https://oktelugu.com/

Viral Video : ఆడవాళ్ళతో పరాచకాలు.. చితకబాదిన మహిళలు.. వీడియో వైరల్

ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో జరిగిన సంఘటన ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. నర్సీపట్నం ప్రాంతానికి చెందిన ఓ యువకుడు జనసేన పార్టీ సోషల్ మీడియా కార్యకర్తగా పనిచేస్తున్నాడు. ఇతడు ఓ యువతిని కొంతకాలంగా వేధిస్తూ వస్తున్నాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 9, 2024 / 01:36 PM IST

    Pokiri

    Follow us on

    Viral Video :   . ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో ఓ పోకిరీకి మహిళలు దేహశుద్ది చేశారు. నర్సీపట్నం ప్రాంతానికి చెందిన ఓ యువకుడు… ఓ యువతిని కొంతకాలంగా వేధిస్తూ వస్తున్నాడు. ఇదే సమయంలో ఆమె అతడిని తనని ఇబ్బంది పెట్టొద్దని వేడుకున్నది. అయినప్పటికీ అతడు తన ధోరణి మానుకోలేదు. పైగా ఆమె ఇంటికి వచ్చి గొడవ చేయడం మొదలుపెట్టాడు. దీంతో ఆ యువతి తట్టుకోలేక తన కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు కూడా చెప్పి చూశారు. అయినప్పటికీ అతడు తన పద్ధతి మార్చుకోలేదు. ఒకరోజు ఆ యువతి ఇంటి మీదికి ఆ యువకుడు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు అతన్ని పట్టుకున్నారు. ముకుమ్మడిగా దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో విస్తృతమైన ప్రచారంలో ఉంది.

    పోలీస్ కేసు నమోదయిందో? లేదో?

    ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు అయిందో? లేదో తెలియ రాలేదు. ఆ వీడియోలో ఆ యువకుడిని ఆ యువతి కుటుంబ సభ్యులు పట్టుకున్నారు. ఆమె అతడిని దూషిస్తూ చెంప దెబ్బలు కొట్టింది. ఒక మహిళ అయితే చెప్పుతో అతడిపై దాడి చేసింది. ఆ తర్వాత ఆ యువతి కుటుంబ సభ్యులు అతడితో అసలు విషయం చెప్పించారు. దీనిని కొంతమంది వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు.  ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.