Viral Video : ఆస్తుల వ్యవహారం వల్ల జగన్ మరింత బద్నాం అవుతున్న నేపథ్యంలో.. వైసిపి కీలక నేత పేర్ని నాని రంగంలోకి దిగారు.. టిడిపి దూకుడుకు.. దాని అనుబంధ మీడియా చేస్తున్న ప్రచారానికి ముకుతాడు వేయాలని ఉద్దేశంతో సరికొత్త ఆధారాలను తెరపైకి తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు మాతృమూర్తి అమ్మనమ్మ కు మదినగూడ లో 5 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉందట. దానిని ఆమె లోకేష్ పేరు మీద రాశారట. చంద్రబాబు నాయుడు మాతృమూర్తి అమ్మనమ్మకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారందరికీ కూడా సంతానం ఉంది. అయితే అందరిలోనూ కేవలం లోకేష్ కు మాత్రమే ఆమె 5 ఎకరాలు ఆయన పేరు మీద రాశారట. అయితే మిగతా వారి పేరు మీద ఎందుకు రాయలేదు అని పేర్ని నాని ప్రశ్నించారు. ఈ వీడియోను వైసిపి సోషల్ మీడియా అనుబంధ గ్రూప్ లలో తెగ షేర్ చేస్తున్నారు.. దీనికి జనసేన నాయకులు, టిడిపి నాయకులు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఆయనపై ఆరోపణలు చేయలేదని.. నోటీసులు కూడా జారీ చేయలేదని.. ఆ విషయాన్ని పేర్ని నాని ఎలా మర్చిపోయారని వారు గుర్తు చేస్తున్నారు. జగన్ మీద ఆయన సోదరి ఆరోపణలు చేశారని.. ఆస్తులకు సంబంధించి ఇద్దరి మధ్య వివాదాలకు కొనసాగుతున్నాయని.. అవి ఏకంగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ దాకా వెళ్ళాయని.. దానిని కవర్ చేయడం కోసమే నాని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వారు మండిపడుతున్నారు.
ఆసక్తికరమైన విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు..
జగన్ – షర్మిల మధ్య ఆస్తుల వివాదం జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కుటుంబానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని పేర్ని నాని తెరపైకి తీసుకురావడం మీడియాలో చర్చకు దారి తీసింది. మదినగూడ లో ఉన్న ఐదు ఎకరాల భూమిని చంద్రబాబు నాయుడు మాతృమూర్తి అమ్మనమ్మ లోకేష్ పేరు మీద రాసిన విషయం ఇంతవరకు ఎవరికీ తెలియదు. అయితే టిడిపి, దాని అనుబంధ మీడియా పదేపదే జగన్ – షర్మిల మధ్య ఆస్తుల వివాదాన్ని ప్రస్తావించడంతో వైసిపి ఆలస్యంగా రంగంలోకి దిగింది. రాజకీయంగా ఇది నష్టం చేకూర్చుతోందని భావించి.. పేర్ని నాని ద్వారా సంచలన విషయాలను వెల్లడించింది. మదినగూడ 5 ఎకరాల వ్యవసాయ క్షేత్ర విషయాన్ని వైసిపి ప్రస్తావించడంతో.. సాక్షి మీడియా దానిని బొంబాట్ చేసేందుకు ప్రయత్నించింది. అయితే తెలుగుదేశం, జనసేన నాయకులు అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వడంతో మొత్తానికి లోకేష్ పేరు మీద అమ్మనమ్మ రాసిన ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రం వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి తన కుటుంబంలో జరుగుతున్న ఆస్తుల వివాదానికి సంబంధించి తొలిసారి స్పందించారు. ఇది అందరి కుటుంబాలలో జరుగుతున్నదేనని.. చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం ఈ విషయాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ – షర్మిల ఆస్తుల వివాదం ఎటువైపు వెళుతుందో తెలియదు గాని.. ప్రస్తుతానికి అయితే ఏపీ రాజకీయాలలో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
ఇప్పుడు పత్తిత్తు అయిపోయావు.. శ్రీరంగ నీతులు చెబుతున్నావు కనుక.. మదీనాగూడా ఫాం హౌస్ పంచొచ్చుకదా.. pic.twitter.com/m6RLb4tb7s
— Inturi Ravi Kiran (@InturiKiran7) October 24, 2024