Homeఅంతర్జాతీయంFree cancer vaccine: ఉచిత క్యాన్సర్ వ్యాక్సిన్.. ప్రపంచానికి రష్యా ఇచ్చిన గొప్ప వరం

Free cancer vaccine: ఉచిత క్యాన్సర్ వ్యాక్సిన్.. ప్రపంచానికి రష్యా ఇచ్చిన గొప్ప వరం

Free cancer vaccine: క్యాన్సర్‌.. ప్రస్తుతం సమాజంలో వేగంగా విస్తరిస్తున్న వ్యాధుల్లో ఇదీ ఒకటి. మారుతున్న జీవనశైలి.. ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితుల కారణంగా స్త్రీపురుష బేధం లేకుండా.. వయసుతో సంబంధం లేకుండా.. క్యాన్సర్‌ విస్తరిస్తోంది. ఇప్పటి వరకు చికిత్స తప్ప నివారణ లేని వ్యాధి. అయితే దీనికి రష్యా శుభవార్త చెప్పింది. క్యాన్సర్‌ నివారణకు వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా అందిస్తామని కూడా తెలిపింది. ఈ ఆవిష్కరణ ఆరోగ్య రంగంలో భారీ మలుపును తీసుకురావచ్చు.

వ్యాక్సిన్‌ సాంకేతిక విశేషాలు
ఈ వ్యాక్సిన్‌ mRNA సాంకేతికతపై ఆధారపడి రూపొందించబడింది, ఇది శరీరంలో క్యాన్సర్‌ కణాలను గుర్తించి నశింపజేసే రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. మెలనోమా, లంగ్‌ క్యాన్సర్, ప్యాన్‌క్రియాస్‌ వంటి ఆరు ముఖ్య రకాలపై ప్రధానంగా పనిచేస్తుంది. రష్యా గమాలేయా జాతీయ ఎపిడెమాలజీ – మైక్రోబయాలజీ రీసెర్చ్‌ సెంటర్‌లో అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌కు ’ఫ్యూచర్‌–వీ’ అనే పేరు ప్రతిపాదించారు.

క్లినికల్‌ ట్రయల్స్‌ పురోగతి
మొదటి, రెండవ దశ ట్రయల్స్‌లో 100 మంది పైగా రోగులపై పరీక్షలు విజయవంతమయ్యాయి. ట్యూమర్‌ పరిమాణం 30–50% తగ్గడం, రోగ నిరోధకత పెరగడం గమనించారు. మూడవ దశ 2026లో ప్రారంభం కానుంది, ఇందుకు డబ్ల్యూహెచ్‌వో, ఈఎంఏ ఆమోదాలు కోరుతున్నారు.

ఉచితంగా పంపిణీ..
2026 చివరి నుంచి ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్‌ వ్యాక్సిన్‌ ఉచితంగా అందజేయనున్నారు. రష్యా ప్రభుత్వం, గమాలేయా సెంటర్, అంతర్జాతీయ సంస్థల సహకారంతో 10 కోట్ల డోసులు ఉత్పత్తి చేయబడతాయి. దిగువ ఆదాయ వర్గాలు, అభివృద్ధి చెడుతున్న దేశాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. భారత్, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలతో ఒప్పందాలు కుదిరినట్లు వెల్లడించింది. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి, కానీ పూర్తి డేటా ప్రచురణకు ఆందోళన వ్యక్తం చేశాయి. పేటెంట్‌ హక్కులు, ఉత్పత్తి సామర్థ్యం ప్రధాన సవాళ్లు. విజయం సాధిస్తే, క్యాన్సర్‌ మరణాలు 40% తగ్గవచ్చని నిపుణులు అంచనా.

ఈ వ్యాక్సిన్‌ విస్తరణతో క్యాన్సర్‌ చికిత్స ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. పర్సనలైజ్డ్‌ మెడిసిన్‌కు మార్గం సుగమం అవుతుంది. మరిన్ని ట్రయల్స్‌ జరిగిన తర్వాత పూర్తి అమలు సాధ్యమవుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular