BJP Muslims : ఇటీవల మోడీ ముస్లింలకు దగ్గరకు కావాలనే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఏడాది క్రితమే హైదరాబాద్ లో నిర్వహించిన జాతీయ కార్యవర్గంలోనే దీన్ని అమలు చేశారు. ఇటీవల దాన్ని జనాల్లోకి తీసుకెళ్లారు. ముస్లింలకు దగ్గరకు కావాలనే మోడీ ప్రయత్నం సక్సెస్ అవుతుందా? లేదా అన్నది అసలు ప్రశ్న..
ఇటీవల బీజేపీ ముస్లింలను కలిసి వివరించే అంశాన్ని తీసుకుంది. దేశంలోని 64 ప్రాంతాల్లో ముస్లింల వద్దకు వెళుతున్న బీజేపీ నేతలు వారికి సంక్షేమం గురించి వివరిస్తున్నారు. అయితే ఇది వర్కవుట్ కావడం లేదని అంటున్నారు.
బీజేపీ ప్రధానంగా హిందువుల కోసం ఏర్పడిన పార్టీ. బీజేపీ, జనసంఘ్, ఆర్ఎస్ఎస్ లు హిందుత్వ ఎజెండాతోనే ఏర్పడ్డాయి. ఇటీవల బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు? వాటివల్ల ఏమైనా ప్రయోజనం చేకూరుస్తాయా? అన్నది ప్రశ్న.
మోడీ పథకాల్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు అన్నది చూడకుండా అందరికీ ఇచ్చేశారు. ముస్లింలకు ఆ సంక్షేమ పథకాలు అందడంతో వారు బీజేపీపై సానుభూతి ముస్లింలలో ఉంది. అయితే అది ఓటు బ్యాంకుగా మారుతుందా? లేదా? అన్నది ప్రశ్న.
బీజేపీ ‘ముస్లింలకు చేరువ’ వ్యూహానికి ప్రయోగశాల కాబోతుందా? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు