాలు, సంప్రదాయాలు ఏర్పడ్డాయి. ఇది కూడా అర్థం కాకుండా పిల్ల ఏశాలు ఏశావనుకో.. ఈ సారి చెంఘీజ్ విత్తనాలు, బ్రిటీషు, మొఘల్ మొలకలు నీ బుర్రలో చల్లుతా. ఏరుకోవడానికి, తిని జీర్ణించుకోవడానికి జీవిత కాలం పట్టుద్ది.

    -RK