Raja Saab advance bookings: ప్రస్తుత ట్రెండ్ లో స్టార్ హీరో ని చూసి థియేటర్ కి ఆడియన్స్ గుడ్డిగా వెళ్లిపోయే రోజులు పోయాయి. వీరాభిమానులు వెళ్ళొచ్చేమో కానీ, జనరల్ ఆడియన్స్ మాత్రం ప్రమోషనల్ కంటెంట్ తమని అలరిస్తే కానీ టికెట్స్ బుక్ చేయడానికి ముందుకు రావడం లేదు. ముఖ్యంగా ఓవర్సీస్ మరియు నైజాం మార్కెట్స్ లో అయితే పరిస్థితి దారుణంగా మారిపోయింది. పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ సినిమాలకు కూడా ప్రమోషనల్ కంటెంట్ ని చూసి థియేటర్ కి వెళ్లే పరిస్థితి వచ్చిందంటే ఆడియన్స్ మైండ్ సెట్ ఎలా మారిందో చూడండి. ఈ ఏడాది జులై నెలలో విడుదలైన పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి ఓవర్సీస్ లోని నార్త్ అమెరికా లో ప్రీమియర్ షోస్ నుండి కేవలం 8 లక్షల డాలర్లు మాత్రమే వచ్చింది.
అందుకు ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోకి ఇలాంటి కలెక్షన్స్ రావడం ఏంటి?, పొరపాటు ఎక్కడ జరిగింది అంటూ విశ్లేషకులు జుట్టు పీక్కున్నారు. కానీ ఇదే పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం ‘హరి హర వీరమల్లు’ విడుదలైన రెండు నెలలకు థియేటర్స్ లో విడుదలైన కేవలం నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ నుండి 3 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఆడియన్స్ కి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయ్యింది. రెండు నెలల గ్యాప్ లో ఒక హీరో కి సంబంధించిన రెండు సినిమాలు విడుదలై కలెక్షన్స్ లో ఇంత తేడానా అని. ఇప్పుడు ప్రభాస్ ‘రాజా సాబ్’ చిత్రానికి కూడా ‘హరి హర వీరమల్లు’ పరిస్థితి వచ్చేలా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని ప్రారంభించి రెండు వారాలు అయ్యింది. ఈ రెండు వారాల్లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి $106K డాలర్స్ మాత్రమే వచ్చాయి.
కల్కి చిత్రం తో నార్త్ అమెరికా లో ప్రీమియర్ షోస్ తోనే మూడు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఒక హీరో సినిమాకు, ఇప్పుడు 1 మిలియన్ ప్రీమియర్స్ కూడా రావడం కష్టం లాగా ఉంది, ఇదెక్కడి విడ్డూరం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆశ్చర్యపోతున్నారు. ‘రాజా సాబ్’ నుండి ఇప్పటి వరకు ఒక పాట, ఒక ట్రైలర్, రెండు టీజర్స్ వచ్చాయి. అయినప్పటికీ ఈ చిత్రం ఆడియన్స్ లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేయలేకపోయాయి. అందుకే ఈ చిత్రానికి నార్త్ అమెరికా లో ఇంత తక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు అవుతున్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే ఈ చిత్రానికి $800K ప్రీమియర్స్ కూడా వచ్చేలా అనిపించడం లేదు. ఏదైనా బ్లాస్టింగ్ అప్డేట్ ఈ చిత్రం నుండి వస్తే, ప్రీమియర్స్ కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.