Yuvraj Singh Son
Yuvraj Singh : ఇక 2011 వన్డే వరల్డ్ కప్ లో శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో సూపర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. టీమిండియాకు వరల్డ్ కప్ అందించాడు. క్యాన్సర్ ఇబ్బంది పెడుతున్నా.. నోట్లో నుంచి రక్తం వస్తున్నా యువరాజ్ సింగ్ ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. పైగా దేశం కోసం పరితపించి ఆడాడు. ప్రాణాన్ని కూడా లెక్కచేయకుండా పరుగులు తీశాడు. రక్తం కక్కుకుంటూ కూడా దేశం కోసం ఆడాడు. అందువల్లే టీం మీడియా శ్రీలంకపై ఘనవిజయం సాధించి.. రెండవసారి వన్డే వరల్డ్ కప్ అందుకుంది. ఇన్ని విజయాలలో ముఖ్యపాత్ర పోషించినప్పటికీ రాజకీయాల వల్ల యువరాజ్ సింగ్ తన కెరియర్ ను అర్ధాంతరంగా ముగించాడు. ఇప్పుడు లెజెండ్ క్రికెట్ లీగ్ లో అదరగొడుతున్నాడు. 43 సంవత్సరాల వయసులోనూ సూపర్బ్ ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఇటీవల శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్లో తిరిమన్నె కొట్టిన బంతిని బౌండరీ లైన్ వద్ద గాల్లోకి అమాంతం ఎగిరి క్యాచ్ పట్టుకున్నాడు. తన విషయంలో వయసు అనేది నెంబర్ మాత్రమేనని.. తనలో జోరు ఎప్పటికీ తగ్గదని యువరాజ్ నిరూపించాడు.
యువరాజ్ ను మించిపోయాడు
యువరాజ్ సింగ్ క్యాన్సర్ కు చికిత్స చేయించుకున్న అనంతరం.. తన చిరకాల ప్రేయసి హేజల్ కీచ్ ను వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ ఓ కుమారుడున్నాడు. అతడు అందంలో యువరాజ్ సింగ్ నే మించిపోయాడు. యువరాజ్ సింగ్ తన కుమారుడిని మీడియాకు అంతగా చూపించలేదు. పైగా అతని విషయంలో సీక్రసీ మెయింటైన్ చేశాడు. చివరికి అతడి కుమారుడు ఎలా ఉన్నాడో బయట ప్రపంచానికి తెలిసిపోయింది. లెజెండరీ క్రికెట్ లీగ్ లో భాగంగా హెజల్ కిచ్ తన కుమారుడితో కలిసి మ్యాచ్లో చూసేందుకు హాజరవుతోంది. ఈ క్రమంలో యువరాజ్ సింగ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తన కుమారుడితో కలిసి సందడి చేసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆ కుర్రాడు కూడా తన తండ్రి యువరాజ్ సింగ్ బ్యాటింగ్ చేస్తున్న సందర్భాన్ని విపరీతంగా ఆస్వాదించాడు. మైదానంలో ఎగిరి గంతులు వేశాడు. తన తల్లి ఒడిలో సరదాగా గడిపాడు. యువరాజ్ సింగ్ కుమారుడిని చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. అందంలో యువరాజ్ సింగ్ ను అతని కుమారుడు మించిపోయాడని.. భవిష్యత్తులో తండ్రి పేరు నిలబెడతాడని సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు..
టీమిండియా స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ హజెల్ కీచ్ ను వివాహం చేసుకున్న సంగతి విధితమే. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో యువి అదరగొడుతున్నాడు. ఈ నేపథ్యంలో హజెల్ తన కుమారుడితో కలిసి మ్యాచ్ చూసేందుకు వచ్చింది..#YuvrajSingh #internationalmasterscricketleague pic.twitter.com/G6eJn0tjT9
— Anabothula Bhaskar (@AnabothulaB) February 25, 2025