Elephant : ఏనుగులు శాంతమైన జీవులు. చిర్రెత్తుకొస్తే మాత్రం బీభత్సం చేస్తాయి.. సమీపంలోకి ఏదైనా జంతువు వెళ్తే మడత పెట్టేస్తాయి. మనుషులు వెళితే తొక్కిపడేస్తాయి. ఏనుగులు తమ పిల్లల్ని కాపాడుకోవడంలో చాలా నేర్పరితనాన్ని ప్రదర్శిస్తాయి. ఏనుగు పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు సింహాలు దాడి చేస్తాయి. లేదా ఏనుగు ఒంటరిగా ఉన్నప్పటికీ నాలుగైదు సింహాలు సమూహంగా ఏర్పడి దాడి చేస్తాయి. ఏనుగు మాంసం రుచిగా ఉంటుంది. అందువల్లే సింహాలు ఏనుగు లేదా ఏనుగు పిల్లలపై దాడి చేస్తాయి. ఒకవేళ ఏనుగులు గనక గుంపుగా ఉంటే.. ఏనుగు పిల్లలపై సింహాలు దాడి చేస్తాయి. ఆ సమయంలో నాలుగైదు సింహాలు ఏనుగు పిల్లలపై ఎటాక్ చేసినప్పుడు.. పెద్ద ఏనుగులు కూడా ఏమీ చేయలేవు.. అయితే అరుదైన సందర్భాల్లో మాత్రం తమ పిల్లల్ని కాపాడుకోవడంలో ఏనుగులు సరైన వ్యూహాన్ని అవలంబిస్తాయి. సింహాలు దాడి చేసేందుకు వచ్చినప్పుడు.. తమ పిల్లలను కాపాడుకునేందుకు ఏనుగులు వలయం లాగా ఏర్పడతాయి.. లోపల తమ పిల్లల్ని ఉంచి.. రక్షణ ఏర్పరుస్తాయి.
సింహాలు ఏమీ చేయలేవు
సింహాలు వలయంగా ఏర్పడి.. తమ పిల్లల్ని కాపాడుకునేటప్పుడు సింహాలు కూడా ఏమి చేయలేవు. ఆ సమయంలో దాడి చేసేందుకు ప్రయత్నించలేవు. ఎందుకంటే ఏనుగులు వలయంగా ఏర్పడినప్పుడు సింహాలు గనుక దాడి చేయడానికి ముందుకు వెళ్తే.. ఏనుగులు తొండాలతో సింహాలను కొట్టి చంపేస్తాయి. కెన్యా అడవుల్లో ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. అందువల్లే ఏనుగులు వలయంగా ఏర్పడినప్పుడు అటువైపుగా వెళ్లడానికి సింహాలు ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నించవు. సింహాలు ఎంత బలమైనవి అయినప్పటికీ.. ఏనుగుల జోలికి వెళ్లడానికి సాహాసించవు. సింహాల నుంచి తమ పిల్లలకు ఆపద ఎదురైనప్పుడు ఏనుగులు ఎంత జాగ్రత్తగా ఉంటాయో… చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే ఆ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. సింహాలు మూకుమ్మడిగా ఏనుగు పిల్లలపై దాడి చేయడానికి ముందుకు వచ్చాయి. ఆ సమయంలో పెద్ద ఏనుగులు తమ పిల్లలను కాపాడుకునేందుకు వలయం లాగా ఏర్పడ్డాయి. ఆ వలయంలో ఏనుగు పిల్లలు ఉన్నాయి.. పెద్ద ఏనుగులు చుట్టూ రక్షణ కవచాన్ని ఏర్పరిచాయి. ఈ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.” ఏనుగులు బలమైనవే కాదు.. బుద్ధి జీవులు కూడా. అందువల్లే అవి తమ పిల్లలను సింహాల నుంచి కాపాడుకునేందుకు చక్రవ్యూహాన్ని అమలు చేస్తాయి. చుట్టూ వలయాన్ని ఏర్పరుస్తాయి. వలయానికి ముందు పెద్ద ఏనుగులు ఉంటాయి. వలయంలోపల చిన్న ఏనుగులు ఉంటాయి. అందువల్ల సింహాలు దాడి చేయలేవు. సింహాలు వెళ్లిపోయాయి అని నిర్ధారించుకున్న తర్వాత పెద్ద ఏనుగులు వలయాన్ని విస్మరిస్తాయి. ఆ తర్వాత తమ పిల్లలతో కలిసి వెళ్లిపోతాయి. సాధారణంగా ఏనుగు లేదా ఏనుగు పిల్లలు ఒంటరిగా ఉంటే సింహాలు వదిలిపెట్టవు.. ముకుమ్మడిగా దాడి చేసి చంపి తినేస్తాయి. అయితే పెద్ద ఏనుగులు వలయంగా ఏర్పడితే మాత్రం ఎన్ని సింహాలు వచ్చిన ఏమీ చేయలేవని” ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.
ఏనుగులు చాలా ఎత్తుగా ఉంటాయి. సింహాల కంటే బలంగా ఉంటాయి. ఒంటరి ఏనుగు ఉంటే మాత్రం నాలుగు సింహాలు దాడి చేసి చంపేస్తాయి. ఏనుగులు సమూహంగా ఉంటే గున్నలపై దాడి చేస్తాయి. అలాంటి సమయంలో పిల్లల్ని కాపాడుకునేందుకు ఏనుగులు చేసే ప్రయత్నం వైరల్ గా మారింది. #elephantprotection#loins pic.twitter.com/ddSoX4MVKH
— Anabothula Bhaskar (@AnabothulaB) February 21, 2025