Viral video : కొన్ని వీడియోలు వింత కారణాల వల్ల సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. చాలా సార్లు వీడియోలో ఏమి జరుగుతుందో మనకు అర్థం కాదు కూడా. చాలా మంది ఇలాంటి వీడియోల మీద స్పందిస్తుంటారు. వాటిని చూసి షాక్ అవుతుంటారు. సాధారణంగా భారతదేశంలో, వివాహ సమయంలో కొన్ని ప్రాంతాల్లో వరుడు గుర్రంపై స్వారీ చేస్తాడు. కానీ వైరల్ అయిన ఒక వీడియోలో, వరుడు పడుకున్న గుర్రంపై కూర్చుని కనిపించాడు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఊరుకుంటారా? జంతువులపై జరుగుతున్న క్రూరత్వాన్ని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏం జరిగింది? ఎక్కడ జరిగింది వంటి వివరాలు తెలుసుకుందాం. కానీ ఏమి జరిగినా, ఆ జంతువు పట్ల క్రూరత్వం స్పష్టంగా కనిపిస్తుంది. రండి, ఈ వీడియో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం.
Also Read : గుంపులుగా చిరుతలు..ప్లేట్ లో నీళ్ళు పోసి అయీయే అన్నాడు.. అంతే.. వీడియో వైరల్
వీడియోలో పెళ్లి ఊరేగింపు దృశ్యం కనిపిస్తుంది కదా. అందులో వరుడు గుర్రంపై కూర్చొన్నాడు. కానీ ఆ సమయంలో గుర్రము పడుకుని ఉంది. సమీపంలో కూర్చున్న వ్యక్తి వివాహ బృందం సభ్యుల నుంచి డబ్బు తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. వరుడు గుర్రం పడుకున్నా కూడా కనీసం దిగకుండా, దాన్ని నిద్ర కూడా సరిగ్గా పోనివ్వకుండా హాయిగా కూర్చున్నాడు. బహుశా వరుడి ఈ వైఖరిని ప్రజలు ఇష్టపడకపోవచ్చు. కామెంట్ల ద్వారా అతన్ని తీవ్రంగా తిట్టవచ్చు. కానీ నిజంగా ఇప్పుడు అదే జరుగుతుంది కూడా.
మేము ఈ వీడియోను నిర్ధారించము. అది వైరల్ అయింది కాబట్టి దాని గురించి మీకు తెలియజేస్తున్నాము. అయినప్పటికీ, వీడియోలో చూసినట్లుగా, ఇది బరాత్ తన గమ్యస్థానానికి చేరుకునే దృశ్యం మాదిరి ఉంది కదా. అక్కడ వరుడు గుర్రంపై నుండి దిగుతున్నప్పుడు, గుర్రాన్ని మోసేవాడు బహుమతి అడుగుతాడు. అతను అలసిపోయిన గుర్రాన్ని నేలపై పడుకోబెట్టి డబ్బు డిమాండ్ చేయడం ప్రారంభించాడు కావచ్చు. మరి అలాంటి పరిస్థితిలో వరుడు పడుకున్న గుర్రంపై ఎందుకు కూర్చున్నాడు అనే ప్రశ్న కూడా రావచ్చు మీకు?
అనేక ప్రశ్నలు తలెత్తాయి.
అటువంటి పరిస్థితిలో, అనేక ప్రశ్నలను లేవనెత్తే ఈ వీడియో చూసిన తర్వాత ఏమి జరుగుతుందో స్పష్టంగా చెప్పడం కష్టమే. ఎందుకంటే ఈ వీడియోలో క్లారిటీ లేదు. కానీ ఈ స్థితిలో గుర్రంపై కూర్చున్నందుకు వరుడిని ప్రజలు ట్రోల్ చేస్తున్నారు.
కానీ ఇలా చేస్తే ఆ దేవుడు ఎప్పటికీ క్షమించడు అంటూ తిట్టిపోస్తున్నారు ప్రజలు. వరుడి ముఖంలో గుర్రం పట్ల కనికరం కనిపించడం లేదంటూ విమర్శిస్తున్నారు కొందరు. మరికొందరు ఆ జంతువు పట్ల దయ చూపాలని లేదా అంటూ తిడుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చాలా మంది ఫన్నీ ఎమోజీలతో కూడా స్పందిస్తున్నారు. ఈ వీడియో 2 కోట్ల 40 లక్షల వ్యూస్ ను పొందింది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugunews.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
View this post on Instagram