Homeవైరల్ వీడియోస్Most Viewed Reel : అత్యధిక వ్యూస్ వచ్చి గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన రీల్...

Most Viewed Reel : అత్యధిక వ్యూస్ వచ్చి గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన రీల్ ఇదే

Most Viewed Reel : ఇన్‌స్టా, ఫేస్‌బుక్, ఎక్స్, థ్రెడ్, షేర్ చాట్, స్నాప్ చాట్, వాట్సాప్, యూట్యూబ్.. ప్లాట్‌ఫామ్ ఏదైతేనేం.. ప్రస్తుతం యువత సోషల్ మీడియాలో మునిగిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డిమాండ్ ఉన్న సమాచార, వినోద కేంద్రంగా సోషల్ మీడియా మారింది. పిల్లలు, పెద్దలు, యువత తమ భావాలను ఎటువంటి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా వ్యక్తీకరించే అవకాశం ఉన్నందున దీనిని ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. వారు దానిపై తమకు ఇష్టమైన అభిరుచులు, అభిప్రాయాలను పంచుకుంటున్నారు. 2024 లో ప్రపంచవ్యాప్తంగా 5.2 బిలియన్ల మంది సోషల్ మీడియాను ఉపయోగిస్తారని నివేదికలు చెబుతున్నాయి. 280 మిలియన్లకు పైగా ప్రజలు కొత్త సోషల్ మీడియా ఖాతాలను తెరిచారు. మొత్తం మీద, ఈసారి వినియోగం గత సంవత్సరంతో పోలిస్తే 4 రెట్లు పెరిగింది. 2025 లో మరింత వృద్ధి చెందే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

సోషల్ మీడియాలో ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీగా పోర్చుగల్ ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. అతడికి దాదాపు 65 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.అలా ఎక్కువ మంది ఫాలోవర్లను పెంచుకునేందుకు, పాపులర్ కావడానికి కొందరు సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్లు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఎంతటి సాహసాలకైనా తెగిస్తున్నారు. వారి అంతిమ లక్ష్యం ఎక్కువ వ్యూస్ సాధించుకోవడమే. ప్రతి రోజు కొన్ని లక్షల వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ అవుతుంటాయి. మరి ఇంతకు అత్యధిక వ్యూస్ వచ్చిన రీల్ ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా. అదేంటో తెలుసుకుందాం.

ప్రస్తుతం చాలా మంది నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు రీల్స్ చూస్తూనే గడిపేస్తున్నారు. మరి ప్రపంచంలో అత్యధికంగా వీక్షించబడిన రీల్ ఏమిటో మీకు తెలుసా? అది ఏ దేశానికి చెందినది.. ఎన్ని వ్యూస్ సాధించిందో తెలుసుకుందాం. ప్రపంచంలో అత్యధికంగా వీక్షించబడిన రీల్ భారతదేశానికి చెందిన వ్యక్తిది. అవును.. మన దేశంలో కేరళకు చెందిన వ్యక్తి పోస్ట్ చేసిన వాటర్ ఫాల్ రీల్ 554 మిలియన్ వ్యూస్ సాధించింది. మహమ్మద్ రిజ్వాన్ అనే వ్యక్తి జలపాతం దగ్గర రాళ్ల మధ్య ఫుట్‌బాల్‌ను పర్ఫెక్ట్‌గా తన్నాడు. ఈ వీడియోకు 55.4 కోట్ల వ్యూస్, 8.4 లక్షల లైక్స్ వచ్చాయి. ఇన్ని వ్యూస్ వచ్చిన ఈ రీల్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా చేరింది. ప్రపంచంలో మరే రీల్ ఇన్ని వ్యూస్, లైక్స్ సాధించలేదని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చెప్పుకొచ్చింది. కాబట్టి.. మీరు కూడా ఇలాంటి అద్భుతమైన పని చేసి రీల్‌ను తయారు చేయవచ్చు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయవచ్చు.. లక్షల కొద్ది వ్యూస్ సాధించవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by muhammed riswan (@riswan_freestyle)

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular