4B Movment : అయితే ఈ పరిణామం అమెరికా మహిళలల్లో కొంతమందికి నచ్చడం లేదు. ఇంతవారు సామాజిక మాధ్యమాల వేదికగా కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అమెరికావ్యాప్తంగా గత రెండు రోజులుగా కొందరు యువతులు, మహిళలు సరికొత్త నిరసన చేపడుతున్నారు. దానికి “4 బీ” ఉద్యమం అనే పేరు పెట్టారు. ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లో భారీగా పోస్టులు చేస్తున్నారు..” ట్రంప్ గెలవడం దారుణం. అమెరికాకు అతి చీకటి రోజు. ఈ నాలుగు సంవత్సరాలు ఆ దారుణాన్ని అమెరికా భరించాల్సిందే. దానిని మేము తట్టుకోలేకపోతున్నాం. అతడికి గెలుపు వల్ల మా హక్కులకు భంగం బాటిల్లుతుంది. గర్భస్రావం, లింగ సమానత్వం, ప్రజాస్వామ్యం, భవిష్యత్తు కాలం పై నాకు ఆందోళనగా ఉంది. దీనిపై మేం ఉద్యమం చేస్తున్నాం. ఇలాంటి వ్యక్తికి పట్టం కట్టిన మగవారిని కఠినంగా శిక్షించాలి. దానికోసమే మేము “4- బీ” ఉద్యమానికి శ్రీకారం చుట్టామని” అమెరికన్ మహిళలు పేర్కొంటున్నారు.
ఏమిటీ ఉద్యమం
4 – బీ ఉద్యమం అంటే.. నో బేబీస్, నో బైండింగ్, నో బ్రాంచెస్, నో బాయ్ ఫ్రెండ్.. అంటే ట్రంప్ కు ఓటు వేసిన యువకులు, పురుషులతో 4 బీ ఇంటి మంచిస్తున్న మహిళలు డేటింగ్ చేయరు. ఎలాంటి బంధాలు ఏర్పరచుకోరు. శారీరక సుఖాన్ని అనుభవించరు.. పిల్లల్ని కనరు. దీనిని కొంతమంది అమెరికన్లు “సె* స్ట్రైక్” అని కూడా పిలుస్తున్నారు. ఇది ట్రంప్ కు ఓటు వేసిన పురుషులకు అమెరికన్ మహిళలు విధిస్తున్న శిక్ష అని.. ఈ నాలుగు సంవత్సరాలు ఆ మహిళలు ఇదే విధానాన్ని కొనసాగిస్తారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఆ మహిళలు తాము ఈ నాలుగు సంవత్సరాలు ఎటువంటి రిలేషన్ షిప్ లో ఉండబోమని చెబుతున్నారు. తమ ఫోన్లలో డేటింగ్ యాప్స్ ను తొలగిస్తున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం తమ ఒంటరిగానే జీవిస్తామని పేర్కొంటున్నారు. అయితే ట్రంప్ కు వ్యతిరేకంగా ఓటు వేసిన వారిని మాత్రం తమ జీవితంలోకి ఆహ్వానిస్తామని ఆ మహిళలు చెబుతున్నారు. వారితో కలిసి ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని.. ట్రంప్ కాలంలో అమెరికాకు భవిష్యత్తు లేదని ఇప్పటికే తేలిపోయిందని.. అదే విషయాన్ని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ కుమార్తె కూడా చెప్పిందని.. వారు వివరిస్తున్నారు. ట్రంప్ కు వ్యతిరేకంగా సాగిస్తున్న ఉద్యమం మరింత ఉధృత రూపం దాల్చుతుందని.. దానికి మేము కట్టుబడి ఉంటామని ఓ యువతీ చేసిన ప్రతిజ్ఞ సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో ఇప్పటికే లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. అయితే ఈ వ్యవహారాన్ని రిపబ్లికన్ పార్టీ నాయకులు చిల్లర వ్యవహారంగా కొట్టి పారేస్తున్నారు.