https://oktelugu.com/

Robot Kidnap : 12 రోబోలు కిడ్నాప్.. చేసింది ఎవరో తెలిస్తే షాక్ కావాల్సిందే!

ఒక చిట్టి రోబో 12 పెద్ద రోబోలను కిడ్నాప్ చేశాయి. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఎందుకంటే ఒక మనిషి కిడ్నాప్ చేయడం వేరే.. కానీ ఒక చిన్న రోబో పెద్ద 12 రోబోలను కిడ్నాప్ చేయడం షాకింగ్ అనే చెప్పవచ్చు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 22, 2024 / 05:09 AM IST

    Robot Kidnap

    Follow us on

    Robot Kidnap :  ఎక్కడైనా ఏ వస్తువులు అయిన సాధారణంగా మనుషులు దొంగతనం చేస్తారు. అలాగే డబ్బులు కోసం లేదా ఇతర కారణాల కోసం మనుషులు కిడ్నాప్ చేస్తారు. కానీ ఓ చిట్టి రోబో మాత్రం తన సహ రోబోలను కిడ్నాప్ చేసిన ఘటన చైనాలో జరిగింది. జనరేషన్ పెరుగుతున్న కొలది రోబోలు వాడకం కూడా పెరిగింది. వీటితో పనులు తొందరగా అవుతాయనే ఉద్దేశంతో వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. కంపెనీలు, రెస్టారెంట్లు ఇలా చాలా ప్రదేశాల్లో వీటిని వాడుతున్నారు. ఇలాంటి ఓ కంపెనీలో పని చేస్తున్న రోబో తనతో పనిచేస్తున్న ఇతర రోబోలను మాటల్లో దింపి కిడ్నాప్ చేసింది. ఒక రోబోను ఇంకో రోబోను కిడ్నాప్ చేయడం ఏంటని అనుకుంటున్నారా.. మీరు విన్నది నిజమే. ఒక చిట్టి రోబో 12 పెద్ద రోబోలను కిడ్నాప్ చేశాయి. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఎందుకంటే ఒక మనిషి కిడ్నాప్ చేయడం వేరే.. కానీ ఒక చిన్న రోబో పెద్ద 12 రోబోలను కిడ్నాప్ చేయడం షాకింగ్ అనే చెప్పవచ్చు.

    చైనాలోని హాంగ్‌ఝౌ అనే ఒక మాన్యుఫాక్చరర్ కంపెనీలో ఎర్బాయ్ అనే రోబో ఉంది. దీనికి ఏఐ సామర్థ్యం కూడా ఉంది. ఈ రోబో షాంఘై రోబోటిక్స్ అనే కంపెనీ షోరూమ్‌కి వెళ్లి అక్కడ ఉన్న భారీ రోబోలను మాటల్లోకి పెట్టింది. అలా అవి మాట్లాడుతూ ఉండగా.. పూర్తిగా విశ్రాంతి లేదని పెద్ద రోబో ఆ చిట్టి రోబోకు చెప్పింది. దీంతో ఆ ఎర్బాయ్ రోబో అయితే నువ్వు ఇంటికి వెళ్లడం లేదా? అని ప్రశ్నించింది. దీనికి ఆ పెద్ద రోబో నాకు ఇల్లు లేదని తెలిపింది. ఆ చిట్టి రోబో నాకు ఇల్లు ఉందని, నువ్వు మాతో ఇంటికి రా అని తెలిపింది. దీంతో ఈ పెద్ద రోబో వెంటనే షో రూమ్ నుంచి ఎర్బాయ్ ఇంటికి వెళ్లింది. ఇలా ఒక్క రోబోనే కాకుండా దాంతో పాటు 12 రోబోలు వారి ఇంటికి వెళ్లసాగాయి. అయితే తర్వాత రోజు షోరూమ్‌లో రోబోలు కనిపించకపోవడంతో ఈ విషయం బయటపడింది. వెంటనే సీసీ కెమెరాలను పరిశీలించగా విషయం వెలుగులోకి వచ్చింది.

    ఇదంతా అబద్ధమని, ఫేక్ వీడియో అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒక చిట్టి రోబో మిగతా రోబోలను కిడ్నాప్ చేయడం ఏంటని అంటున్నారు. అయితే ఇది నిజమేనని షాంఘై, హాంగ్‌ఝౌ కంపెనీలు స్పందించాయి. నిజంగానే చిట్టి రోబో మిగతా పెద్ద రోబోలను కిడ్నాప్ చేసింది. పెద్ద రోబోల సిస్టమ్స్‌లో ఉండే భద్రతా లోపాన్ని గుర్తించాయి. ఆ తర్వాత వాటి చర్యలపై నియంత్రణ సాధించాలని అందుకే కిడ్నాప్ చేసిందని కంపెనీలు తెలిపాయి. ఓ చిట్టి రోబో వెనుక పెద్ద 12 రోబోలు వెళ్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే కొందరు ఇది ఫేక్ అని అంటుంటే మరికొందరు మాత్రం ఈ వీడియోని చూసి షాక్ అవుతున్నారు. ఒక చిన్న రోబో కిడ్నాప్ చేయడం ఏంటని ఆశ్చర్యపడుతున్నారు.