Bikini Atoll: ప్రపంచంలోని అనేక ద్వీపాల గురించి తెలిసే ఉంటుంది. ద్వీపాల ఒడ్డున అందమైన నీలి సముద్రం, చుట్టూ పచ్చని పర్వతాలు, నీటి ముందు తెల్లటి ఇసుకతో ప్రజలు సూర్యరశ్మిని ఆనందిస్తారు. అటువంటి ద్వీపాన్ని సందర్శించిన ప్రతి వ్యక్తికి శాంతి, మానసిక ప్రశాంత రెండూ లభిస్తాయి. సంపన్నులు చాలా మంది ఇలాంటి ద్వీపాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తారు. గర్ట్‌ఫ్రెండ్.. లవర్.. వైఫ్‌తో వెళ్లితే ఆ ఎంజాయ్‌మెంట్ వేరేగా ఉంటుంది. కానీ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీపం విషయంలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. చూడడానికి అందంగా కనిపిస్తున్నా.. ఇక్కడకు వెళ్లిన వ్యక్తి ఎంజాయ్‌కు బదులుగా మరణాన్ని చూస్తాడు.
మృత్యు ద్వీపం..
పసిఫిక్ మహాసముద్రంలోని బికిని అటోల్ అనే కోరల్ ద్వీపంలో మనిషి అన్న మాట లేదు. ఎందుకంటే దీనిని ప్రపంచంలోని న్యూక్లియర్ కలుషిత ద్వీపం అంటారు. ఈ ద్వీపానికి వెళ్లే ప్రతి వ్యక్తి నేరుగా మరణానికి దగ్గరవుతాడు. అలా ఎందుకు అవుతుందంటే అమెరికా ఈ ద్వీపాన్ని ణు బాంబు పరీక్షా స్థలంగా ఉపయోగించింది. జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై అణు బాంబులు పడడంతో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. అయితే, దీని తర్వాత కూడా అమెరికా మరెన్నో అణ్వాయుధ పరీక్షలను కొనసాగించింది.. బికినీ అటోల్ మార్షల్ దీవుల నుంచి ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం కూడా అదే చివరి వరుసలో ఉంది. రెండు చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ప్రాంతం నేడు పూర్తి ఎడారిగా మారిపోయింది.
23 అణు పరీక్షలు..
ద్వీపం అంటేనే జనాభా తక్కువగా ఉంటుంది. బికినీ లటోల్ ద్వీపంలో కూడా గతంలో జనాభా చాలా తక్కువగా ఉండేది. ఇక్కడ 167 మంది మాత్రమే నివసించేవారు. రానున్న రోజుల్లో యుద్ధాన్ని ఆపాలంటే ఇక్కడ జరిగే పరీక్ష చాలా ముఖ్యమని ఆ దీవిలో నివసిస్తున్న ప్రజలను అమెరికా సైన్యం మరో చోటికి పంపింది. మొదట్లో ఇక్కడి నుంచి వెళ్లేందుకు ప్రజలు నిరాకరించారు. అందరినీ ఒప్పించి ఇక్కడ్నుంచి తరలించినట్టుగా తెలిసింది. ఆ తరువాత అమెరికా ఈ ద్వీపంలో 1946 నుంచి 1958 వరకు మొత్తం 23 అణు పరీక్షలను నిర్వహించింది. వాటిలో 20 హైడ్రోజన్ బాంబులు.
అత్యంత ప్రమాదకరమైన బాంబు..
పరీక్షలో ఒక బాంబు అత్యంత ప్రమాదకరమైనది. ఇది నాగసాకిని నాశనం చేసిన బాంబు కంటే వెయ్యి రెట్లు శక్తివంతమైనది. 2017లో అటోల్ ద్వీపాన్ని సందర్శించిన ఒక ప్రొఫెసర్ బాంబు పేలుడు కారణంగా ఏర్పడిన శి«థిలాలు ఆకాశంలోకి 65 కి.మీ కంటే ఎక్కువ దూరం వెళ్లి ఉంటాయని అంచనా వేశారు. 1960లలో అటామిక్ ఎనర్జీ కమిషన్ ఈ ద్వీపాన్ని నివాసయోగ్యమైనదిగా ప్రకటించింది. ఇక్కడ నివసించేందుకు ప్రజలను అనుమతించింది. అయితే ఈ నిర్ణయం అతడి ప్రాణాలను బలిగొన్నది.
శరీరాల్లో రేడియేషన్
అయితే ఈ నిర్ణయంతో ఇక్కడి నుంచి తరలించిన వారు తిరిగి ద్వీపానికి వచ్చారు. కానీ, వారి శరీరాల్లో సీసియం–137 స్థాయి 75 శాతం పెరిగిందని గుర్తించారు. ఫలితంగా శరీరంలో రేడియేషన్ పరిమాణం చాలా పెరిగింది. సీసియం కారణంగా, శరీరంలో వివిధ రకాల వ్యాధులు సంభవించడం ప్రారంభించాయి. ఇది మానవుని మరణానికి కూడా దారితీస్తుంది. ఈ కారణంగానే ప్రొఫెసర్ మరణించాడు. దీంతో పదేళ్ల తర్వాత నివాసయోగ్యంగా ప్రకటించిన నిర్ణయాన్ని ఉప సంహరించుకున్నారు. నేటికీ అక్కడికి వెళ్లడం సరికాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2010లో అణుబాంబు సంఘటన, తీవ్రతను చూపించడానికి ఈ ప్రదేశం ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నిలిచి ఉంది.