Pakistan Airline: ఉగ్రవాద మూకలకు పాకిస్తాన్ అడ్డా అనేది ఎప్పటినుంచో ప్రపంచానికి తెలుసు. అయినా అమెరికా లాంటి దేశాలు తమ ప్రయోజనాల కోసం పాకిస్థాన్ కు వంత పాడుతుంటాయి. చైనా లాంటి దేశాలు మన మీద పెత్తనం చెలాయించడానికి పాకిస్తాన్ కు ఆర్థికంగా సహాయం చేస్తుంటాయి. అయినప్పటికీ పాకిస్తాన్ ఆర్థికంగా ఎదగలేదు. అభివృద్ధి పరంగా దూసుకు వెళ్లలేదు. వచ్చిన డబ్బులను నేతలు పంచుకుంటారు. అక్కడ ఆర్మీ దే పెత్తనం కాబట్టి.. విదేశాల నుంచి వచ్చిన డబ్బులను ఆయుధాలు కొనుగోలు చేస్తుంది.. ఉగ్రవాద మూకలకు అందిస్తుంది.. అన్న పానీయాల కంటే అణ్వస్త్రాలకే ప్రాధాన్యం ఇస్తూ ఉంటుంది. అందువల్లే పాకిస్తాన్లో దుర్భర దారిద్రం తాండవిస్తూ ఉంటుంది. ఏళ్లుగా ఇదే పరిస్థితి.. పాలకులు మారినా కనిపించని పురోగతి.. అయితే అటువంటి పాకిస్తాన్ నుంచి ఒక సంచలన ప్రకటన విడుదలైంది.
విమానాలు నడుపుతారా? ఉగ్రదాడికి ప్లాన్ చేశారా?
పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ (Pakistan airlines) నుంచి ఒక ప్రకటన విడుదలైంది. దాని సారాంశం ఏంటంటే… నాలుగు సంవత్సరాల తర్వాత పారిస్ నగరానికి విమానాల రాకపోకలను ప్రారంభిస్తున్నామని పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ ప్రకటన చేసింది. ” పారిస్ (Paris) మేము వచ్చేస్తున్నామని” పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ ఐఫిల్ టవర్ (Eiffel tower) వైపు విమానం వస్తున్నట్టుగా ఆ ప్రకటనలో చిత్రాన్ని రూపొందించింది. ఇది కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. దీంతో నెటిజన్లు పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు. ” అబ్బా ఇది పెద్ద జోక్. మీరు విమానాలను నడుపుతారా? మీకు ఏమీ అనిపించడంలేదా ఇలా చెబుతుంటే.. అమెరికాలో (America) ట్విన్ టవర్స్ (twin towers) పై బిన్ లాడెన్ ఆధ్వర్యంలో దాడి చేసినట్టుగా.. ఇప్పుడు పారిస్ పై దాడికి ప్లాన్ చేశారా? నిజంగా మీరు విమానాలు నడుపుతారా? మీకు అది సాధ్యమవుతుందా? విదేశాలు ఇచ్చే చిల్లర మీద బతికే మీరు విమానాలు నడపడం ఏంటి? మీరు దానిని ప్రకటన రూపంలోనే రూపొందించారా? లేకుంటే యూరోపియన్ యూనియన్ ను హెచ్చరిస్తున్నారా” అంటూ నెటిజన్లు పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ ను ఉద్దేశించి విమర్శిస్తున్నారు. 2020లో కరాచీలో యూరోపియన్ యూనియన్ కు చెందిన విమానం క్రాష్ అయింది. ఆ ప్రమాదంలో చాలామంది చనిపోయారు. అప్పటినుంచి పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ విమానాలను యూరోపియన్ యూనియన్ నిషేధించింది. అయితే పాకిస్తాన్ నుంచి విమానాల రాకపోకలకు అనుమతి ఇస్తూ ఇప్పటివరకు యూరోపియన్ యూనియన్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అంతర్జాతీయ మీడియా కూడా ఎటువంటి వార్తలను ప్రసారం చేయలేదు. అలాంటిది పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ ఇలాంటి ప్రకటన చేయడం విశేషం.
పారిస్ కు విమానాలు నడుపుతున్నామంటూ పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ చేసిన ప్రకటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. గతంలో ట్విన్ టవర్స్ మీద చేసినట్టుగానే.. ఇప్పుడు పారిస్ మీద కూడా ఉగ్రదాడి చేస్తారా? అంటూ ట్రోల్ చేస్తున్నారు. #pakaairlines#Europeanunion #Paris pic.twitter.com/XQQTch1Y3u
— Anabothula Bhaskar (@AnabothulaB) January 11, 2025