Pawan Kalyan Mala: పవన్ కల్యాణ్ అంటే వ్యక్తి కాదు ఓ శక్తి. ఆయనకున్న అభిమానులు ఎవరికి లేరని తెలిసిందే. పవన్ అంటే ఓ పిచ్చి. ఆయన పేరు చెబితేనే ఊగిపోయే అభిమానులుండటం అదృష్టం. ఇక ఆయన సినిమాలైతే బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే. అంతటి ఘనత సాధించిన పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ద్వారా ప్రజలకు దగ్గరవ్వాలని గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. అపజయాలకు కుంగిపోకుండా విజయాలు సాధించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే పలు కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు చేరువ అవుతున్నారు. రాష్ట్రంలో కౌలు రైతుల బాధలు తీర్చేందుకు వారికి ఆర్థిక సాయం చేస్తూ రాష్ట్రం అంతా పర్యటిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను ఓదారుస్తున్నారు.
పవన్ కల్యాణ్ నాలుగు నెలల దీక్ష చేపట్టారు. రాష్ర్టంలో సమస్యలు లేకుండా ఉండాలని కోరుకుంటూ చతుర్మాస దీక్ష తీసుకున్నారు. దీని ప్రకారం రోజు ఒంటిపూట భోజనం, నేలపై నిద్ర పోవాలి. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, అశ్వీజం మాసాల్లో ఈ దీక్ష కొనసాగనుంది. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే పవన్ ఈ దీక్షకు పూనుకున్నట్లు ప్రకటించారు. అయ్యప్ప, హనుమాన్, భవాని దీక్షలను చూశాం. కానీ ఈ పవన్ దీక్షలను చూడలేదని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ దీక్షకు పవర్ ఫుల్ ఫలితం వస్తుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.
Also Read: BJP New Parliamentary Board: ప్రశ్నించేవారంతా ఔట్.. బీజేపీకి హోల్ అండ్ సోల్ చక్రవర్తి ఇక మోడీనే..
పవన్ మాల వేసుకోవడం ఇదే తొలిసారి కాదు. ఇదివరకు పవన్ అభిమానులు ధరించారు. మెడలో ఎర్రకండువా వేసుకుని 49 రోజుల పాటు నిష్టగా ఉంటారు. సెప్టెంబర్ 2 పవన్ కల్యాణ్ పుట్టిన రోజు. దీంతో అప్పటికి ఈ దీక్ష ముగుస్తుంది. ఆయనకు 49 ఏళ్లు వస్తాయి. దీంతో 49 రోజుల దీక్ష చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం పాలకొల్లుకు చెందిన యువకులు పవన్ కల్యాణ్ మాల ధరించి దీక్షకు పూనుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మాల ధరించి ప్రజలకు సేవ చేస్తున్నట్లు చెబుతున్నారు.
పవన్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ ధ్యేయంగా ప్రకటించారు. ఈ 49 రోజుల పాటు సేవలు చేసి త్వరలో పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించాలని కోరుకుంటున్నారు. దీన్ని జనసేన కార్యకర్తలు కూడా ప్రశంసించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ అభిమానులు దీక్షలు చేపట్టడం సంచలనం కలిగిస్తోంది. రాష్ర్టంలో రాబోయే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రధాన పాత్ర పోషిస్తారని తెలుస్తోంది. వైసీపీ నేతలకు పవన్ కల్యాణ్ తీరు మింగుడు పడటం లేదు. దీంతో సెటైర్లు వేస్తున్నా త్వరలో వారు రిటైరై పోతారని జనసేన సైనికులు చలోక్తులు విసురుతున్నారు.
Also Read:Ram Column: బ్రాహ్మణ, బనియా ముద్ర నుంచి సామాజికన్యాయ దిశగా బీజేపీ పరివర్తన
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: What is pawan kalyan mala how do you do it what is the use of that
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com