https://oktelugu.com/

Viral Video: రూపాయి ఖర్చులేని వాషింగ్ మెషిన్.. ఆ మహిళ తెలివికి అవాక్కవుతున్న నెటిజన్లు…

Viral Video: ఒక మహిళ మాత్రం వినూత్నంగా అలోచించి తన చేతులకు పని లేకుండా తానూ ఉతికిన బట్టలను ఆరబెట్టేందుకు ఒక కొత్త టెక్నీక్ ను ప్రదర్శించింది.ఆ మహిళ తెలివి చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.పూర్తిగా చెప్పాలంటే...

Written By:
  • Srinivas
  • , Updated On : July 9, 2024 / 05:29 PM IST

    Woman innovative technique of using bucket to dry her washed clothes

    Follow us on

    Viral Video: అవసరాన్ని బట్టి మనిషి కొత్తగా ఆలోచిస్తూ ఉంటాడు.అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు.కొంతమంది తమ మెదడుకు పని పెట్టి కొత్త టెక్నిక్ లు కనిపెట్టి తమ పనిని ఈజీ గా పూర్తి చేసుకుంటారు.సాధారణంగా మహిళలు బట్టలు ఉతికిన తర్వాత ఆ బట్టలను చేతులతో పిండి వాటిని ఆరేస్తారు.

    కానీ ఒక మహిళ మాత్రం వినూత్నంగా అలోచించి తన చేతులకు పని లేకుండా తానూ ఉతికిన బట్టలను ఆరబెట్టేందుకు ఒక కొత్త టెక్నీక్ ను ప్రదర్శించింది.ఆ మహిళ తెలివి చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.పూర్తిగా చెప్పాలంటే…సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి అనేక దేశీ జుగాడులు వైరల్ అవుతున్నాయి.కొంతమంది సైకిల్ ను బైక్ లాగా మార్చుకొని వాడుతుంటే మరికొంత మంది బైక్ ను కారు లాగా చేసుకొని వాడేస్తున్నారు.

    ఇక మహిళలు అయితే తమ ఇంటి పనులు ఈజీ గా పూర్తి చేసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు.ఇటీవలే ఒక మహిళ ఇటుకలతో వాషింగ్ మెషిన్ తయారు చేసిన సంగతి అందరికి తెలిసిందే.తాజాగా ఒక మహిళ బకెట్ ను ఉపయోగించి ఈజీ గా బట్టలు ఆరబెట్టేందుకు చేసిన కొత్త టెక్నీక్ వీడియొ నెట్టింట్లో వైరల్ అవుతుంది.ఒక మహిళ ఒక బకెట్ ను తాడుకు వేలాడదీసింది.వేలాడదీసిన బకెట్ లో ఉన్న తాడును ఎన్నో మెలికలుగా తిప్పింది.ఆ తర్వాత ఉతికిన బట్టలను ఆ బకెట్ లో వేసి వదిలేసింది.

    తాడు మెలికలు తిరిగి ఉండడంతో ఆ బకెట్ గిరగిరా వేగంగా తిరుగుతుంది.ఈ క్రమంలో ఆ బకెట్ లో ఉన్న ఉతికిన బట్టల లోని నీరు మొత్తం బయటకు వస్తుంది.వాషింగ్ మెషిన్ లోని డ్రైయర్ ఏ విధంగా బట్టలను పిండుతుందో ఆమె అదే విధంగా బకెట్ ను ఉపయోగించి బట్టలను పిండింది.వైరల్ అవుతున్న ఈ వీడియొ లో ఆ మహిళ చేసిన పనికి నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.