https://oktelugu.com/

Dubai Princess Sheika Mahra: విడాకులు కూడా ఒక వ్యాపారమే..బాబోయ్ దుబాయ్ మహారాణి తెలివితేటలు మామూలుగా లేవు..

అగ్గిపుల్ల.. కుక్కపిల్ల.. కావేవీ కవితకు అనర్హమని మహాకవి శ్రీ శ్రీ చెప్పాడు. నేటి కాలంలో విడాకులు కూడా వ్యాపార వస్తువని.. విడాకులు తీసుకున్నంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదని ఒక యువరాణి నిరూపిస్తోంది. ఇంతకీ ఈమె కథ ఏంటంటే..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 11, 2024 / 07:59 AM IST

    Dubai Princess Sheika Mahra

    Follow us on

    Dubai Princess Sheika Mahra: దుబాయ్ యువరాణి షేక్ మహ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టా గ్రామ్ లో 9.87 లక్షల మంది అనుసరిస్తున్నారు. అటువంటి ఈమె ఇటీవల తన సొంత బ్రాండ్ పేరుతో ఒక పెర్ఫ్యూమ్ విడుదల చేశారు. దానికి ఆమె పెట్టిన పేరు సంచలనంగా మారింది. ” నేను డివోర్స్ పేరుతో కొత్త పెర్ఫ్యూమ్ తీసుకొస్తున్నానని” దుబాయ్ యువరాణి ఇన్ స్టా గ్రామ్ వేదికగా వెళ్లడించారు.. తన సొంత బ్రాండ్ “మహ్రా ఎమ్ 1” కింద దీనిని త్వరలో బహిరంగ విపణిలోకి తీసుకొస్తానని ఆమె వెల్లడించారు. దానికి సంబంధించిన దృశ్యాలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. అయితే దీని విలువ ఎంతో ఆమె చెప్పలేదు.

    దుబాయ్ యువరాణి ఇటీవల తన భర్తతో విడాకులు తీసుకున్నట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దుబాయ్ ప్రాంత పరిపాలకుడు, యూఏఈ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ ఆల్ మక్తూమ్ కుమార్తె షేక్ మహ్రా. ఈమె బ్రిటన్ దేశంలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆ తర్వాత అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన సబ్జెక్టులో డిగ్రీ పట్టా పొందారు. సామాజిక సేవ మీద ఆసక్తి ఉన్న నేపథ్యంలో మహిళ సాధికారత కోసం కృషి చేస్తున్నారు. విశ్వ వేదికలపై మహిళా సాధికారత అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. వెనుకబడిన దేశాల్లో స్త్రీ విద్య ఆవశ్యకతను వివరిస్తున్నారు. తనవంతుగా మహిళల్లో అంతర్గత వ్యాధుల నివారణకు పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఆమె పనిచేస్తున్నారు.

    భర్తతో విడాకులు అనంతరం

    మహ్రా దుబాయ్ ప్రాంతానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షేక్ మనాబిన్ మహమ్మద్ అల్ మక్తూమ్ ను 2023 మే 27న వివాహం చేసుకున్నారు. ఏడాది అనంతరం వీరికి ఒక కుమార్తె జన్మించింది. ఆ సమయంలో మహ్రా తన ఆనందాన్ని సామాజిక మాధ్యమ వేదికల ద్వారా పంచుకుంది. తనకు కూతురు పుట్టడం జీవితంలో అత్యంత విలువైన జ్ఞాపకం అని పేర్కొంది. అదే సమయంలో తన భర్త, మార్తతో కలిసిన ఫోటోలు పోస్ట్ చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ కొద్ది రోజులకే విడాకుల ప్రకటన చేసి సంచలనం సృష్టించింది.. ఇకపై మనిద్దరమే అంటూ తన కుమార్తెతో దిగిన ఫోటోలు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె విడాకుల ప్రకటన చేయడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా సంచలనంగా మారింది. అయితే దాని వెనుక ఉన్న కారణాన్ని దుబాయ్ యువరాణి పరోక్షంగా ప్రకటించింది..” ప్రియమైన శ్రీవారికి మీరు ఇతరుల సాంగత్యాన్ని కోరుకుంటున్నారు. అందువల్లే మీతో విడాకులు తీసుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. మీకు నేను విడాకులు ఇచ్చాను. జాగ్రత్తగా ఉండండి. ఇట్లు మీ మాజీ సతీమణి” అని దుబాయ్ యువరాణి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. .

    డివోర్స్ పేరుతో పెర్ఫ్యూమ్

    ఆ తర్వాత కొద్ది రోజులకు డివోర్స్ పేరుతో పెర్ఫ్యూమ్ ను రిలీజ్ చేసింది. త్వరలోనే దీనిని మార్కెట్లోకి తీసుకురానుంది. అయితే తన భర్త పై కోపంతోనే ఆమె ఈ పెర్ఫ్యూమ్ బ్రాండ్ ను తెరపైకి తీసుకొచ్చిందని దుబాయ్ వర్గాలు అంటున్నాయి.. దుబాయ్ యువరాణి భర్త వ్యసనపరుడని.. అతనికి అమ్మాయిల పిచ్చి ఉందని.. అందువల్లే విడాకులు తీసుకుందని ప్రచారం జరుగుతోంది. గ్లోబల్ మీడియాలో కూడా దీనిపై రకరకాల కథనాలు ప్రసారమయ్యాయి కూడా. మొత్తానికి విడాకులను కూడా ఒక వ్యాపార వస్తువుగా మలచిన దుబాయ్ యువరాణికి సోషల్ మీడియాలో కొంతమంది నెటిజెన్లు జేజేలు పలుకుతున్నారు.